OTT: ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ- నైతిక సందిగ్ధత గురించి చెబుతుంది, తండ్రీకొడుకుల అనుబంధంతో- సుహాస్, నరేష్ కామెంట్స్!

Suhas VK Naresh Comments On Hey Balwanth OTT Release: ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ హే బల్వంత్ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 31న హే బల్వంత్ ఓటీటీ రిలీజ్ కానుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో సుహాస్, నటుడు వీకే నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ విషయాలపై లుక్కేద్దాం.

Published on: Mar 27, 2026, 18:05:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆ సినిమానే హే బల్వంత్. హే బల్వంత్ సినిమాకు గోపి ఆచార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు కో రైట‌ర్‌గానూ వ‌ర్క్ చేశారు. ఈ సినిమాలో సుహాస్‌, శివాని నాగరం హీరో హీరోయిన్లుగా న‌టించగా.. ప్రముఖ నటుడు వీకే నరేష్ కీల‌క పాత్ర‌ను పోషించారు.

ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ- నైతిక సందిగ్ధత గురించి చెబుతుంది, తండ్రీకొడుకుల అనుబంధంతో- సుహాస్, నరేష్ కామెంట్స్!
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ- నైతిక సందిగ్ధత గురించి చెబుతుంది, తండ్రీకొడుకుల అనుబంధంతో- సుహాస్, నరేష్ కామెంట్స్!

తండ్రి చేసే వ్యాపారం తెలియడంతో

త్రిశూల్ విజ‌న‌రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై బి.న‌రేంద్ర రెడ్డి ఈ మూవీని నిర్మించారు. గుంటూరు నేప‌థ్యంలో ‘హే బ‌ల్వంత్‌’ సినిమాను రూపొందించారు. యువ‌కుడైన కృష్ణ‌(సుహాస్‌)కు తండ్రి వ్యాపారాన్ని కొన‌సాగించాల‌నే ఆస‌క్తి ఉంటుంది. అయితే త‌న తండ్రి చేసే వ్యాపారం ఏదో తెలియ‌డంతో త‌ను షాక‌వుతాడు.

ప్రేమ నైతిక విలువలు

అదే స‌మ‌యంలో మిత్ర‌ (శివానీ నాగ‌రం)తో ప్రేమ‌లో ఉంటాడు. మిత్ర ఓ ఎన్‌జీఓను న‌డుపుతుంటుంది. ప్రేమ, నైతిక విలువలు, తన తండ్రి రావు బాల్వంత్ చేసే బిజినెస్ విషయం తెలిస్తే ఏమ‌వుతుంద‌నే ఆలోచ‌న‌ల‌ మధ్య కృష్ణ‌ ఇరుక్కుపోతాడు.

నిజానిజాలు ఏంటీ

ఈ క్ర‌మంలో వ‌చ్చే క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ, తండ్రీ కొడుకు మ‌ధ్య అనుబంధం, అస‌లేం జ‌రిగింద‌నే నిజానిజాలు, చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు?, తండ్రి చేసే వ్యాపారం ఏంటీ? అనేదే అస‌లు క‌థాంశంగా హే బలవంత్ సినిమా రూపొందింది.

హే బల్వంత్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇలా ఫ్యామిలీ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన హే బల్వంత్ ఓటీటీలోకి వచ్చేయనుంది. మార్చి 31 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి నాలుగు భాషల్లో హే బల్వంత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. జీ5లో హే బల్వంత్ ఓటీటీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని తాజాగా ఇవాళ (మార్చి 27) అధికారికంగా ప్రకటించారు.

హీరో సుహాస్ కామెంట్స్

హే బల్వంత్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. "ఈ సినిమా నాకెంతో నచ్చింది. ఎందుకంటే ఇది ఆశయాలు, కుటుంబం, మనం ఎక్కువగా పట్టించుకోని నైతిక సందిగ్ధత గురించి చెబుతుంది" అని అన్నాడు.

జీ5 ఓటీటీ ద్వారా

"సినిమాలో మంచి కామెడీ ఉంది. అలాగే హృద‌యాన్నిహ‌త్తుకునే భావోద్వేగం ఉంది. నిజాయ‌తీతో చేసిన ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల దగ్గరకు చేరుతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మ‌రింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంద‌ని న‌మ్మ‌క‌ముంది" అని సుహాస్ తెలిపాడు.

వైవిధ్యమైన, అర్థవంతమైన కథలు

అలాగే, సీనియ‌ర్ న‌టుడు వీకే న‌రేష్ మాట్లాడుతూ.. "హే బల్వంత్ సినిమాలో తండ్రీ కొడుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఇందులో బల్వంత్ పాత్ర చేయ‌టం సాధార‌ణ విష‌యం కాదు. న‌టుడిగా నాలో భిన్న‌మైన కోణాన్ని ఆవిష్క‌రించిన సినిమా ఇది. వైవిధ్య‌మైన‌, అర్థవంతమైన తెలుగు కథలను ఎప్పటికప్పుడు ప్రోత్సహించే జీ5 ఓటీటీలో ఈ సినిమా విడుదలవడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More