ఇంటర్ పాసయితే ఆటో డ్రైవర్‌తో పెళ్లి చేస్తానని డాడీ అన్నారు: లిటిల్ హార్ట్స్ హీరోయిన్ శివాని నాగరం- ఎంబీఏ చేస్తే అతనితో!

లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిపుల్ శివాని నాగరం. మరోసారి సుహాస్‌తో శివాని నాగరం కలిసి నటించిన సినిమా హే బల్‌వంత్. ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల అయింది. అయితే, హే బల్‌వంత్ సినిమా ప్రమోషన్స్‌లో ఆటో డ్రైవర్‌తో పెళ్లిపై శివాని నాగరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Feb 21, 2026, 05:35:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ తెలుగు హీరోయిన్లలో బ్యూటిపుల్ శివాని నాగరం ఒకరు. సుహాస్ హీరోగా తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో శివాని నాగరం బాగానే క్లిక్ అయింది. అనంతరం కొంచెం గ్యాప్ తర్వాత లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటి.

ఇంటర్ పాసయితే ఆటో డ్రైవర్‌తో పెళ్లి చేస్తానని డాడీ అన్నారు: లిటిల్ హార్ట్స్ హీరోయిన్ శివాని నాగరం- ఎంబీఏ చేస్తే అతనితో!
ఇంటర్ పాసయితే ఆటో డ్రైవర్‌తో పెళ్లి చేస్తానని డాడీ అన్నారు: లిటిల్ హార్ట్స్ హీరోయిన్ శివాని నాగరం- ఎంబీఏ చేస్తే అతనితో!

కాత్యాయనిగా క్రేజ్

లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయనిగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది శివాని నాగరం. ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి సుహాస్‌తో జత కట్టి శివాని నాగరం నటించిన సినిమా హే బల్‌వంత్. ముందు ఈ సినిమా పేరు హే భగవంత్‌గా ఉండేది.

పలు అనివార్య కారణాల వల్ల రీసెంట్‌గా ఆ టైటిల్ మార్చి హే బలవంత్‌గా పెట్టారు. సుహాస్ హీరోగా శివాని నాగరం హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు గోపి ఆచార్య దర్శకత్వం వహించారు. నరేష్, సుదర్శన్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

పాడ్‌కాస్ట్‌లో కామెంట్స్

తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన హే బల్‌వంత్ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల అయింది. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్‌లో హీరోయిన్ శివాని నాగరం పాల్గొంది. ఈ కార్యక్రమంలో తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

హీరోయిన్ శివాని నాగరం తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. "ఇంటర్ తర్వాత ఇక చాలు చదువుకోడం లైట్ అనుకున్నాను. కానీ మా నాన్న ఒకటి చెప్పారు. నువ్వు ఇంటర్ పాస్ అయితే (ఇంటర్ వరకు చదువు ఆపేస్తే అన్నఅర్థంలో) ఆటో వాడితో పెళ్లి చేస్తా అన్నారు" అని తెలిపింది.

అంత చదువుకుని

శివాని నాగరం కొనసాగిస్తూ.. "డిగ్రీ పాస్ అయితే బస్సోడు.. కారు ఓనరు, క్యాబ్ డ్రైవర్ కావాలంటే నువ్వు కనీసం ఎంబీఏ చేయాలి అన్నారు. ఎంబీఏ చేస్తే క్యాబోడు వస్తాడ నాకు అనుకున్నా. తప్పుగా అనుకోకండి (క్యాబ్ డ్రైవర్ల గురించి). కానీ, నిజంగానా.. అంత చదువుకున్నా, అంత కష్టపడ్డా.. ఇదంతా చేసి" అని చెప్పుకొచ్చింది.

దానికి హోస్ట్ నవ్వుతూ.. "ఎంబీఏ చేసి ఓటీపీ చెప్పాలా" అని అన్నారు. దానికి నవ్విన శివాని నాగరం.. "నేనే కారు నేర్చుకుని నేనే క్యాబ్ డ్రైవర్ అవుతా అనిపించింది.. అది చూసి మా డాడీ.. నువ్వు అసలు ఎలా ఆలోచిస్తున్నవ్ బేటా.. అని గివప్ ఇచ్చేశారు" అని వెల్లడించింది.

ప్లే గ్రౌండ్ కూడా లేదు

అనంతరం ఇంటర్‌లో నారాయణ చైతన్య కాలేజీలో జాయన్ అవుదామని, మనం చదువుకోవాల్సిన అవసరం లేదని వాడే చదివిపిస్తాడని అనుకున్నట్లు శివాని నాగరం తెలిపింది. "కానీ, మా డాడీ స్ట్రిక్ట్‌గా నో. నారాయణ చైతన్య నో. అక్కడ ప్లే గ్రౌండ్ కూడా లేదు. ఎందుకు అక్కడ నువ్వు అన్నారు" అని శివాని పేర్కొంది.

"నేను ఆయన్ని కాలేజీకి మరి పట్టుకపోయి చూపించాను. వాళ్లు చెబుతుంటే సర్ మేను రాత్రి 7 వరకు పిల్లలను పంపించము. ఈ పది సమ్స్ చేయకుంటే పంపము. ప్రతి వారం ఒక టెస్ట్ ఉంటది. దాన్నిబట్టి ఏ, బీ సెక్షన్స్ (చదువు రానివాళ్లకు) పెడతాం అన్నాడు" అని శివాని నాగరం చెప్పింది.

నాకు అడ్మిషన్ ఇచ్చినట్లే

"అదంతా విన్నాక మా డాడీ ఏం స్కూల్ ఇది.. ఏం బేఖార్, ఏం గలీజ్ స్కూల్ ఇది. ఏం అవసరం లేదు అన్నాడు. అదంతా చూసి ఇక వీడు నాకు అడ్మిషన్ ఇచ్చినట్లే అనుకున్నా. నడు ఇక్కడి నుంచి అని చెప్పి తీసుకెళ్లి ఫ్రాన్సిస్‌ల వేశారు" అని తన స్కూల్, పెళ్లిపై హీరోయిన్ శివాని నాగరం వెల్లడించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More