OTT Telugu: ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 10 కోట్ల డ్రగ్ చుట్టు తిరిగే జీవితాలు- 2 వారాల్లోనే!

Today OTT Telugu Crime Thriller Release: ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా తెలుగు సస్పైన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రేపు ఉదయం 10 గంటలకు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. చైతన్య రావు, హెబ్బా పటేల్, అభినవ్ గోమటం, కిరీటి కీలక పాత్రలు పోషించిన రేపు ఉదయం 10 గంటలకు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Mar 27, 2026, 12:46:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్‌ను సదరు ప్లాట్‌ఫామ్స్ లేదా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేస్తారు. కానీ, కొన్నిసార్లు మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సర్‌ప్రైజ్ ఇస్తూ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి.

ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 10 కోట్ల డ్రగ్ చుట్టు తిరిగే జీవితాలు- 2 వారాల్లోనే!
ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 10 కోట్ల డ్రగ్ చుట్టు తిరిగే జీవితాలు- 2 వారాల్లోనే!

సడెన్‌గా ఓటీటీలోకి

ఇప్పుడు అలాంటి సినిమా గురించే తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలైన కేవలం 2 వారాల్లోనే ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సడెన్‌గా ఇవాళ (మార్చి 27) ఓటీటీలోకి వచ్చింది ఓ తెలుగు మూవీ. ఆ సినిమానే "రేపు ఉదయం 10 గంటలకు". తెలుగులో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా "రేపు ఉదయం 10 గంటలకు" మూవీ తెరకెక్కింది.

చెందు మొద్దు దర్శకత్వ సినిమాలు

ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్, చైతన్య రావు, అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, సాహితి అవంచ, వాసు ఇంటూరి, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు ఈ "రేపు ఉదయం 10 గంటలకు" మూవీకి దర్శకత్వం వహించారు.

మార్చి 14న థియేట్రికల్ రిలీజ్

మాస్ మీడియా సమర్పణలో తెరకెక్కిన "రేపు ఉదయం 10 గంటలకు" చిత్రానికి రామ్ వీరపనేని నిర్మించారు. ప్రిన్స్ హెన్రీ సంగీతం, సునీల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, వెంకట్ ప్రభు ఎడిటింగ్ వర్క్స్ చేపట్టారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్, గ్లింప్స్‌తో ఆకట్టుకున్న "రేపు ఉదయం 10 గంటలకు" మార్చి 14న థియేటర్లలో విడుదల అయింది.

రేపు ఉదయం 10 గంటలకు ఓటీటీ స్ట్రీమింగ్

అయితే, ఈ సినిమా ఎప్పుడు విడుదల అయింది, వెళ్లిపోయిందనే విషయం తెలియలేదు. సడెన్‌గా కేవలం 2 వారాల్లోనే అంటే థియేట్రికల్ రిలీజ్ అయన 14వ రోజునే "రేపు ఉదయం 10 గంటలకు" ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రేపు ఉదయం 10 గంటలకు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

శ్రీరామ నవమి సందర్భంగా

ఇవాళ (మార్చి 27) శ్రీరామ నవమి సందర్భంగా అమెజాన్ ప్రైమ్‌లో రేపు ఉదయం 10 గంటలకు సినిమా ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం తెలుగు భాషలో మాత్రమే "రేపు ఉదయం 10 గంటలకు" ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమాలోని పాత్రల జీవితాలు రూ. 10 కోట్ల డ్రగ్ చుట్టూ తిరుగుతాయి.

10 కోట్ల డ్రగ్ చుట్టూ

కాల్ గర్ల్, ఆమెను ప్రేమించే యువకుడు, అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరు లవర్స్, డ్రగ్ డీలర్, ఒక ఎస్సై ఇలా విభిన్న లైఫ్ స్టైల్ గల వ్యక్తుల జీవితాలు ఆ 10 కోట్ల డ్రగ్‌తో ముడిపడి ఉంటాయి. అలా ఎందుకు ముడిపడి ఉంది? రేపు ఉదయం 10 గంటలకు? అందరి జీవితాల్లో జరిగే మార్పు ఏంటీ అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

థియేటర్లలో మిస్ అయిన వాళ్లు లేదా తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న రేపు ఉదయం 10 గంటలకు సినిమాను నేటి నుంచే చూసి ఎంజాయ్ చేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More