OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు- 7 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 4- తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్!
Friday OTT Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 7 సినిమాలు ఉంటే, అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటన్నింట్లో ఒకేదాంట్లో 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. యాక్షన్ క్రైమ్, రొమాంటిక్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. అలాగే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ రిలీజ్ అయిన నేటి సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మర్దానీ 3 (హిందీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 27
మస్తిష్క మరణం (మలయాళం సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- మార్చి 27
బీటీఎస్ ది రిటర్న్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మ్యూజికల్ డాక్యుమెంటరీ చిత్రం)- మార్చి 27
53 సండేస్ (స్పానిష్ కామెడీ డ్రామా ఫిల్మ్)- మార్చి 27
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఓ రోమియో (హిందీ రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ లవ్ యాక్షన్ డ్రామా మూవీ)- మార్చి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- మార్చి 27
జీ5 ఓటీటీ
ప్రజాపతి 2 (బెంగాలీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మార్చి 27
హే కే నవీన్ (Hey Kay Navin) (మరాఠీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 27
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
వళతు వషతే కల్లన్ (మలయాళం క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మార్చి 27 (మనోరమ మ్యాక్స్ ఓటీటీ)
రిటర్న్ టు ది జురాసిక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 27
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ముత్తు అలియాస్ కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రూరల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 27
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
ఫర్ ఆల్ మ్యాన్‌కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ హిస్టరీ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 27
సన్ నెక్ట్స్ ఓటీటీ
మాయ బింబుమ్ (తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ)- మార్చి 27
ఓటీటీలోకి ఇవాళ 13 సినిమాలు
ఇలా ఇవాళ (మార్చి 27) ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా విజయ్ సేతుపతి ముత్తు అలియాస్ కాట్టాన్, మస్తిష్క మరణం, రిటర్న్ టు ది జురాసిక్, రాణి ముఖర్జీ మర్దానీ 3, బీటీఎస్ ది రిటర్న్, వళతు వషతే కల్లన్, షాహిద్ కపూర్ ఓ రోమియోతో కలిపి 7 సినిమాలు ఉన్నాయి.
ఒక్కదాంట్లోనే 4, తెలుగులో 3
వీటిలో మరింత ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో కేవలం మూడు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక వీటన్నింటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే ఏకంగా 4 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


