OTT Crime: ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- ఒక ఫోన్ నెంబర్, ఎన్నో మిస్టరీలు- ఊహించని ట్విస్టులతో సీక్వెల్!
OTT Psychological Crime Thriller Streaming: పంజాబీలో సూపర్ హిట్ కొట్టిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పంఛీకి సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా పంఛీ 2. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయిన పంఛీ 2 చిత్రం ఒక ఫోన్ నెంబర్, ఎన్నో మిస్టరీలతో సాగుతుంది. ఊహించని ట్విస్టులున్న పంఛీ 2 ఓటీటీ రిలీజ్‌పై లుక్కేద్దాం.
ఓటీటీల హవా పెరిగినప్పుటి నుంచి ప్రతి సినీ ఇండస్ట్రీ నుంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్‌లతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. అలా, ఇటీవల కాలంలో పంజాబీ చిత్ర పరిశ్రమ నుంచి కూడా విభిన్నమైన కథలు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

పక్షి అనే అర్థం
ఆ వరుసలో సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ 'పంఛీ 2' (Panchhi 2). పంఛీ అంటే పంజాబీ భాషలో పక్షి అనే అర్థం వస్తుంది. మొదటి భాగం అందించిన ఉత్కంఠను కొనసాగిస్తూ, భావోద్వేగాలు, సంబంధాలు, ఊహించని మలుపులతో ఈ సీక్వెల్ ఓటీటీ రిలీజ్ అయింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
2021లో ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చి సూపర్ హిట్ అయిన సినిమానే పంఛీ. ఈ మొదటి పార్ట్ పంఛీకి ఐఎమ్‌డీబీలో పదికి 7.5 రేటింగ్ ఉంది. అలాంటి పంఛీకి సీక్వెల్‌గా పంఛీ 2 ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది నేరుగా పంఛీ 2 ఓటీటీ రిలీజ్ అయింది.
ఆకట్టుకునే నటన.. బలమైన పాత్రలు
ఈ చిత్రంలో ప్రిన్స్ కన్వల్జిత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, ఆరుషి శర్మ, నైక్రా ధిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. పంఛీ పాత్రలో ప్రిన్స్ కన్వల్జిత్ సింగ్ మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఆరుషి, నైక్రా తమ నటనతో కథకు ఎమోషనల్ డెప్త్‌ను జోడించారు. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండటంలో వీరి నటన కీలక పాత్ర పోషించింది.
ఒక ఫోన్ నంబర్.. ఎన్నో మిస్టరీలు!
పంఛీ (ప్రిన్స్ కన్వల్జిత్ సింగ్) తన ప్రేయసి షాలు చనిపోయిందని భావించి బాధలో ఉంటాడు. కానీ, అనుకోకుండా ఆమె ఫోన్ నంబర్ నుంచి రిప్లై రావడం, ఫోన్ కాల్స్ రావడం మొదలవుతుంది. ఆ గొంతు షాలుది కాదని తెలిసినా పంఛీ ఆ స్వరాన్ని ప్రేమిస్తాడు. ఆ ఫోన్ నంబర్ మరొకరి చేతుల్లోకి మారినప్పుడు కొత్త ప్రేమ చిగురిస్తుంది. కానీ అదే సమయంలో అనుమానాలు కూడా మొదలవుతాయి.
వణుకు పుట్టించే నిజాలు
ఒకానొక దశలో పంఛీ పైనే హత్యారోపణలు వస్తాయి. ఈ క్రమంలోనే తన కుటుంబం గురించి, ఒక పారిపోయిన హంతకుడి గురించి వెన్నులో వణుకు పుట్టించే నిజాలు పంఛీకి అతనికి తెలుస్తాయి. చివరకు పంఛీ ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? తన గతాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా కథ.
పంఛీ ఓటీటీ స్ట్రీమింగ్
ఎన్నో మిస్టరీలు, ఊహించని ట్విస్టులతో తెరకెక్కిన ఈ సీక్వెల్ పంఛీ 2 ఓటీటీలోకి నిన్న (మార్చి 25) వచ్చేసింది. పంజాబీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ చౌపల్‌లో నేరుగా పంఛీ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కేవలం పంజాబీ భాషలోనే పంఛీ 2 చౌపల్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


