Badshah Wedding: బాద్‌షా రెండో పెళ్లి? పంజాబీ నటి ఇషా రిఖీతో సీక్రెట్ వెడ్డింగ్.. ఫోటోలు వైరల్!

Badshah Wedding: పాపులర్ ర్యాపర్, సింగర్ బాద్‌షా రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. పంజాబీ నటి ఇషా రిఖీని అతను సీక్రెట్ గా వివాహం చేసుకున్నాడని సమాచారం. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత వీళ్లు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీళ్ల ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: Mar 25, 2026, 06:05:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ర్యాపర్, సింగర్ బాద్‌షా మళ్లీ పెళ్లి పీటలెక్కాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. పంజాబీ నటి ఇషా రిఖీతో బాద్‌షా అత్యంత సన్నిహితుల మధ్య సీక్రెట్ గా వివాహం చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. వీరు ఈ విషయాన్ని అఫీషియల్ గా ఇంకా కన్ఫామ్ చేయలేదు. కానీ ఇషా తల్లి పూనమ్ రిఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.

బాద్‌షా, ఇషా రిఖీ
బాద్‌షా, ఇషా రిఖీ

బాద్‌షా రెండో పెళ్లి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలలో వధూవరులు బాద్‌షా, ఇషా రికీ సంప్రదాయ దుస్తులలో మెరిసిపోతూ కనిపించారు. వరమాల వేసుకోవడం వంటి ఆచారాలలో ఈ జోడీ పాల్గొన్న దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎవరూ అఫీషియల్ గా స్పందించలేదు.

ఫ్యాన్స్ రియాక్షన్

ర్యాపర్ బాద్‌షా రెండో పెళ్లి పట్ల ఫ్యాన్స్ రియాక్షన్ కూడా వైరల్ గా మారింది. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సడన్ సర్ప్రైజ్ బాద్‌షా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఎవరీ ఇషా రిఖీ?

చండీగఢ్‌కు చెందిన ఇషా రిఖీ మోడలింగ్ నుంచి నటన వైపు అడుగులు వేసింది. పంజాబీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మొదట 'జట్ట్ అండ్ జూలియట్' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. 2013లో 'జట్ట్ బాయ్స్ పుట్ జట్టాన్ దే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'హ్యాపీ గో లక్కీ', 'వాట్ ది జట్ట్!!' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రాంతీయ సినిమాలో మంచి గుర్తింపు పొందింది.

బాలీవుడ్ ఎంట్రీ

ఇషా రిఖీ 'నవాబ్‌జాదే' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఇందులో రాఘవ్ జుయల్, పునీత్ పాఠక్‌లతో కలిసి నటించింది. విశేషమేమిటంటే ఇదే చిత్రంలో బాద్‌షా కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం బాద్‌షా, ఇషా గత నాలుగేళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తమ సంబంధాన్ని వీళ్లు చాలా సీక్రెట్ గా ఉంచారు. బహిరంగంగా ఎప్పుడూ కలిసి కనిపించకపోవడంతో వీరి పెళ్లి వార్త ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.

బాద్‌షా లైఫ్

బాద్‌షా గతంలో జాస్మిన్ మసిహ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు మనస్పర్థల కారణంగా 2020లో విడిపోయారు. వారికి జెస్మీ గ్రేస్ మసిహ్ సింగ్ అనే కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు ఇషా రిఖీతో బాద్‌షా కొత్త జీవితాన్ని ప్రారంభించాడనే వార్తలు తెగ వైరల్ గా మారాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More