Hansika: ఫ్రెండ్ భర్తతోనే పెళ్లి.. ఇప్పుడు విడాకులు.. హన్సికపై నెటిజన్లు ఫైర్.. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరంటూ!

Hansika: స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ విడాకుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోహైల్ ఖతూరియా నుంచి ఆమె విడిపోయింది. అయితే నెటిజన్లు హన్సికపై ఫైర్ అవుతున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని పోస్టులు పెడుతున్నారు. 

Published on: Mar 12, 2026, 11:14:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో అల్లు అర్జున్ హీరోగా దేశముదురు సినిమాతో హీరోయిన్ గా హన్సిక మోత్వానీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ట్విస్ట్ లు ఉన్నాయి. తాజాగా సోహైల్ ఖతూరియా నుంచి ఆమె విడాకులు తీసుకుంది. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీళ్లకు విడాకులు మంజూరు చేసింది. అయితే హన్సికపై నెటిజన్లు ఇప్పుడు తెగ ఫైర్ అవుతున్నారు.

మాజీ భర్తతో హన్సిక
మాజీ భర్తతో హన్సిక

హన్సిక, సోహైల్ పెళ్లి

హన్సిక మోత్వానీ, సోహైల్ ఖతూరియా పెళ్లికి ముందు కొంతకాలం డేటింగ్ ఛేశారు. 2022లో జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో ఘనంగా వీళ్ల వెడ్డింగ్ జరిగింది. అయితే 2022, జులై 2 నుంచి వీళ్లు సెపరేట్ గా ఉంటున్నారు. ఇప్పుడు అఫీషియల్ గా విడాకులు తీసుకున్నారు.

నెటిజన్లు ఫైర్

హన్సిక మోత్వానీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే దీనికో కారణం ఉంది. సోహైల్ ఖతూరియా ఫస్ట్ రింకీ బజాజ్ ను పెళ్లి చేసుకున్నాడు. రింకీ బజాజ్ ఎవరో కాదు హన్సిక మోత్వానీ క్లోజ్ ఫ్రెండ్. రింకీ, సోహైల్ పెళ్లికి హన్సిక వెళ్లింది. ఈ వెడ్డింగ్ లో ఆమె తెగ సందడి చేసింది.

ఫస్ట్ భార్యను వదిలేసి

రింకీ, సోహైల్ పెళ్లి తర్వాత సోహైల్, హన్సిక క్లోజ్ అయ్యారని అంటున్నారు. దీంతో రింకీని సోహైల్ వదిలేశాడనే అభిప్రాయాలున్నాయి. రింకీని వదిలేసి హన్సికను సోహైల్ పెళ్లి చేసుకున్నాడని చెప్తారు. ఇప్పుడు సోహైల్, హన్సిక విడాకులు తీసుకున్నారు. దీంతో కర్మ ఎవరిని వదలదని నెటిజన్లు హన్సికపై తీవ్రంగా మండిపడుతున్నారు.

కర్మ నుంచి తప్పించుకోలేరు

‘‘కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరూ దాన్ని ఎదుర్కోవాల్సిందే’’.. ఇదీ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు. తన ఫ్రెండ్ భర్తను హన్సిక పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి ఈ యూజర్ ఇలా పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.

బెస్ట్ ఫ్రెండ్ భర్త

‘‘బెస్ట్ ఫ్రెండ్ భర్తను పెళ్లి చేసుకోవడం ఏంటీ? ఫ్రెండ్ పెళ్లికి అటెండ్ కావడం, వాళ్లకు డివోర్స్ అయ్యాక అతణ్నే పెళ్లి చేసుకోవడం ఏంటీ? నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు విడాకులు. ఈమెకు ఇంకా తమిళనాడులో గుడి కట్టారు. పిచ్చి జనాలు’’ అని ఓ యూజర్ కాస్త ఘాటుగానే ఎక్స్ లో విమర్శించాడు.

భరణం కోరకుండా

సాధారణంగా విడాకులు తీసుకునే అమ్మాయిలు తమ మాజీ భర్త నుంచి భరణం కోరుతారు. కొన్ని కోట్ల భరణం తీసుకున్న మహిళలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ హన్సిక మాత్రం సోహైల్ నుంచి ఎలాంటి భరణం తీసుకోలేదు. భరణం వద్దని ఆమె చెప్పినట్లు తెలిసింది. చిన్న చిన్న కారణాలకే గొడవలు పడటం వల్ల హన్సిక, సోహైల్ విడాకులు తీసుకున్నారని సమాచారం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More