Hansika Divorce: హన్సికకు విడాకులు.. నాలుగేళ్ల తర్వాత భర్తతో విడిపోయిన నటి.. భరణం అవసరం లేదంటూ..

Hansika Divorce: నటి హన్సిక మోత్వానీ విడాకులు తీసుకుంది. భర్త సోహైల్ కతూరియాతో విడిపోయింది. నాలుగేళ్ల బంధానికి తెరదించుతూ ఇద్దరికీ బాంద్రా కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే నటి తనకు భరణం అవసరం లేదని చెప్పడం గమనార్హం.

Published on: Mar 11, 2026, 18:26:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ నటి హన్సిక మోత్వానీ, ఆమె భర్త, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా అధికారికంగా విడిపోయారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్ట్ వీరికి పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనే వార్తలు వస్తుండగా, తాజా కోర్టు తీర్పుతో ఆ ప్రచారానికి తెరపడింది. ఎలాంటి భరణం ఆశించకుండానే హన్సిక తన దారి తాను చూసుకుంది.

Hansika Divorce: హన్సికకు విడాకులు.. నాలుగేళ్ల తర్వాత భర్తతో విడిపోయిన నటి.. భరణం అవసరం లేదంటూ..
Hansika Divorce: హన్సికకు విడాకులు.. నాలుగేళ్ల తర్వాత భర్తతో విడిపోయిన నటి.. భరణం అవసరం లేదంటూ..

హన్సిక విడాకులకు కారణమేంటి?

హన్సిక తరపు న్యాయవాది అద్నాన్ షేక్ కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం జరిగిన కొద్ది కాలానికే హన్సిక, సోహైల్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఇద్దరి వ్యక్తిత్వాలు, జీవనశైలి, ఆలోచనా విధానాల్లో పొంతన లేకపోవడంతో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుండేవి. వీటిని సర్దుబాటు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

చివరికి కలిసి ఉండటం అసాధ్యమని భావించిన ఈ జంట.. జులై 2, 2024 నుండి విడివిడిగా జీవిస్తున్నారు. ఆ తర్వాత ఒక అవగాహనకు వచ్చి పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

భరణం, స్త్రీధనం తిరస్కరించిన హన్సిక

విడాకుల వ్యవహారంలో హన్సిక తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విడాకుల సమయంలో భరణం (Alimony) డిమాండ్ చేయడం సహజం. కానీ హన్సిక మాత్రం సోహైల్ నుండి ఎటువంటి భరణం గానీ, స్త్రీధనం గానీ ఆశించడం లేదని కోర్టుకు స్పష్టం చేసింది. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండానే గౌరవప్రదంగా విడిపోవాలని ఆమె నిర్ణయించుకుంది.

హన్సిక పెళ్లి విశేషాలు

హన్సిక, సోహైల్ పెళ్లి డిసెంబర్ 4, 2022న జైపూర్‌లోని ముండోటా కోటలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకను 'లవ్, షాదీ, డ్రామా' పేరుతో ఒక రియాలిటీ డాక్యుమెంటరీగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ చేశారు.

సోహైల్ మొదటి భార్య రింకీ బజాజ్ హన్సికకు స్నేహితురాలు కావడంతో వీరి పెళ్లి సమయంలో కొంత వివాదం నడిచింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'శకలక బూమ్ బూమ్', 'కోయి మిల్ గయా' సినిమాలతో కెరీర్ ప్రారంభించిన హన్సిక.. ఆ తర్వాత దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పై దృష్టి సారించింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More