Badshah: స్కూల్ డ్రెస్‌లో అసభ్యకర డ్యాన్స్‌లు-మహిళా కమిషన్ సీరియస్- బాద్‌షా కోసం పోలీసుల గాలింపు-దేశం విడిచి వెళ్లకుండా!

Badshah: పాపులర్ ర్యాపర్, సింగర్ బాద్‌షాకు బిగ్ షాక్. అతని పాస్ పోర్ట్ సీజ్ చేయాలని, దేశం వదిలి వెళ్లకుండా చూడాలని, వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు హర్యానా మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తతీరీ  పాట వివాదం బాద్‌షా మెడకు గట్టిగానే చుట్టుకుంది. 

Published on: Mar 14, 2026, 13:57:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సింగర్ బాద్‌షాకు బిగ్ షాక్ తగిలింది. ఈ పాపులర్ ర్యాపర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాద్‌షా కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారు. గడువులోగా తమ ముందు హాజరుకావడంలో విఫలమైన ర్యాపర్ బాద్‌షాను అరెస్ట్ చేయాలని పోలీసులను హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది.

బాద్‌షా (Getty Images via AFP)
బాద్‌షా (Getty Images via AFP)

తతీరీ సాంగ్

రీసెంట్ గా బాద్‌షా రిలీజ్ చేసిన హర్యానవీ మ్యూజిక్ వీడియో ‘తతీరీ’ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇందులో స్కూల్ యూనిఫామ్ లో ఉన్న అమ్మాయిలతో అసభ్యకరమైన డ్యాన్స్ లు వేయించడంతో పాటు పాటలోని సాహిత్యంలోనే అనుచితమైన పదాలు వాడాడని బాద్‌షాపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే హర్యానాలో అతనిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఈ సాంగ్ పై సీరియస్ అయిన హర్యానా మహిళా కమిషన్ తమ ముందు హాజరు కావాలని బాద్‌షాకు నోటీసులు పంపించింది.

కమిషన్ సీరియస్

పానిపట్ లోని కమిషన్ ఆఫీస్ లో మార్చి 13 మధ్యాహ్నం 3 గంటల్లోపు అటెండ్ కావాలని బాద్‌షాకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కానీ బాద్‌షా రాలేదు. దీనిపై కమిషన్ ఛైర్ పర్సన్ రేణు సీరియస్ అయింది.

‘‘బాద్‌షా ఎక్కడ ఉన్నా అరెస్టు చేసేలా సెర్చ్ ఆర్డర్లు జారీ చేయాలని పానిపట్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశా. హర్యానా కుమార్తెలను అనుచితమైన పదాలు, భాషతో అవమానించిన పాటపై విచారణ కోసం మార్చి 13 మధ్యాహ్నం 3 గంటల్లోపు తమ ముందు అటెండ్ కావాలని బాద్‌షాకు నోటీసులు పంపించాం’’ అని రేణు మీడియాతో పేర్కొన్నారు.

షోలు నిర్వహించకుండా

‘‘కమిషన్ ముందు బాద్‌షా హాజరు కాలేదు. ఇప్పటికే పంచకుల, జింద్ లలో బాద్‌షాపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. బాద్‌షా న్యాయవాది మరింత గడువు కావాలని కోరారు. కానీ మేం ఒప్పుకోలేదు. దేశంలో బాద్‌షా షోలు నిర్వహించకుండా అడ్డుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాశాం’’ అని రేణు వెల్లడించారు.

ఆ హక్కు లేదా?

మరోవైపు బాద్‌షా న్యాయవాది మహిళా కమిషన్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ‘‘చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికీ తమ వాదనను వినిపించుకునే హక్కు ఉంది. కానీ బాద్‌షా విషయంలో అది కనిపించడం లేదు’’ అని బాద్‌షా న్యాయవాది పేర్కొన్నాడు. తతీరీ పాట రిలీజైన తర్వాత తీవ్ర వివాదం చెలరేగడంతో ఆ పాటను బాద్‌షా డిలీట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి సారీ చెప్పాడు.

అరెస్ట్ కోసం

మరోవైపు బాద్‌షా దేశం దాటకుండా అడ్డుకోవడానికి లుక్-అవుట్ సర్క్యులర్ జారీ చేసే ప్రక్రియను పంచకుల పోలీసులు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ కు రావాలని అతనికి అధికారిక నోటీసు కూడా జారీ చేశారు. అతణ్ని అరెస్టు చేయడానికి వేర్వేరు పోలీస్ టీమ్ లు రంగంలోకి దిగాయని హర్యానా పోలీసులు శనివారం (మార్చి 14) ఒక ప్రకటనలో తెలిపారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More