Bumrah: నీకు ఇల్లు గుర్తుకు రాలేదా జస్సీ.. ధురంధర్ 2 డైలాగ్‌తో బుమ్రాకు పంచ్ ఇచ్చిన భార్య సంజన.. పోస్ట్ వైరల్
The viral dialogue from Dhurandhar 2 has caught the attention of Sanjana Ganesan, the sports presenter and wife of Indian cricketer Jasprit Bumrah.
ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు జనాలు ఈ సినిమాలోని ప్రతి సీన్ గురించి, క్యారెక్టర్ల గురించి తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ అయితే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో రణ్‌వీర్ సింగ్ చేసిన హమ్జా క్యారెక్టర్‌ను చూసి ఒకరు.. "ఇంటికి రావాలనిపించలేదా జస్సీ?" (ఘర్ కీ యాద్ నహీ ఆయీ జస్సీ?) అని అడుగుతారు. ఇప్పుడు ఈ డైలాగ్ ట్రెండ్‌లోకి మన స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేశన్ కూడా వచ్చి చేరింది.

సంజనా ఫన్నీ మీమ్.. బుమ్రా ప్లాన్స్ గల్లంతు!
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సంజనా ఒక ఫన్నీ మీమ్ షేర్ చేసి, పెళ్లయిన తర్వాత మగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సరదాగా చెప్పింది. బుమ్రా ఎప్పుడైనా తన ఫ్రెండ్స్‌తో కలిసి బాయ్స్ నైట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారీ అతనికి ఎదురయ్యే పరిస్థితిని ఈ మీమ్‌తో పోల్చింది.
ధురంధర్ 2 సినిమాలో పిండా క్యారెక్టర్ చేసిన ఉదయ్‌బీర్ సంధుకు ఒక విగ్గు పెట్టి మరీ ఈ మీమ్ క్రియేట్ చేశారు. జస్‌ప్రీత్ బాయ్స్ నైట్ ప్లాన్ చేద్దాం అనుకున్న ప్రతిసారీ.. నీకు ఇల్లు గుర్తుకు రాలేదా జస్సీ? అని అందులో రాసుకొచ్చింది. అంటే తన భర్త ఎప్పుడైనా ఇల్లు వదిలి ఫ్రెండ్స్‌తో నైట్ అవుట్ ప్లాన్ చేస్తే, తాను ఈ డైలాగ్‌తోనే సెటైర్ వేస్తానని సంజనా నవ్వుతున్న ఎమోజీలతో భలే ఫన్నీగా చెప్పుకొచ్చింది.
ధురంధర్ సినిమాల స్టోరీ ఏంటంటే..
అసలు ధురంధర్ సినిమా కథ విషయానికొస్తే.. ఫస్ట్ పార్ట్‌లో రణ్‌వీర్ సింగ్ ఒక ఇండియన్ స్పైగా పాకిస్థాన్‌లోని లియారీ గ్యాంగ్స్‌లో కలిసిపోయి, ఇండియాను టార్గెట్ చేసిన టెర్రరిస్టులను ఎలా మట్టుబెట్టాడు అనేది చూపించారు. కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ అటాక్, 26/11 ముంబై దాడుల నేపథ్యంలో ఈ స్టోరీ నడిచింది. ఇక ఇప్పుడు వచ్చిన సీక్వెల్‌లో అతను అసలు హమ్జా అలీ మజారీగా ఎలా మారాడు, అతనికి ట్రైనింగ్ ఎలా జరిగింది అనేది చూపించారు.
అలాగే లియారీ ఏరియాను తన కంట్రోల్‌లోకి తీసుకుని టెర్రర్ నెట్‌వర్క్‌ను ఎలా నాశనం చేశాడనేది ఇందులో మెయిన్ పాయింట్. రణ్‌వీర్, అర్జున్ రాంపాల్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. మాధవన్, రాకేష్ బేడీ, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి వాళ్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
స్టార్స్ ప్రశంసలు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ
ఈ సినిమా చూసిన మన స్టార్స్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఆలియా భట్, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్లంతా తమ సోషల్ మీడియాలో సినిమాను తెగ మెచ్చుకుంటున్నారు. గత బుధవారం (మార్చి 18) రికార్డ్ బ్రేకింగ్ ప్రీమియర్స్ వేసిన తర్వాత, గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఇండియాలో రూ.145 కోట్లు, వరల్డ్‌వైడ్‌గా రూ.240 కోట్లు రాబట్టిన ఈ యాక్షన్ మూవీ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్ల కలెక్షన్లు సాధించి దూసుకుపోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


