Hey Balwanth OTT: ఓటీటీలోకి నిన్న రిలీజ్ అయిన సుహాస్ అడల్ట్ కామెడీ మూవీ హే బలవంత్- 7.5 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Hey Balwanth OTT Release Platform: ఓటీటీలోకి నిన్న రిలీజ్ అయిన తెలుగు రొమాంటిక్ అడల్ట్ కామెడీ సినిమా హే బలవంత్ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. సుహాస్, శివాని నాగరం హీరో హీరోయిన్లుగా నటించిన హే బలవంత్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. వాటిలో అప్పుడే థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా ఉంటాయి. అయితే, నెల రోజుల్లోనే కాకుండా వారంలో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ ఉన్నాయి.

ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
ఇలాంటి పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఎంతో ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు సినిమా ఇలా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వివరాలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఆ సినిమానే హే బలవంత్.
అడల్ట్ రొమాంటిక్ కామెడీ
మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న సుహాస్ నటించిన లేటెస్ట్ తెలుగు అడల్ట్ రొమాంటిక్ కామెడీ సినిమానే హే బలవంత్. ఈ సినిమాలో మరోసారి సుహాస్‌తో జోడీ కట్టింది బ్యూటిపుల్ హీరోయిన్ శివాని నాగరం. అయితే, ఈ సినిమా టైటిల్ ముందుగా హే భగవాన్ అని ఉండేది.
టైటిల్ మార్పు
కానీ, సెన్సార్ బోర్డ్ నుంచి పలు అభ్యంతరాలు రావడంతో హే భగవాన్ టైటిల్ మార్చి హే బలవంత్‌గా పెట్టారు మూవీ మేకర్స్. అలాగే, ఈ సినిమా ఏ సర్టిఫికేట్ కూడా జారీ చేశారు. అందుకు కారణం సినిమా ప్రారంభంలోనే వచ్చే అడల్ట్ కామెడీ డైలాగ్స్.
హే బలవంత్ నటీనటులు
ఇలా అడల్ట్ కామెడీ డైలాగ్స్, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ అంశాలతో హే బలవంత్ సినిమా సాగుతుంది. ఈ మూవీలో హీరో హీరోయిన్లతోపాటు సీనియర్ నటుడు వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిశోర్, అన్నపూర్ణమ్మ, అజయ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
మంచి రెస్పాన్స్
హే బలవంత్ సినిమాకు గోపి అచ్చెర దర్శకత్వం వహించారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి నరేంద్ర రెడ్డి సినిమాను నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన హే బలవంత్ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫిబ్రవరి 20న రిలీజ్
మంచి అంచనాలతో నిన్న అంటే ఫిబ్రవరి 20న థియేటర్లలో హే బలవంత్ సినిమా విడుదల అయింది. థియేట్రికల్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కామెడీ చాలా బాగుందన ప్రశంసలు వస్తున్నాయి. కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రం అంతగా రుచించలేదు ఈ సినిమా.
హే బలవంత్ ఓటీటీ రైట్స్
ఇలాంటి టాక్‌తో హే బలవంత్ సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 7.5 రేటింగ్ వచ్చింది. మంచి రేటింగ్ సాధించిన హే బలవంత్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 హే బలవంత్ ఓటీటీ రైట్స్‌ను చేజిక్కించుకుంది.
జీ5 ఓటీటీలోనే
కాబట్టి, జీ5లోనే హే బలవంత్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, సినిమా టాక్, బాక్సాఫీస్ కలెక్షన్స్ దృష్టిలో ఉంచుకుని హే బలవంత్ ఓటీటీ రిలీజ్ అవనుందని సమాచారం. అలాగే, హే బలవంత్ టీవీ ప్రీమియర్ హక్కులను ప్రముఖ ఛానెల్ జీ తెలుగు సొంతం చేసుకుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


