ఈసారికి వదిలేయండి, వచ్చేసారి కచ్చితంగా తెలుగులో మాట్లాడుతా.. తమిళ హీరో సూరి- ఎన్నో అవార్డ్స్ వస్తాయన్న ఇరుముడి దర్శకుడు
Suhas Soori Shiva Nirvana Comments In Mandaadi Pre Release Event: తెలుగు హీరో, తమిళ హీరో కలిసి నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ మండాడి. తాజాగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మండాడి ఈవెంట్‌లో సుహాస్, సూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం.
Suhas Soori Shiva Nirvana Comments In Mandaadi Pre Release Event: తమిళ్ హీరో సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘ మండాడి ’. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

మండాడి నటీనటులు
ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బోట్ రేసింగ్, యాక్షన్, ఎమోషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‘మండాడి’ ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు.
నా టీచర్స్ అంతా ముందే ఉన్నారు
ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఇక్కడి దాకా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు టీచర్స్ డే, నా టీచర్స్ అంతా నా ముందే ఉన్నారు. మీ అందరి సపోర్ట్ తో ఎన్నో ఫేజెస్ దాటుకుంటూ మందాడి వరకు వచ్చా" అని అన్నాడు.
"చిత్రయూనిట్ అందరి సపోర్ట్ వల్లనే ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాము. హీరోయిన్ మహిమ, రవీంద్ర విజయ్, సూరి నటన ఈ సినిమాకు మెయిన్ అసెట్స్. సెప్టెంబర్ 10 న ఓ వినూత్న కంటెంట్ థియేటర్స్‌లో చూడటానికి సిద్ధంగా ఉండండి" అని హీరో సుహాస్ చెప్పాడు.
ఈసారికి వదిలేయండి
యాక్టర్ సూరి మాట్లాడుతూ.. "లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈ సారికి వదిలేయండి, వచ్చే సారి కచ్చితంగా తెలుగులో మాట్లాడుతా. మండాడి సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. సుహాస్‌తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు" అని తెలిపాడు.
లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నాకు పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గారికి స్పెషల్ థాంక్స్. ఏష నాగుల గట్ట మీద సాంగ్ బిగ్గెస్ట్ హిట్ చేసిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు" అని అన్నారు.
ఎన్నో అవార్డ్స్ వస్తాయి
అలాగే, ఇదే ఈవెంట్‌లో భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ.. ఈ సినిమా భారీ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నా అన్నారు. ఈ సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారని తెలిపారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. "ఈ ఈవెంట్‌కి రావడం చాలా గర్వంగా ఉంది. సూరి గారు మీరు డౌన్ టు ఎర్త్. ఈ సినిమా తరిలేరు చూసి ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందనే ఫిక్స్ అయ్యా. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడి పనిచేశారు. థియేటర్స్‌లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మండాడి సినిమాకు ఎన్నో అవార్డ్స్ వస్తాయని నమ్మతున్నా" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


