OTT Telugu: ఓటీటీలోకి ఆది సాయికుమార్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- శవాన్ని సైతం చంపే సైకో, మెడికల్ మాఫియాకు లింకు!
SI Yugandhar OTT Streaming: ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఎస్సై యుగంధర్. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఎస్సై యుగంధర్ ఓటీటీలోకి వచ్చేయనుంది. శవాన్ని కూడా పొడిచి పొడిచి చంపే సైకో కిల్లర్ కథగా వచ్చిన ఎస్సై యుగంధర్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో చూద్దాం.
Aadi Saikumar SI Yugandhar OTT Release: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న హీరో ఆది సాయికుమార్. వరుస సినిమాలతో అలరిస్తున్న ఆది సాయి కుమార్ ఇటీవల అక్టోబర్ 2న థియేటర్లలో ఎస్సై యుగంధర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
తెలుగులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'ఎస్సై యుగంధర్' సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ కంటెంట్ పరంగా పర్వాలేదనిపించింది. అయితే, ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలై ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికి తెలియకుండా పోయింది.
ఓటీటీలోకి ఎస్సై యుగంధర్
అలాంటి ఆది సాయి కుమార్ ఎస్సై యుగంధర్ ఓటీటీలోకి వచ్చేయనుంది. తాజాగా సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ ఓటీటీ ప్రీమియర్ విషయాన్ని సదరు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్ జూలూరు నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది.
హీరోయిన్గా మేఘలేఖ
ఆది సాయికుమార్ సరసన మేఘలేఖ హీరోయిన్గా నటించగా, రాకేందు మౌళి, పవన్ తేజ్ కొణిదెల, గాయత్రి భార్గవి, కాదంబరి కిరణ్, శివకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో 'ఎస్సై యుగంధర్' కథ
హైదరాబాద్ నగర శివారులో ఒక అనాథ శవం లభ్యమవడంతో కథ మలుపు తిరుగుతుంది. దానికి తోడు నగరంలో వరుసగా జరుగుతున్న దారుణ హత్యలు తీవ్ర కలకలం రేపుతాయి. ఈ హత్యల వెనుక ఒక పకడ్బందీ ప్లాన్‌తో వ్యవహరిస్తున్న సైకో కిల్లర్ ఉన్నాడని పోలీస్ ఆఫీసర్ యుగంధర్ (ఆది సాయికుమార్) గుర్తించి విచారణ వేగవంతం చేస్తాడు.
అనాథ శవం మాయమవ్వడంతో
అయితే ఇన్వెస్టిగేషన్ సాగుతున్న సమయంలో కేసులో ప్రధాన ఆధారంగా ఉన్న ఒక శవం మాయమవ్వడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. చనిపోయిన మృతదేహాన్ని మళ్లీ మళ్లీ పొడిచి చంపే వికృత మనస్తత్వం ఉన్న కిల్లర్‌ను పట్టుకోవడానికి యుగంధర్ ఎలాంటి వ్యూహాలు పన్నాడనేది సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. విచారణ లోతుగా జరిపే కొద్దీ సైకో కిల్లర్‌కు, మెడికల్ మాఫియాకు ఉన్న లింకులు బయటపడతాయి.
లోకల్ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణ
మార్కస్ ఎం సమకూర్చిన నేపథ్య సంగీతం, రవీంద్రనాథ్ ఛాయాగ్రహణం ఈ చిత్ర మూడ్‌ను సరికొత్తగా ఆవిష్కరించాయి. ఇటీవలి కాలంలో తెలుగు చిత్రసీమలో ఇన్వెస్టిగేటివ్, సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లకు ఓటీటీల్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. థియేటర్లలో మిస్ అయిన వీక్షకులు, ముఖ్యంగా థ్రిల్లర్ ప్రేమికులు ఎస్సై యుగంధర్ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎస్సై యుగంధర్ ఓటీటీ రిలీజ్
అలాంటి ఎస్సై యుగంధర్ ఓటీటీలోకి వచ్చేయనుంది. డజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఎస్సై యుగంధర్ విడుదల కానుంది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఎస్సై యుగంధర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


