OTT Romantic Horror: ఓటీటీలోకి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్- దుష్టశక్తిగా మారే దైవశక్తి, అందంతో ఆకర్షించే పిశాచి- తెలుగులో!

Immortal OTT Streaming Official: జీవీ ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటించిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ చిత్రం ఇమ్మోర్టల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. థియేటర్లలో అలరించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 8.7 ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో తెలుగులో ఓటీటీ రిలీజ్ అవనుంది. మరి అదెక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 25, 2026, 13:17:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Immortal OTT Release Official: సినీ అభిమానులకు, ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ ప్రియులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. సంగీత దర్శకుడిగా, నటుడిగా దక్షిణాది సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, బ్యూటిఫుల్ భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ హారర్ చిత్రం ఇమ్మోర్టల్ (Immortal) ఓటీటీలోకి వచ్చేయనుంది.

ఓటీటీలోకి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్- దుష్టశక్తిగా మారే దైవశక్తి, అందంతో ఆకర్షించే పిశాచి- తెలుగులో!
ఓటీటీలోకి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్- దుష్టశక్తిగా మారే దైవశక్తి, అందంతో ఆకర్షించే పిశాచి- తెలుగులో!

ఇమ్మోర్టల్ ఐఎమ్‌డీబీ రేటింగ్

తాజాగా ఇమ్మోర్టల్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను సదరు ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను భయపెడుతూనే ప్రేమలో పడేసిన ఈ సినిమా ఐఎమ్‌డీబీలో ఏకంగా 8.7 రేటింగ్ సంపాదించుకుంది.

కథేంటి? ఒక వెయ్యేళ్ల నాటి రహస్యం!

'ఇమ్మోర్టల్' కథ వేల సంవత్సరాల నాటి పురాతన నేపథ్యంతో మొదలవుతుంది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఒక గిరిజన దంపతులకు జన్మించిన విచిత్రమైన శిశువు, దైవిక శక్తులు కలిగి ఉండి ఒక పెద్ద దుష్టశక్తిగా మారడంతో కథ ఊపందుకుంటుంది.

అక్కడి నుంచి నేటి చెన్నై మహానగరానికి కథ మళ్లుతుంది. ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే సాధారణ యువకుడు మగీ (జీవీ ప్రకాష్) తక్కువ బడ్జెట్‌లో ఇల్లు దొరక్క ఇబ్బందిపడుతుంటాడు. ఆ సమయంలో అతనికి సింధు (కయాదు లోహర్) అనే ఒక రహస్యమైన అందమైన యువతి పరిచయమవుతుంది. చాలా తక్కువ అద్దెకే తన విలాసవంతమైన ఫ్లాట్‌లో ఒక గదిని మగీకి ఇస్తుంది. అద్దె తక్కువగా ఉండటంతో మరో ఆలోచన లేకుండా మగీ ఆ ఇంట్లో దిగిపోతాడు.

ప్రియురాలు కాదు పిశాచ శక్తి

ఈ క్రమంలోనే సింధు అందానికి ఆకర్షితుడై ఆమెతో ప్రేమలో పడతాడు మగీ. ఆ తర్వాత ఆ ఇంట్లో జరిగే కొన్ని విచిత్ర సంఘటనలు, సింధు ప్రవర్తన అతనికి అనుమానం కలిగిస్తాయి. తీరా అసలు విషయం తెలుసుకునేసరికి మగీ షాక్‌కు గురవుతాడు.

సింధు మామూలు మనిషి కాదని, వేల సంవత్సరాల నాటి దుష్టశక్తితో సంబంధం ఉన్న పిశాచ శక్తి అని స్పష్టమవుతుంది. మగవారిని తన అందంతో లొంగదీసుకుని వారిని ఆహారంగా మార్చుకోవడమే ఆమె నైజం.

మగీ ఏమయ్యాడు?

అయితే, మగీ విషయంలో సింధుకి నిజమైన ప్రేమ భావాలు కలుగుతాయి. ఒకవైపు తన క్రూరమైన నైజం, మరోవైపు మగీపై ఉన్న ప్రేమ మధ్య ఆమె నలిగిపోతుంది. ఈ ప్రమాదం నుంచి మగీ ఎలా బయటపడ్డాడు? వారి ప్రేమ ఏ తీరానికి చేరింది? అనేదే ఇమ్మోర్టల్ సినిమా కథ.

కొత్త దర్శకుడు మారియప్పన్ చిన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎకే ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై అరుణ్ కుమార్ ధనశేఖరన్ నిర్మించారు. టి.ఎమ్. కార్తీక్, కుమార్ నటరాజన్, లొల్లు సభ మారన్, ఆదిత్య కతిర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

ఇమ్మోర్టల్ ఓటీటీ స్ట్రీమింగ్

ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ తన నేపథ్య సంగీతంతో భయాన్ని మరింత రెట్టింపు చేయగా, అరుణ్ రాధాకృష్ణన్ ఛాయాగ్రహణం అందించారు. ఎం. రాజేష్ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. మంచి హారర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఇమ్మోర్టల్ ఓటీటీలోకి మరికొన్ని రోజుల్లో వచ్చేయనుంది.

ప్రముఖ డిజిటల్ సంస్థ సోనీ లివ్‌లో ఇమ్మోర్టల్ ఓటీటీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 30 నుంచి తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి 5 భాషల్లో ఇమ్మోర్టల్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

సోనీ లివ్ ఓటీటీలో

ఈ సందర్భంగా "ఒక కొత్త ప్రపంచం... ఒక అమర ప్రేమకథ" అనే క్యాప్షన్‌తో సోనీ లివ్ ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేసింది. హారర్, సస్పెన్స్, రొమాన్స్ అంశాలు ఇష్టపడే ప్రేక్షకులకు సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఇమ్మోర్టల్ మంచి వీకెండ్ వాచ్ అని చెప్పవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More