Sigma OTT: ఇదే నెలలో ఓటీటీలోకి నిన్న రిలీజైన సిగ్మా- దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్- ఏరోజు స్ట్రీమింగ్ అంటే?
Sigma OTT Streaming Details: యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ ఫరియా, దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సిగ్మా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. నిన్న థియేటర్లలో విడుదలైన సిగ్మా ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Sigma OTT Release Details: సినిమాలు ఇలా థియేటర్లలో విడుదల కాగానే అలా ఓటీటీ వివరాలపై రోజురోజుకీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా నిన్న (అక్టోబర్ 2) థియేటర్లలో విడుదలైన సిగ్మా ఓటీటీ స్ట్రీమింగ్ డీటేల్స్ కూడా ఇప్పుడు ఆసక్తిగా మారాయి.

దర్శకుడిగా విజయ్ కుమారుడు
నేచురల్ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే సిగ్మా. తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అయిన సినిమా ఇది.
జాతి రత్నాలు చిట్టి
సిగ్మా సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. మంచి అంచనాలతో నిన్న అంటే అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ అయింది సిగ్మా సినిమా. తొలి చిత్రం నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించిన జేసన్.. హీరో సందీప్ కిషన్‌ను సరికొత్త మాస్ థ్రిల్లింగ్ అవతార్‌లో ఆవిష్కరించారు.
తమన్ బీజీఎమ్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ నేపథ్య సంగీతం అందించాడు. తమన్ అందించిన బీజీఎమ్ ఈ థ్రిల్లర్ డ్రామాను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లింది. సీనియర్ నటుడు సంపత్ రాజ్, డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం, అన్బుదాసన్, యోగ్ జేపీ, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించి కథకు ప్రాణం పోశారు.
రూ. 500 కోట్ల మాఫియా మనీ.. అసలు కథేంటంటే?
అప్పుల్లో కూరుకుపోయిన ఒక సాధారణ యువకుడు తన తల్లి జ్ఞాపకాలను కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. హీరో గురు (సందీప్ కిషన్)కు తల్లి అంటే అమితమైన ప్రేమ. అప్పుల ఊబి నుంచి బయటపడటంతో పాటు తన తల్లి జ్ఞాపకార్థం ఉన్న ఒక లైబ్రరీని కాపాడుకోడానికి వేగంగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తాడు.
ఈ క్రమంలో ఒక క్యాసినోకి వెళ్లిన గురు జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపులు తిరుగుతుంది. దాదాపు రూ. 500 కోట్ల మాఫియా బ్లాక్ మనీకి సంబంధించిన సీక్రెట్ పెన్ డ్రైవ్ గురించిన విషయం గురుకి తెలుస్తుంది. ఆ పెండ్రైవ్ కోసం కొన్ని డేంజరస్ మాఫియా గ్యాంగ్స్ తీవ్రంగా వేట సాగిస్తుంటాయి.
గురు కల నెరవేరిందా?
ఆ పెండ్రైవ్ గురుకు ఎలా దొరికింది? అందులో ఏముంది? ఆ మాఫియా ముఠాల నుంచి గురు ఎలా తప్పించుకున్నాడు? మరి భారీగా డబ్బును సాధించాడా? తన తల్లి లైబ్రరీని గురు కాపాడుకున్నాడా? లేదా? అనే అంశాలను వెండితెరపై ఉత్కంఠభరితంగా మలిచారు.
ఇలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన సిగ్మా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై క్యూరియాసిటీ నెలకొంది. సిగ్మా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మంచి ధర వెచ్చించే సిగ్మా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాక్.
సిగ్మా ఓటీటీ స్ట్రీమింగ్
ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే సిగ్మా ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, ఇదే నెలలో అంటే అక్టోబర్‌లోనే ఓటీటీలోకి సిగ్మా సినిమా రానుందని తెలుస్తోంది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సిగ్మా ఓటీటీ స్ట్రీమింగ్ కానుందట. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో ఓటీటీలో సిగ్మా అందుబాటులోకి రానుందని సమాచారం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


