OTT: ఒక్క దుర్ఘటన ఖరీదు 15 వేల మంది ప్రాణాలు- ఓటీటీలో కంటతడిపెట్టించే థ్రిల్లర్ సిరీస్- కేవలం 4 ఎపిసోడ్స్- తెలుగులో!

The Railway Men OTT Streaming In Telugu: 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో తెరకెక్కిన 'ది రైల్వే మెన్' వెబ్ సిరీస్ ఓటీటీ ఊహించని విజయం సాధిస్తోంది. 8.4 ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో దూసుకెళ్తున్న ఈ సిరీస్ కేవలం 4 ఎపిసోడ్లతో కంటతడి పెట్టిస్తోంది. ది రైల్వే మెన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Oct 2, 2026, 17:11:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

The Railway Men OTT Release In Telugu: కొన్ని విషాద సంఘటనలు దశాబ్దాలు గడిచినా మానవ గుండెలను తొలిచేస్తూనే ఉంటాయి. 1984 డిసెంబర్ 2 రాత్రి భోపాల్ నగరాన్ని మిథైల్ ఐసోసైనేట్ అనే అత్యంత ప్రమాదకరమైన విషవాయువు ముంచెత్తింది.

ఒక్క దుర్ఘటన ఖరీదు 15 వేల మంది ప్రాణాలు- ఓటీటీలో కంటతడిపెట్టించే థ్రిల్లర్ సిరీస్- కేవలం 4 ఎపిసోడ్స్- తెలుగులో!
ఒక్క దుర్ఘటన ఖరీదు 15 వేల మంది ప్రాణాలు- ఓటీటీలో కంటతడిపెట్టించే థ్రిల్లర్ సిరీస్- కేవలం 4 ఎపిసోడ్స్- తెలుగులో!

15 వేల మంది ప్రాణాలు తీసిన దుర్ఘటన

కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 15,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కిన ఓటీటీ సిరీస్ 'ది రైల్వే మెన్'. అలాంటి ది రైల్వే మెన్ ఓటీటీలో ఇప్పటికీ వీక్షకుల గుండెలను పిండేస్తోంది.

నరకప్రాయమైన రాత్రి.. ఆ నిమిషాల్లో ఏం జరిగింది?

యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి లీకైన విషవాయువు భోపాల్ నగరాన్ని శ్మశానవాటికగా మార్చింది. నిద్రలోనే వేలాది మంది ప్రాణాలు వదిలారు. ఊపిరి ఆడక, కళ్లు మండి నడిరోడ్డుపై పరుగులు తీశారు. అటువంటి భయానక వాతావరణంలో, భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ మాస్టర్ ఇఫ్తేకార్ సిద్దికీ (కేకే మీనన్), జీఎమ్ రతి పాండే (ఆర్. మాధవన్) తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు.

వందలాది మందిని కాపాడి

ప్రమాదాన్ని పసిగట్టి, ప్రాణభయంతో అటుగా వస్తున్న రైళ్లను నిలిపివేస్తూ, వందలాది మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వారు చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తుంది.

నటీనటుల విశ్వరూపం.. కట్టిపడేసే కథనం

దర్శకుడు శివ్ రవైల్ కేవలం 4 ఎపిసోడ్లలోనే ఈ ఉత్కంఠభరితమైన కథను ఆవిష్కరించారు. కేకే మీనన్, ఆర్. మాధవన్, దివ్యేందు శర్మ, బాబిల్ ఖాన్ తమ నటన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ నటన ఈ ఓటీటీ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

8.4 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ప్రశంసల జల్లు

ప్రతి సన్నివేశం అత్యంత సహజంగా, ప్రతి సెకను ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను స్క్రీన్‌కు కట్టిపడేస్తుంది. ఈ సిరీస్‌కు ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb)లో 8.4 రేటింగ్ లభించింది. విమర్శకుల నుంచి సాధారణ ఆడియెన్స్ వరకు ఇప్పటికీ ఈ సిరీస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.

రైల్వే సిబ్బంది త్యాగాలు

ఒక ఘోరమైన దుర్ఘటనలో వెలుగులోకి రాని నిజమైన కథానాయకులుగా నిలిచిన రైల్వే సిబ్బంది త్యాగాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు. ఉత్కంఠభరితమైన థ్రిల్లర్, ఎమోషనల్ కథలను ఇష్టపడేవారు తప్పక చూడదగిన అద్భుతమైన సిరీస్ ఇది.

ది రైల్వే మెన్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న ది రైల్వే మెన్ ఓటీటీలో అందరిని ఆకట్టుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ది రైల్వే మెన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ది రైల్వే మెన్ ఓటీటీ రిలీజ్ అయింది. కాబట్టి, నిజ జీవితంలో జరిగన అత్యంత ఘోర దుర్ఘటనపై తెరకెక్కిన ది రైల్వే మెన్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో ఎంచక్కా వీక్షించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More