Mohan Babu: జయసుధ నాకు సహోదరి కానీ జయప్రద కాదు.. ఆ రాత్రి ఆమెను లాక్కెళ్లిపోవాలి.. ఇది సెల్ఫ్ డబ్బా కాదు: మోహన్ బాబు
Mohan Babu: మోహన్ బాబు తాజాగా డైరెక్టర్స్ డే ఈవెంట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జయసుధ తనకు సహోదరి కానీ జయప్రద మాత్రం కాదంటూ ఆయన అనడం గమనార్హం. ఈ కామెంట్స్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Mohan Babu: టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్టేజ్ ఎక్కారంటే అక్కడ పంచ్‌లు, సెటైర్లు గ్యారెంటీ. తాజాగా జరిగిన 'డైరెక్టర్స్ డే' వేడుకల్లో ఆయన మరోసారి తనదైన వాక్చాతుర్యంతో అందరినీ నవ్వించారు. సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రదలతో తనకున్న సుదీర్ఘ అనుబంధం గురించి చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

జయప్రద అలా కాదు
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని చిత్ర పరిశ్రమ ప్రతి ఏటా డైరెక్టర్స్ డే నిర్వహిస్తోంది. ఈ వేడుకకు హాజరైన మోహన్ బాబు.. జయసుధ, జయప్రద పక్కపక్కనే కూర్చుని ఉండటం చూసి స్టేజ్ మీద నుంచే సరదాగా స్పందించారు.
"జయసుధ నాకు ఎప్పుడూ ఒక సహోదరి లాంటిది. ఆమెతో నాకు అద్భుతమైన అనుబంధం ఉంది. కానీ జయప్రద విషయంలో మాత్రం నేను అలా చెప్పలేను. ఆమె నాకు సోదరి కాదు" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో జయప్రద కూడా ఏయ్ అంటూ ఏదో అనబోయారు.
ఆ రాత్రి ఈ అమ్మాయిని లాక్కెళ్లిపోవాలి..
ఈ సందర్భంగా జయప్రదతో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఘటనను గుర్త చేసుకున్నారు. “ఆ రోజు రాత్రి షూటింగ్.. 4 గంటలు అవుతోంది.. ఉదయం 7 గంటలకు మొదలుపెట్టారు. అప్పుడు ఈ అమ్మాయిని నేను లాక్కెళ్లిపోవాలి. కృష్ణంరాజు గారు హీరో. అల్లు రామలింగయ్య గారు నా దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని ఎలా లాక్కెళ్తారు అని అడిగారు. దానికి దారి గురించి దాసరిగారు రాసిన డైలాగ్ ఇప్పటికీ నాకు గుర్తుంది” అంటూ మోహన్ బాబు ఆ డైలాగు చెప్పారు.
మోహన్ బాబు ఈ మాట అనగానే పక్కనే ఉన్న జయప్రద, జయసుధతో పాటు హాల్‌లోని వారంతా ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేకపోయారు. గతంలో మోహన్ బాబు, జయప్రద కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై బాగా పండేది. ఆ చనువుతోనే ఆయన ఇలాంటి ఫన్నీ కామెంట్స్ చేశారని అందరికీ అర్థమైంది.
ఇది సెల్ఫ్ డబ్బా కాదు..
ఇక దాసరి గురించి చెబుతూ.. ఆ కాలంలోనే తాము 550 మంది కూర్చొనేందుకు వీలుగా ఓ ఆడిటోరియం కట్టామని, ఇది సెల్ఫ్ డబ్బా కాదు అని మోహన్ బాబు అన్నారు.
"మా గురువుగారు దాసరి నారాయణరావు గారు మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో పెంచారు. షూటింగ్ సమయంలో ఆయన ముందు మేమంతా చాలా పద్ధతిగా ఉండేవాళ్లం. ఇవాళ ఇక్కడ ఇంతమంది దర్శకులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అని మోహన్ బాబు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, చిత్ర పరిశ్రమలో దర్శకుడి ప్రాధాన్యత గురించి కూడా ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మోహన్ బాబు టైమింగ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు వెండితెరను ఏలిన ఈ అగ్ర తారలంతా ఒకే వేదికపై కనిపించడం అటు అభిమానులకు, ఇటు పరిశ్రమ వర్గాలకు కనువిందుగా నిలిచింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: మోహన్ బాబు జయప్రదపై వ్యాఖ్యలు ఎక్కడ చేశారు?
జవాబు: హైదరాబాద్‌లో జరిగిన డైరెక్టర్స్ డే వేడుకల్లో మోహన్ బాబు ఈ సరదా వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్న: మోహన్ బాబు ఎవరి గురించి మాట్లాడారు?
జవాబు: సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రద గురించి ఆయన మాట్లాడారు.
ప్రశ్న: డైరెక్టర్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
జవాబు: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 4వ తేదీన డైరెక్టర్స్ డే నిర్వహిస్తారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


