టైమ్ ట్రావెల్ చేయించే మ్యాజిక్ డోర్స్-ఇవాళ ఓటీటీలోకి రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్-తప్పకుండా చూడాల్సిన మూవీ
అడగకుండానే జీపీఎస్ తో మ్యాజిక్ లోకేషన్లకు తీసుకెళ్లే కారు, టైమ్ ట్రావెల్ చేయించే డోర్లు.. గతాన్ని మళ్లీ అనుభవించే జోడీ.. ఇలా డిఫరెంట్ స్టోరీ లైన్ లో వచ్చిన ఓ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ ఇవాళ ఓటీటీ రిలీజవుతోంది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాల సందడి కొనసాగుతోంది. ఇవాళ (జనవరి 20) డిజిటల్ స్ట్రీమింగ్ కు ఓ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ వచ్చేసింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఉన్న ఈ మూవీనే ‘ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ’. రొమాన్స్, ఫాంటసీతో కూడిన ఈ మూవీని తప్పకుండా చూడాలనే కామెంట్లు వస్తున్నాయి.

ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ ఓటీటీ
ప్రతి వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇందులో డిఫరెంట్ స్టోరీలతో, డిఫరెంట్ జోనర్ సినిమాలు వస్తాయి. అలాంటి ఓ విభిన్నమైన కథతో వచ్చిన చిత్రమే ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ. మంగళవారం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నాలుగు నెలల తర్వాత
థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ మూవీ. ఈ ఇంగ్లీష్ మూవీ సెప్టెంబర్ 19, 2025న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత జనవరి 20, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో మార్గాట్ రాబీ, కొలిన్ ఫారెల్, కెవిన్ క్లిన్, ఫోబ్ వాలర్ తదితరులు నటించారు.
రొమాంటిక్ ఫాంటసీ
ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ సినిమా రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దీనికి కొగోనాడా డైరెక్టర్. ఈ చిత్రాన్ని కొలంబియా పిక్చర్స్, 30 వెస్ట్ ఇంపెరేటివ్ ఎంటర్ టైన్మెంట్ కలిసి నిర్మించాయి. దీనికి బ్రాడ్లీ థామస్, ర్యాన్ ఫ్రీడ్కిన్, యూరీ హెన్లీ, సెత్ రీస్ నిర్మాతలు.
ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ స్టోరీ
ఈ రొమాంటిక్ ఫాంటసీ మూవీ డేవిడ్ (కొలిన్), సారా (మార్గాట్) చుట్టూ సాగుతోంది. వీళ్లిద్దరూ అపరిచితులు. ఓ వెడ్డింగ్ రిసెప్షన్ లో కలుసుకుంటారు. డేవిడ్ దగ్గర ఓ పాత కారు ఉంటుంది. అందులోని జీపీఎస్ డైరెక్ట్ గా సారా దగ్గరకు తీసుకెళ్తుంది. వీళ్లిద్దరూ కలిసి కార్లో జర్నీ స్టార్ట్ చేస్తారు.
ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే కారు తన జీపీఎస్ ఆధారంగా డేవిడ్, సారాను అడవిలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఓ మ్యాజిక్ డోర్ ఉంటుంది. ఆ తలుపులో నుంచి డేవిడ్, సారా వెళ్తారు. తమ గతంలోకి ప్రయాణిస్తారు. తన జీవితంలోని కీలక అనుభవాల్లోకి వెళ్లి తమను తాము చూసుకుంటారు.
ఒక డోర్ నుంచి వెళ్తే ఫస్ట్ లవ్, ఆ తర్వాత డోర్ హైస్కూల్, ఇంకోటి అమ్మ దగ్గరకు ఇలా డేవిడ్, సారా ప్రయాణిస్తుంటారు. మరి చివరకు ఏం జరిగింది? డేవిడ్, సారా కలిసి కారును ఎందుకు తగలబెట్టారు? అన్నది సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


