ఇవాళ ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్- మర్డర్ చేయడం ఒక ఆర్ట్- బిగ్ బాస్ ఫేమ్ సోనియా లీడ్ రోల్- 9 నెలల తర్వాత
సంక్రాంతి సందర్భంగా అటు థియేటర్లు సినిమాల సందడి కొనసాగుతోంది. ఇటు ఓటీటీలోనూ కొత్త మూవీస్ వస్తున్నాయి. ఇవాళ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల నటించింది.
థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ సంక్రాంతి మూవీ సందడి కనిపిస్తోంది. అటు బిగ్ స్క్రీన్ పై భారీ సినిమాలు ఆడియన్స్ కు పండగనిస్తే, ఇటు బుల్లితెరపై ఓటీటీ సినిమాలు థ్రిల్ కలిగిస్తున్నాయి. ఇవాళ ఓటీటీలో ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ వచ్చేసింది. మర్డర్ చేయడం ఒక ఆర్ట్ అంటూ సాగే కథతో వచ్చిన ఆ మూవీనే ‘కిల్లర్ ఆర్టిస్ట్’. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్ర పోషించింది.

కిల్లర్ ఆర్టిస్ట్ ఓటీటీ
తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (జనవరి 13) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ మూవీ కేవలం రెంట్ విధానంలోనే ఉంది. అంటే ప్రైమ్ వీడియోలో ఈ కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ చూడాలంటే రెంట్ పే చేయాల్సి ఉంటుంది.
9 నెలల తర్వాత
కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ థియేటర్లలోకి రిలీజైన 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా మార్చి 21, 2025న థియేటర్లలో విడుదలైంది. దీనికి రతన్ రిషి డైరెక్టర్. సోనియా ఆకుల ప్రధాన పాత్రలో నటించింది. సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, బాహుబలి ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, సత్యం రాజేష్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.
కిల్లర్ ఆర్టిస్ట్ స్టోరీ
మర్డర్ చేయడమనేది ఆర్ట్ అని నమ్మే ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీనే కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ. విక్కీ (సంతోష్) చెల్లి పేరు స్వాతి (స్నేహ మాధురి). విక్కీ లేనప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న స్వాతిని ఎవరో రేప్ చేసి తీవ్రంగా గాయపరుస్తారు. దీంతో స్వాతి చనిపోతుంది. సిస్టర్ మరణంతో విక్కీ డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు.
విక్కీ లవర్ జాను (క్రిషేక పటేల్) అతణ్ని మార్చాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు సిటీలో హీరోయిన్ మాస్కులు వేసుకుని పిచ్చి రవి అనే ఓ సైకో అమ్మాయిలను చంపేస్తున్నాడని తెలుస్తుంది. అతణ్ని పోలీసులు అరెస్టు చేస్తారు. తన ఇంట్లోనూ హీరోయిన్ మాస్క్ దొరకడంతో స్వాతిని ఈ కిల్లర్ చంపడేమోనని విక్కీ అనుకుంటాడు.
ఆ ట్విస్ట్
సైకో కిల్లర్ ను చంపాలని విక్కీ చూస్తాడు. కానీ ఆ కిల్లర్ పోలీసుల నుంచి తప్పించుకుని జాను బర్త్ డే పార్టీకి వెళ్తాడు. ఇక్కడో ట్విస్ట్ ఉంటుంది. స్వాతిని చంపింది ఈ కిల్లర్ కాదని తెలుస్తుంది. మరి స్వాతిని చంపిందెవరు? జాను బర్త్ డే పార్టీకి ఈ సైకో కిల్లర్ ఎందుకు వెళ్లాడు? ఇందులో సోనియా పాత్ర ఏంటీ? అన్నది కిల్లర్ ఆర్టిస్ట్ మూవీలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


