Ramayana Movie Facts: 100 దేశాలు, 40 భాషల్లో రామాయణం ఇవాళే రిలీజ్- థియేటర్లలో చూడకముందే ఈ 5 విషయాలు తెలుసుకోండి!
5 Things To Watch Ramayana Movie: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన రామాయణ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యశ్ నటించిన ఈ విజువల్ వండర్ గురించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న 5 ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే.
5 Interesting Things To Watch Ramayana Movie: ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని భారీ అంచనాల నడుమ 'రామాయణం' చిత్రం ఇవాళ (నవంబర్ 5) వెండితెరపైకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యానికి నితేష్ తివారీ దర్శకత్వం వహించారు.

రామాయణం గురించి 5 ఇంట్రెస్టింగ్ విషయాలు
శ్రీరాముడు, సీతాదేవి, రావణాసురుడి పవిత్రమైన గాథను అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బిగ్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తున్నారు. సోషల్ మీడియాలో రామాయణ చిత్రంపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. థియేటర్లకు వెళ్లి ఈ సినిమా అనుభూతిని పొందడానికి ముందు, సినిమా వెనుక ఉన్న 5 మైండ్ బ్లాక్ ఇంట్రెస్టింగ్ విశేషాలను తెలుసుకుందాం.
రాకింగ్ స్టార్ యశ్ పవర్‌ఫుల్ ఎంట్రీ.. నయా రణ్‌బీర్!
రామాయణ చిత్రంపై భారత్ వ్యాప్తంగా ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఇందులోని నటీనటులే. లంకేశుడైన రావణాసురుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కనిపిస్తున్నారు. 'కేజీఎఫ్' సిరీస్‌తో తెలుగు నేలతో పాటు దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న యశ్, తొలిసారి ఒక పౌరాణిక శైలి సినిమాలో రావణుడిగా అలరించనున్నారు.
ఆయన స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు అతిపెద్ద అసెట్‌గా మారనుంది. మరోవైపు రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ మొదటిసారి పౌరాణిక గెటప్‌లో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరి స్టార్ల మధ్య నడిచే సన్నివేశాలు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, సీతగా సాయి పల్లవి, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించడం కూడా విశేషంగా మారింది.
కల్ట్ క్లాసిక్స్ అందించిన నితేష్ తివారీ మార్క్
బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'దంగల్', మానసిక బలాన్నిచ్చే 'ఛిఛోరే', 'చిల్లర్ పార్టీ' వంటి దిగ్గజ చిత్రాలను అందించిన నితేష్ తివారీ ఈ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహించారు. కథను తెరకెక్కించే విధానంలో, భావోద్వేగాలను పండించడంలో ఆయన శైలి ప్రత్యేకం. రామాయణం వంటి భారతీయ ఆత్మతో ముడిపడిన గాథను నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడంలో ఆయన ప్రతిభ స్పష్టంగా కనిపించనుంది.
ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీత సమరం
ఈ సినిమా ఆడియో రూపురేఖలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఇద్దరు ఆస్కార్ విజేతలు చేతులు కలిపారు. మన భారతీయ సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్‌తో పాటు హాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ కంపోజర్ హాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి స్కోర్ అందించారు.
'ది లయన్ కింగ్', 'ఇన్సెప్షన్', 'డ్యూన్', 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' వంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రాలకు సంగీతమందించిన హాన్స్ జిమ్మర్‌కు ఇది తొలి భారతీయ సినిమా కావడం విశేషం. వీరిద్దరి కలయికలో వచ్చే నేపథ్య సంగీతం థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
100 దేశాలు.. 59 వేల స్క్రీన్లలో విడుదల
రామాయణం కేవలం మన దేశానికే పరిమితం కాకుండా గ్లోబల్ స్థాయిలో రికార్డు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 100 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఏకంగా 59,000 స్క్రీన్లలో ప్రదర్శితం కాబోతుండటం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం. అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు 40 విదేశీ, ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాను డబ్ చేశారు.
హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX)
రామాయణ సినిమాలో లంకా దహనం, సముద్ర సేతు నిర్మాణం, యుద్ధ ఘట్టాలు వంటి దృశ్యాలను అత్యున్నత ప్రమాణాలతో ఆవిష్కరించేందుకు అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ సంస్థ 'డిఎన్ఈజీ' (DNEG) పనిచేసింది. 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్', 'ది డార్క్ నైట్', 'డ్యూన్', 'ఇంటర్‌స్టెల్లార్' వంటి చిత్రాలకు ఆస్కార్ స్థాయి విజువల్స్ అందించిన ఈ సంస్థ, రామాయణాన్ని ఒక అద్భుతమైన విజువల్ వండర్‌గా మార్చింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


