Ramayana: రిలీజ్‌కు 10 రోజుల ముందే రామాయణం ప్రభంజనం- సాధారణ షోల కంటే 400% ఎక్కువ బుకింగ్స్- టికెట్ 1000 అయినా తగ్గేదేలే!
Ramayana Part 1 Advance Booking 400%: నితేష్ తివారీ డైరెక్ట్ ఫిల్మ్ రామాయణం అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. దసరా రోజే ప్రీ-సేల్స్ ప్రారంభించగా, ఐమాక్స్ షోల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విడుదలకు 10 డేస్ ముందే రికార్డు స్థాయి వసూళ్లతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Ramayana Part 1 Advance Booking 400%: భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణం పార్ట్-1'. నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రీ సేల్స్‌తోనే కలెక్షన్ల వర్షం
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న రామాయణ పార్ట్ 1 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విజయదశమి పండుగ సందర్భంగా ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ మొదలైన ఐదు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తన దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రీ-సేల్స్ రూపంలోనే మైలురాళ్లను దాటుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఆకాశాన్ని తాకుతున్న 'రామాయణం' ప్రీ-సేల్స్
విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉండగానే 'రామాయణం' చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఏకంగా రూ. 8.72 కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
ప్రారంభంలో హిందీ వర్షన్ బుకింగ్స్ అగ్రస్థానంలో నిలవగా, గత రెండు రోజులుగా సౌత్ ఇండియాలోనూ బుకింగ్స్ జోరందుకున్నాయి. ప్రస్తుతానికి మొత్తం రామాయణ ప్రీ-సేల్స్ కలెక్షన్లలో హిందీ బెల్ట్ 87 శాతం వాటాను కలిగి ఉంది.
ఏకంగా 72 శాతం ఆక్యుపెన్సీ
కన్నడ నాట దాదాపు 100 స్క్రీన్లలో బుకింగ్స్ ప్రారంభం కాగా, అప్పుడే రూ. కోటి మార్కుకు చేరువైంది. కొన్ని థియేటర్లలో మార్నింగ్ షోలకు ఏకంగా 72 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతుండటం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతం కేవలం 10 నుంచి 15 స్క్రీన్లలోనే పరిమితంగా బుకింగ్స్ ప్రారంభమవడంతో రూ. లక్ష మార్కును దాటింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల నడుమ రెవెన్యూ షేరింగ్ చర్చలు నడుస్తుండటంతో మిగిలిన ప్రాంతీయ భాషల షోల కౌంట్ వచ్చే వారంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఐమాక్స్ (IMAX) స్క్రీన్లలో టికెట్ల సునామీ
సాధారణ థియేటర్లతో పోలిస్తే ప్రీమియం ఫార్మాట్లయిన IMAX, 4DX స్క్రీన్లలో 'రామాయణం' చూడటానికి ప్రేక్షకులు అమితాసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం థియేటర్లలో ఐమాక్స్ స్క్రీన్ల వాటా కేవలం 3.8 శాతం మాత్రమే. కానీ, ఇప్పటివరకు వచ్చిన మొత్తం అడ్వాన్స్ కలెక్షన్లలో ఏకంగా 25 శాతం వాటా ఒక్క ఐమాక్స్ నుంచే రావడం గమనార్హం.
సాధారణ స్క్రీన్లలో టికెట్ సగటు ధర రూ. 380గా ఉంటే, ఐమాక్స్ స్క్రీన్లలో టికెట్ ధర సగటున రూ. 1,095గా ఉంది. ధర అంత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు వెనుకాడటం లేదు. సాధారణ స్క్రీన్లలో ఒక షోకి సగటున 35 టికెట్లు అమ్ముడవుతుంటే, ఐమాక్స్ స్క్రీన్లలో ఒక్కో షోకి సగటున 170 టికెట్లు అమ్ముడవుతున్నాయి.
400 శాతం వేగంతో టికెట్లు
అంటే సాధారణ షోల కంటే ఐమాక్స్‌లో 5 రెట్లు అంటే 400 శాతం ఎక్కువ వేగంతో టికెట్లు ఖాళీ అవుతున్నాయి. ఇక 4DX, ICE, డాల్బీ సినీ ఫార్మాట్లలోనూ ఇప్పటివరకు 12 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అధినేత నమిత్ మల్హోత్రా, విజువల్ ఎఫెక్ట్స్ దిగ్గజం డీఎన్ఈజీ, కేజీఎఫ్ స్టార్ యశ్‌కి చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు.
పౌరాణిక దృశ్యకావ్యంగా 'రామాయణం'
ఇక లంకేశ్వరుడు రావణాసురుడిగా యశ్ కనిపించనుండగా.. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించారు. మొదటి భాగం ఈ ఏడాది నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా, రెండవ భాగాన్ని 2027 దీపావళి కానుకగా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న రామాయణ పార్ట్ 1 సినిమా అంతర్జాతీయ పంపిణీ బాధ్యతలను సోనీ పిక్చర్స్ దక్కించుకోగా, హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


