Mandaadi Collection: సూపర్ హిట్‌గా సుహాస్, సూరి కాంబో- మండాడి బాక్సాఫీస్ సునామీ- రూ.65 కోట్ల కలెక్షన్లతో రికార్డ్!
Mandaadi Box Office Collection Day 5: తెలుగు హీరో సుహాస్, తమిళ కమెడియన్ సూరి కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇద్దరి కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.
Mandaadi Box Office Collection Day 5: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం ఉన్న కథలను, వైవిధ్యమైన పాత్రలను ఆదరించడంలో ముందుంటారు. 'కలర్ ఫోటో', 'అంబాజీపేట మ్యారేజిబ్యాండు' వంటి చిత్రాలతో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్, కోలీవుడ్ నటుడు సూరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘మండాడి’.

సముద్రం నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా
సముద్రం నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మండాడి సినిమాను ఎల్రెడ్ కుమార్ నిర్మించగా, మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదలైన మండాడి చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
బాక్సాఫీస్ వద్ద మండాడి వసూళ్ల వర్షం
మండాడి సినిమా విడుదలైనప్పటి నుంచి తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ దక్కించుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ ఇప్పటివరకు అంటే 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ అధికారికంగా పోస్టర్ ద్వారా ధృవీకరించింది.
మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాయని
సూరి, సుహాస్ కెరీర్‌లోనే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మండాడి నిలిచింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
థ్రిల్ కలిగించే యాక్షన్ సీక్వెన్స్‌లు
మండాడి సినిమాలో సముద్రం మీద చిత్రీకరించిన బోట్ రేసింగ్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన స్టంట్ సీన్లు విజువల్‌గా మెప్పించాయి.
కథలో వచ్చే ప్రతి ట్విస్ట్
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపధ్య సంగీతం, ఎస్.ఆర్. కథిర్ కెమెరా పనితనం ప్రతీ సన్నివేశాన్ని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. కథలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకుల్లో తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
రజినీకాంత్, వెట్రిమారన్ ప్రశంసలు
మండాడి చిత్రానికి స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్, వెట్రిమారన్ వంటి దిగ్గజాలు సినిమా చూసి చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు.
మండాడి నటీనటులు
సూరి, సుహాస్ పోటీపడి నటించారని, సత్యరాజ్, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని కొనియాడారు. కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ‘మండాడి’ విజయం మరోసారి నిరూపించింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


