Mandaadi OTT: ఓటీటీలోకి మండాడి- సుహాస్ విలన్‌గా తమిళ సినిమా తెలుగులో- 40 కోట్ల ధరలో ట్విస్ట్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mandaadi OTT Streaming Details: మండాడి ఓటీటీలోకి వచ్చేయనుంది. మండాడి ఓటీటీ ధర విషయంలో మాత్రం ఓ చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంది. తమిళంలో సుహాస్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీలో సూరి హీరోగా చేశాడు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మండాడి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ, ఏరోజు నుంచి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Mandaadi OTT Release Details: హాస్య నటుడిగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా మారి వరుస విజయాలు అందుకుంటున్న తమిళ నటుడు సూరి నటించిన తాజా చిత్రం 'మండాడి'. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మొదటి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

విలన్‌గా తెలుగు హీరో సుహాస్
సముద్ర తీర ప్రాంతపు నేపథ్యం, సాంప్రదాయ పడవ పందెం ఆట చుట్టూ తిరిగే కథాంశం వెండితెరపై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. తెలుగు యంగ్ హీరో సుహాస్ ఈ మండాడి చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టడం విశేషం. అంతేకాకుండా మండాడి సినిమాలో సూరికి పవర్‌ఫుల్ విలన్‌గా సుహాస్ నటించి మెప్పించాడు.
అంతేకాకుండా నెగెటివ్, గంభీరమైన పాత్రలో సుహాస్ అద్భుతమైన నటన కనబరిచి తమిళ తంబీల ప్రశంసలు అందుకుంటున్నారు. మండాడి సినిమాలో సూరి, సుహాస్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది మండాడి సినిమా.
మండాడి ఐఎమ్‌డీబీ రేటింగ్
డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా ఎక్స్‌పీరియెన్స్ ఇస్తున్న మండాడి సినిమాకు ఐఎమ్‌డీబీలో ఏకంగా 9.1 రేటింగ్ రావడం విశేషం. మతిమారన్ పుగజేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇండియాలో 3 రోజుల్లో మండాడి సినిమాకు రూ. 21.55 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా, రూ. 25.23 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అలాగే, ఓవర్సీస్‌లోనూ అదరగొడుతున్న మండాడి సినిమాకు 3 రోజుల్లో రూ. 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఇక వరల్డ్ వైడ్‌గా రూ. 30.23 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇలాగే కొనసాగితే మరింతగా భారీ కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది.
మండాడీ ఓటీటీ ధర ట్విస్ట్
ఇలాంటి క్రేజ్ తెచ్చుకుంటున్న మండాడి ఓటీటీలోకి వచ్చేయనుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ మండాడి ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. మండాడి ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ. 15 కోట్ల ధరకు ఫిక్స్ చేసిందట. కానీ, నిర్మాత ఎల్రెడ్ కుమార్ దానిని రూ. 25 కోట్లకు పెంచినట్లు సమాచారం.
అయితే, ఆ ధరకు నెట్‌ఫ్లిక్స్ ఒప్పుకోలేదు. కానీ, రెగ్యులర్ ఓటీటీ డీల్‌కు బదులుగా పర్ఫామెన్స్ బేస్డ్ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ డీల్ ప్రకారం బాక్సాఫీస్ వద్ద మండాడికి వచ్చే కలెక్షన్స్‌ను బట్టి ఓటీటీ ధర పెరుగుతుందన్నమాట.
నిర్మాతకు రిస్క్ అండ్ రివార్డ్
మండాడి సినిమా ఓటీటీకి బేస్ అమౌంట్ రూ. 10 కోట్లు. వరల్డ్ వైడ్‌గా మండాడి రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటితే ఆ ధర రూ. 30 కోట్లకు పెరుగుతుంది. మరింతగా వసూళ్లు పెరిగితే అది కాస్తా రూ. 40 కోట్లకు ధర చేరుకునే అవకాశం ఉందట. ఈ ఒప్పందం ప్రకారం సినిమాకు ఆడకుంటే నిర్మాతకు రిస్క్, అదే కలెక్షన్స్ పెరిగితే పెద్ద రివార్డుగా మారుతుంది.
ఇప్పటికి అయితే, మండాడి సినిమాకు రూ. 30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇంకో 4 రోజుల్లో రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వీకెండ్ ముగిసేసరికి మండాడి కలెక్షన్స్ రూ. 60 కోట్లకు చేరుకునే ఛాన్స్ కూడా ఉందంటున్నారు.
మండాడి బడ్జెట్
ఈ లెక్కన మండాడి ఓటీటీ రైట్స్ ధర రూ. 40 కోట్ల వరకు పెరుగుతుందని తెలుస్తోంది. ఇక మండాడి సినిమాకు రూ. 45 కోట్ల బడ్జెట్ అయిందట. అనుకున్నట్లుగా వీకెండ్ వరకు మండాడి కలెక్షన్స్ రూ. 50 కోట్లు దాటితే ఓటీటీ హక్కుల ధర రూ. 40 కోట్లు వస్తుంది. అంటే.. సుమారు బడ్జెట్ అంతా ఓటీటీ ద్వారానే వచ్చేస్తుంది.
మండాడి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ ద్వారా వచ్చేదంతా నిర్మాతకు లాభమే అని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే, నెట్‌ఫ్లిక్స్‌లో మండాడి ఓటీటీ రిలీజ్ అవనుంది. అక్టోబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మండాడి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అది కూడా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి 5 భాషల్లో మండాడి ఓటీటీలోకి వచ్చేయనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


