Scam 2010 OTT: ఓటీటీలోకి మరో స్కామ్ సిరీస్- చిన్న మొత్తాల పొదుపు పథకాల కుంభకోణం- స్కామ్ 2010 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Scam 2010 OTT Streaming First Look Release: ఓటీటీలో ఒక ఊపు ఊపేసిన సూపర్ హిట్ ఫ్రాంచైజీ స్కామ్ నుంచి కొత్త సిరీస్ వస్తోంది. హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్న స్కామ్ 2010లో సిద్ధార్థ్ బోడ్కే మెయిల్ లీడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. స్కామ్ 2010 ఓటీటీ రిలీజ్ ఎక్కడో చూద్దాం.

Published on: Aug 13, 2026, 06:33:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Scam 2010 OTT Release First Look Out: ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న భారతీయ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ డ్రామా ఫ్రాంచైజీ 'స్కామ్' కొత్త సీజన్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది. 'స్కామ్ 1992', 'స్కామ్ 2003' ఓటీటీ సిరీస్‌ల ఘన విజయం తర్వాత, ఇప్పుడు 'స్కామ్ 2010' చిత్రీకరణను నిర్మాతలు అధికారికంగా ప్రారంభించారు.

ఓటీటీలోకి మరో స్కామ్ సిరీస్- చిన్న మొత్తాల పొదుపు పథకాల కుంభకోణం- స్కామ్ 2010 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి మరో స్కామ్ సిరీస్- చిన్న మొత్తాల పొదుపు పథకాల కుంభకోణం- స్కామ్ 2010 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

చిన్న మొత్తాల పొదుపు పథకాల కుంభకోణం

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, బిర్లా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV)లో త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి ప్రారంభమై, దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సామ్రాజ్యంగా ఎదిగిన ఒక వ్యక్తి ప్రయాణం, ఆ తర్వాత అతను ఎదుర్కొన్న చట్టపరమైన చిక్కుల నేపథ్యంలో ఈ ఓటీటీ సిరీస్ సాగనుంది. ఇటీవలే ఈ స్కామ్ 2010 నుంచి విడుదల చేసిన నటుడు సిద్ధార్థ్ బోడ్కే ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

అత్యాశ, అధికారాల కలయికే ఈ కథ

ఈ ఫైనాన్షియల్ క్రైమ్ డ్రామా సిరీస్ గురించి దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ.. ఆర్థిక సామ్రాజ్యాల వెనుక ఉండే అసలు నిజాలను ఈ సిరీస్‌లో చూపించబోతున్నామని తెలిపారు.

"స్కామ్ 2010 అనేది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. మహాదశ, అధికారం, దానివల్ల వచ్చే అహంకారం చుట్టూ తిరిగే కథ. నమ్మకమే పునాదిగా నిర్మించిన ఒక సామ్రాజ్యం.. ఆ నమ్మకం సడలినప్పుడు ఎలా కుప్పకూలిందో ఇందులో చూపిస్తున్నాం. తను అమరుడనని భ్రమపడిన ఒక వ్యక్తి పతనాన్ని ఇది కళ్లకు కడుతుంది" అని హన్సల్ మెహతా పేర్కొన్నారు.

'స్కామ్' చరిత్రను తిరగరాసిన ఘనత

మన దేశంలో ఓటీటీ కంటెంట్‌కు ఒక కొత్త ఊపు తెచ్చిన సిరీస్‌లలో 'స్కామ్ 1992' అగ్రస్థానంలో నిలుస్తుంది. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆధారంగా వచ్చిన ఆ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 'స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ' కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.

అదే నమ్మకంతో ఇప్పుడు 'స్కామ్ 2010' ప్రాజెక్టును మరింత భారీగా ప్లాన్ చేశామని ఆప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ దీపక్ సెగల్ తెలిపారు.

హన్సల్ మెహతా రీ-ఎంట్రీతో

"భారతీయ ఓటీటీ రంగం తన ఉనికిని వెతుక్కుంటున్న సమయంలో వచ్చిన 'స్కామ్ 1992' ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. భారతదేశ చరిత్రలో అధికారం, మానవ నైజాలు ఘర్షణ పడే అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. హన్సల్ మెహతా రీ-ఎంట్రీతో ఈ కొత్త సీజన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది" అని దీపక్ సెగల్ నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సిరీస్‌లో కీలకమైన కథానాయకుడి పాత్రను పోషిస్తున్న నటుడు సిద్ధార్థ్ బోడ్కే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంక్లిష్టమైన మనస్తత్వం, ఎత్తుపల్లాలు ఉన్న పాత్రలో నటించడం తనకు లభించిన గొప్ప అవకాశమని చెప్పారు.

విభిన్న కోణాలు, కథ పరిధి

"ఈ పాత్రలో ఉన్న విభిన్న కోణాలు, కథ పరిధి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక వ్యక్తి ఆశయం, అతను సాధించిన విజయం, ఆపై చవిచూసిన పతనం.. ఇవన్నీ ఒక నటుడిగా నన్ను ఎంతగానో ఉత్సాహపరిచాయి. హన్సల్ మెహతా వంటి దిగ్గజ దర్శకుడి మార్గదర్శకత్వంలో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి" అని సిద్ధార్థ్ బోడ్కే తెలిపారు.

స్కామ్ 2010 ఓటీటీ రిలీజ్

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సిరీస్ త్వరలోనే సోనీ లివ్ ఓటీటీ ద్వారా వీక్షకుల ముందుకు రానుంది. అంటే, స్కామ్ 1992, స్కామ్ 2003 తరహాలోనే స్కామ్ 2010 సోన్ లివ్‌లో ఓటీటీ రిలీజ్ అవనుంది. మరి ఈ ఓటీటీ సిరీస్ ఏ మేరకు ఆదరిస్తుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More