Sai Pallavi Dhanush: విజయ్ సర్‌లా సినిమాలు మాత్రం వదిలేయకండి- ధనుష్ రాజకీయ ఎంట్రీపై సాయి పల్లవి విజ్ఞప్తి- హీరో ఆన్సర్?

Sai Pallavi Request To Dhanush To Continue Movies: ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ఓం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి హాజరైన సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ సర్ లాగా మాత్రం సినిమాలు వదిలేయొద్దని ధనుష్‌కు విన్నవించుకున్నారు సాయి పల్లవి.

Published on: Nov 7, 2026, 15:16:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sai Pallavi Request To Dhanush Over Political Entry: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్'. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ డ్రామా మూవీ ప్రీ-రిలీజ్ వేడుక శుక్రవారం (నవంబర్ 6) సాయంత్రం చెన్నైలోని ఒక కళాశాలలో అంగరంగ వైభవంగా జరిగింది.

విజయ్ సర్‌లా సినిమాలు మాత్రం వదిలేయకండి- ధనుష్ రాజకీయ ఎంట్రీపై సాయి పల్లవి విజ్ఞప్తి- హీరో ఆన్సర్?
విజయ్ సర్‌లా సినిమాలు మాత్రం వదిలేయకండి- ధనుష్ రాజకీయ ఎంట్రీపై సాయి పల్లవి విజ్ఞప్తి- హీరో ఆన్సర్?

మలయాళ మెగాస్టార్‌తోపాటు సాయి పల్లవి

ఈ ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవితో పాటు చిత్ర బృందం హాజరయ్యారు. వేదికపై సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు, దానికి ధనుష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పొలిటికల్ మీటింగ్‌ను గుర్తుచేసిన అభిమానుల జెండాలు

సభకు హాజరైన ధనుష్ అభిమానులు భారీగా జెండాలు పట్టుకుని రావడాన్ని చూసి సాయి పల్లవి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది సినిమా వేడుకలా కాకుండా రాజకీయ సభలా కనిపిస్తోందని అన్నారు. తమిళనాడులో ఇటీవల దళపతి విజయ్ నటనకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.

విజయ్ సర్‌లా నటనకు స్వస్తి

"మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మద్దతు ఇస్తాను. కానీ, విజయ్ సర్ లాగే మీరు కూడా నటనకు స్వస్తి చెప్తారేమోనని భయంగా ఉంది. ధనుష్ సర్ ఎప్పటికీ నటుడిగానే మన మధ్య ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను" అని సాయి పల్లవి ఆ వేదికపై విజ్ఞప్తి చేశారు. ఆమె మాటలకు సభలోని అభిమానుల నుంచి కేరింతలతో భారీ స్పందన లభించింది.

రాజకీయ నాయకులు ఉన్నారనే ప్రచారానికి చెక్

రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు, తన వెనుక కొందరు రాజకీయ నాయకులు ఉన్నారనే ప్రచారానికి ధనుష్ వేదికపైనే చెక్ పెట్టారు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా సినిమాల పైనే ఉందని స్పష్టం చేశారు.

నన్ను నడిపించేది దేవుడే: ధనుష్ క్లారిటీ

"నా వెనుక ఎవరో ఉండి నన్ను నడిపిస్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ నన్ను నడిపించేది ఆ దేవుడు ఒక్కడే. నా వెనుక నిలబడేది నా అభిమానులు, నన్ను ఆదరించేది ప్రజలు మాత్రమే" అని ధనుష్ చెప్పుకొచ్చారు.

వరుస సినిమాలతో బిజీగా ఇద్దరూ

వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ స్వయంగా నిర్మించిన 'ఓం' చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల 'కర' చిత్రంతో మెప్పించిన ధనుష్, ప్రస్తుతం వెట్రిమారన్‌తో 'తమిళ్ మురుగన్', తమిలరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో 'D56' ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

రామాయణంలో సీతగా సాయి పల్లవి

మరోవైపు సాయి పల్లవి కూడా పాన్-ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల జునైద్ ఖాన్‌తో 'ఏక్ దిన్' ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, నితేష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం'లో సీత పాత్ర పోషించారు. వీటితో పాటు మణిరత్నం-విజయ్ సేతుపతి కాంబినేషన్ చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More