Anirudh Kavya Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి.. పదేళ్ల క్రితమే చెప్పిన జాతకం.. మరి ధనుష్, శివ కార్తికేయన్ సంగతేంటీ?

Anirudh Kavya Wedding Tarot Card Prediction: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితమే ఒక టారో కార్డ్ రీడర్ అనిరుధ్‌కు కాబోయే భార్య గురించి చెప్పిన జోస్యం వీడియో నెట్టింట్లో అందరిని షేక్ చేస్తుంది.

Published on: Oct 18, 2026, 16:07:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Anirudh Ravichander Kavya Maran Wedding Tarot Card Prediction: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత కొన్ని వారాలుగా ప్రచారంలో ఉన్న ఈ వార్తపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెళ్లి, రిసెప్షన్ ఆహ్వాన పత్రిక గురించి చేసిన ప్రకటనతో అధికారికంగా స్పష్టత వచ్చింది.

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి.. పదేళ్ల క్రితమే చెప్పిన జాతకం.. మరి ధనుష్, శివ కార్తికేయన్ సంగతేంటీ?
అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి.. పదేళ్ల క్రితమే చెప్పిన జాతకం.. మరి ధనుష్, శివ కార్తికేయన్ సంగతేంటీ?

అనిరుధ్‌కు రాబోయే భార్య లక్షణాలు

ఈ శుభవార్త బయటకు రాగానే అనిరుధ్ అభిమానులు పదేళ్ల క్రితం నాటి ఒక ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఒక టారో కార్డ్ రీడర్ (కార్డ్సుతో జాతకం చెప్పే వ్యక్తి) అనిరుధ్ పెళ్లి, ఆయనకు రాబోయే భార్య లక్షణాల గురించి పదేళ్ల క్రితమే చెప్పిన జోస్యం, జాతకం ఇప్పుడు అక్షరాలా నిజమైందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్‌తో ఖాయమైన పెళ్లి వార్త

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన భార్య కావేరీ మారన్ ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి రిసెప్షన్‌కు సీఎంను ఆహ్వానించారు.

అనిరుధ్, కావ్యపెళ్లి వార్త తెలంగాణ సీఎంవో సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో పాటు పలువురు ప్రముఖులకు కూడా ఈ వివాహ ఆహ్వాన పత్రికలను ఇప్పటికే అందజేశారు.

పదేళ్ల క్రితం నాటి ఆసక్తికర జోస్యం

వివాహ నిశ్చయ వార్త వైరల్ అయిన వెంటనే, దాదాపు పదేళ్ల క్రితం 'తంతి టీవీ'లో ప్రసారమైన ఒక కార్యక్రమం వీడియో నెట్‌లో హల్‌చల్ చేయడం ప్రారంభించింది. అప్సర రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆ షోలో, ప్రముఖ ఆస్ట్రాలజర్ జయశ్రీ టారో కార్డ్స్ ఆధారంగా అనిరుధ్ భవిష్యత్తు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

అనిరుధ్ చేసుకోబోయే అమ్మాయి మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ లేదా టెలికమ్యూనికేషన్ రంగానికి చెందినదై ఉంటుందని ఆ రోజు జయశ్రీ చెప్పారు. ఆ అమ్మాయి ఉన్నత చదువులు చదివిన తెలివైన మహిళ అయి ఉంటుందని, వారిద్దరూ ఒక పార్టీలో కలుసుకుంటారని జోస్యం చెప్పారు. అనిరుధ్ ఇల్లు, ఆ అమ్మాయి ఇల్లు కేవలం రెండు కిలోమీటర్ల లోపే ఉంటాయని, అలాగే, లవ్ మ్యారేజ్ అవుతుందని ఆనాడే అనిరుధ్ జాతకం చెప్పారు ఆమె.

కావ్య మారన్ ప్రొఫైల్‌తో అక్షరాలా సరిపోలిన వివరాలు

జ్యోతిష్కురాలు ఆ రోజు చెప్పిన ప్రతీ అంశం కావ్య మారన్ ప్రొఫైల్‌తో సరిగ్గా మ్యాచ్ కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కావ్య మారన్ ప్రస్తుతం సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బ్రాడ్‌కాస్టింగ్, మీడియా రంగంలోనే ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

లండన్ పరిధిలోని ప్రసిద్ధ వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఆమె ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. చెన్నైలోని అనిరుధ్ నివాసానికి, కావ్య మారన్ నివాసానికి మధ్య దూరం కూడా చాలా తక్కువగానే ఉండటం ఈ జోస్యానికి మరింత బలాన్ని చేకూర్చింది. మళ్లీ లవ్ చేసుకుని, పెద్దలను ఒప్పించడం వంటి విషయాలు అన్నీ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయని అభిమానులు డీకోడ్ చేస్తున్నారు.

నెటిజన్ల ఆశ్చర్యం, కామెంట్ల వర్షం

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ 'ఎక్స్' (ట్విట్టర్) లో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. "పదేళ్ల క్రితం చెప్పిన జోస్యం ఇంత అచ్చంగా నిజమవుతుందని ఊహించలేదు" అని ఒక నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ధనుష్, శివ కార్తికేయన్ సంగతేంటీ?

బ్రాడ్‌కాస్టింగ్ రంగం, ఇళ్ల మధ్య దూరం వంటి నిర్దిష్ట విషయాలు కూడా పొంతన కుదరడం నిజంగా అద్భుతమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ధనుష్, శివ కార్తికేయన్ వంటి ఇతర సినీ ప్రముఖుల గురించి కూడా ఆ జ్యోతిష్కురాలు నాడు ఏం చెప్పారో వెతికే పనిలో అభిమానులు నిమగ్నమయ్యారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More