Ayesha: తెలుగు హీరోయిన్ అరెస్ట్, ఇక నీకు అవకాశాలు ఉండవన్న నెటిజన్-కెరీర్ కోల్పోడానికి కూడా సిద్ధమేనంటూ ఆయేషా ఖాన్ కౌంటర్

Ayesha Khan Reply To Trolls Amid Arrest: నీట్ పత్రాల లీకేజీపై విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సినిమా ఆఫర్లు రావంటూ బెదిరించిన ట్రోలర్‌కు ఆయేషా ఖాన్ ఇచ్చిన సంచలన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Jul 24, 2026, 11:27:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ayesha Khan Reply To Trolls Amid Arrest: నీట్ (NEET) పరీక్షల లీకేజీ అక్రమాలపై దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రముఖ బాలీవుడ్ నటి, తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు వ్యాన్‌లోకి నెట్టి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

తెలుగు హీరోయిన్ అరెస్ట్, ఇక నీకు అవకాశాలు ఉండవన్న నెటిజన్-కెరీర్ కోల్పోడానికి కూడా సిద్ధమేనంటూ ఆయేషా ఖాన్ కౌంటర్
తెలుగు హీరోయిన్ అరెస్ట్, ఇక నీకు అవకాశాలు ఉండవన్న నెటిజన్-కెరీర్ కోల్పోడానికి కూడా సిద్ధమేనంటూ ఆయేషా ఖాన్ కౌంటర్

ఆయేషాను ఈడ్చుకెళ్లిన పోలీసులు

జులై 22న ముంబై దాదర్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు తన సోదరుడు, స్నేహితులతో కలిసి వెళ్లారు ఆయేషా ఖాన్. అయితే నిరసన ప్రదర్శన ప్రారంభించకముందే పోలీసులు ఆమెను అకారణంగా ఈడ్చుకెళ్లి వోర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

"ఆత్మగౌరవం ముఖ్యం".. ట్రోలర్‌కు రీసౌండింగ్ కౌంటర్!

పోలీసుల కస్టడీకి సంబంధించిన వీడియోలను ఆయేషా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఒక నెటిజన్ "ఇకపై నీకు బాలీవుడ్‌లో ఎలాంటి అవకాశాలు రావు" అంటూ ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఆయేషా, ఆత్మగౌరవంతో కూడిన ఘాటు సమాధానం ఇచ్చారు.

"నా ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కంటే నా కెరీర్‌ను కోల్పోవడానికే సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి బెదిరింపులు వేరే ఎవరికైనా ఉపయోగించుకోండి, ధన్యవాదాలు, బై బై" అని ఆయేషా ఖాన్ గట్టిగా బదులిచ్చారు.

పోలీసు వ్యాన్‌లో ఏమి జరిగింది?

తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తే పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయేషా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాదర్ నుంచి వోర్లీకి తీసుకెళ్లే క్రమంలో తానెలాంటి తప్పు చేశానో చెప్పమని ఎంత అడిగినా అధికారులు సమాధానం ఇవ్వలేదని వాపోయారు.

"నలుగురైదుగురు మహిళా పోలీసులు నన్ను బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లోకి నెట్టారు. మేము ఏ తప్పు చేశామని అరెస్ట్ చేశారో చెప్పాలని ఎంత అడిగినా వారి నుంచి ఎలాంటి జవాబు లేదు" అని ఆయేషా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, కనీస ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆమె అన్నారు.

విద్యార్థులు నిరాహార దీక్షలు

నీట్ ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి విద్యార్థులు నిరాహార దీక్షలు చేపట్టారు.

ఆయేషా ఖాన్ ఇన్‌స్టా స్టోరీ
ఆయేషా ఖాన్ ఇన్‌స్టా స్టోరీ

దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పరీక్షా విధానంలో పారదర్శక సంస్కరణలు తీసుకురావాలని దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించుకున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More