Ayesha Khan Arrest: తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్.. 15 మంది పోలీసులతో బలవంతంగా వ్యాన్‌లోకి..! వీడియో వైరల్

Ayesha Khan Arrest In Mumbai: ధురంధర్ సినిమాలోని 'షరారత్' పాటతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల ఆందోళన చేస్తున్న ప్రాంతంలో రోడ్డుపై ఊరికే నిల్చున్న తనను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

Published on: Jul 23, 2026, 06:16:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ayesha Khan Arrest In Mumbai: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. 'ధురంధర్' చిత్రంలో 'షరారత్' అనే స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె, ముంబైలో జరుగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్.. 15 మంది పోలీసులతో బలవంతంగా వ్యాన్‌లోకి..! వీడియో వైరల్
తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్.. 15 మంది పోలీసులతో బలవంతంగా వ్యాన్‌లోకి..! వీడియో వైరల్

దాదర్ వీధుల్లో ఏం జరిగింది?

దాదర్ ప్రాంతంలో రోడ్డుపై ఊరికే నిలబడిన తమను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారని ఆయేషా ఖాన్ ఆరోపించారు. బుధవారం (జూలై 22) సాయంత్రం 4 గంటల సమయంలో దాదర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసన సంఘీభావ సభకు ఆయేషా ఖాన్ తన సోదరుడు, స్నేహితులతో కలిసి వెళ్లారు.

అక్కడ తాము ఎలాంటి నినాదాలు చేయకముందే, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు చుట్టుముట్టారని ఆయేషా తెలిపారు. మరో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని అడుగుతున్న సమయంలోనే, దాదాపు 15 మంది పోలీసుల బృందం (10 మంది పురుషులు, 5 గురు మహిళా పోలీసులు) వచ్చి తమపై బలప్రయోగం చేశారని వివరించారు.

అరెస్ట్‌పై లేని సమాధానం

మహిళా పోలీసులు తనను బలవంతంగా లాక్కెళ్లారని, తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వినకుండా పోలీస్ వ్యాన్‌లోకి నెట్టేశారని ఆయేషా వెల్లడించారు.

"నన్ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పమని వ్యాన్ అంతటా అధికారులను వేడుకున్నా ఏ ఒక్కరి నుంచి సమాధానం రాలేదు" అని ఆయేషా ఆవేదన వ్యక్తం చేశారు.

దాదర్ నుంచి తమను వర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అక్కడ అధికారులు పద్ధతిగానే మాట్లాడినప్పటికీ.. అసలు తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదని ఆయేషా ఖాన్ పేర్కొన్నారు.

"రోడ్డుపై నిలబడటం నేరమా?" - ఆయేషా తీవ్ర ఆగ్రహం

పోలీసులు తనను నెట్టివేస్తూ వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న వీడియోను ఆయేషా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సింది పోయి, ప్రశాంతంగా ఉన్న పౌరులపైనే అధికారులు ప్రతాపం చూపుతున్నారని ఆయేషా ఖాన్ మండిపడ్డారు.

"రోడ్డుపై ప్రశాంతంగా నిలబడటం ఎప్పటి నుంచి నేరమైంది?" అని ఆయేషా ప్రశ్నించారు. సమాజంలో జవాబుదారీతనం లోపించిందని, ఏ తప్పూ చేయనందున ఈ రోజు తనకు ఎంతో ప్రశాంతమైన నిద్ర పడుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా మిన్నంటిన విద్యార్థుల ఆందోళనలు

కాగా మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన విద్యార్థుల ఆందోళనలు ఇప్పుడు దేశంలోని పలు ప్రధాన నగరాలకు వ్యాపించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఈ నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి.

సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష

లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా ముంబైలోని శివాజీ పార్క్, చైత్యభూమి, దాదర్ తదితర ప్రాంతాల్లోనూ విద్యార్థి సంఘాలు రోడ్లపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులు ముందస్తు చర్యగా పలువురిని అదుపులోకి తీసుకోగా, అందులో తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్ కూడా ఉన్నారు.

ఆయేషా ఖాన్ తెలుగు సినిమాలు

శ్రీ విష్ణు ఓం భీమ్ భుష్, విశ్వక్ సేన్ ముఖచిత్రం, శర్వానంద్ మనమే వంటి తెలుగు సినిమాల్లో నటించింది ఆయేషా ఖాన్. అన్నిటికి మించి ధురంధర్‌లో స్పెషల్ సాంగ్‌తో ఇండియా వైడ్ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఆయేషా ఖాన్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More