Rajasekhar: శర్వానంద్ హీరో కదా.. సెకండ్ లెవల్ కు వెళ్లిపోయానేంట్రా అనుకున్నా.. కానీ హీరోలా ట్రీట్ చేశారు: రాజశేఖర్

Rajasekhar: సెకండ్ లెవల్ కు వెళ్లిపోయానని చాలా ఫీల్ అయినట్లు సీనియర్ హీరో రాజశేఖర్ పేర్కొన్నాడు. కానీ బైకర్ మూవీలో తనను హీరోలాగే ట్రీట్ చేశారని అతను తెలిపాడు. బైకర్ మూవీ ట్రైలర్ రిలీజ్ లాంఛ్ ఈవెంట్లో రాజశేఖర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. 

Published on: Mar 23, 2026, 09:53:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒకప్పుడు వరుసగా సక్సెస్ లు అందుకున్న హీరో రాజశేఖర్. ఈ సీనియర్ హీరో ఇప్పటికీ లీడ్ రోల్స్ ప్లే చేస్తూ అప్పుడప్పుడూ మూవీస్ చేస్తున్నాడు. మరోవైపు బైకర్ మూవీలో హీరో తండ్రిగా క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడు. ఇలా క్యారెక్టర్ రోల్స్ చేయడంపై రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. బైకర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో అతని స్పీచ్ వైరల్ గా మారింది.

రాజశేఖర్ (x/uv creations)
రాజశేఖర్ (x/uv creations)

రాజశేఖర్ కామెంట్లు

శర్వానంద్ హీరోగా వస్తున్న ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీ ‘బైకర్’. ఇందులో హీరో తండ్రి, మెంటార్ గా రాజశేఖర్ నటించాడు. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రాజశేఖర్ మాట్లాడుతూ ఈ కథ విన్నప్పుడు తనకు చాలా బాగా నచ్చిందని తెలిపాడు. ముఖ్యంగా శర్వానంద్ వంటి యంగ్ హీరోతో కలిసి నటించడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా

తాను హీరోగా మాత్రమే కాకుండా, కథలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని రాజశేఖర్ వెల్లడించాడు. "గత రెండు మూడేళ్లుగా నేను క్యారెక్టర్ రోల్స్ చేయాలని అనుకుంటున్నా, కానీ సరైన సబ్జెక్ట్ దొరకలేదు. ఇప్పుడు బైకర్ మూవీ చేశాను" అని రాజశేఖర్ అన్నాడు.

సెకండ్ లెవల్

‘‘నా సినిమా ఎప్పుడు వస్తుందని రీసెంట్ అడిగారు. బైకర్ వస్తుంది కదా చెప్పా. అది శర్వానంద్ సినిమా కదా అన్నారు. అప్పుడే అర్థమైంది. సెకండ్ లెవల్ కు వెళ్లిపోయానేంట్రా అనుకున్నా. కానీ ఈ విషయంలో తన పిల్లలు, జీవిత మద్దతు ఇచ్చారు. ‘డాడీ ఇప్పుడు సెకండ్ లెవల్ అంటూ ఏం లేదు. మంచి పాత్రలు వస్తే వదులుకోవద్దు’ అని చెప్పారు’’ అని రాజశేఖర్ వెల్లడించాడు.

రాజశేఖర్ రిక్వెస్ట్

"నేను ఇప్పుడు అన్ని రకాల పాత్రలకు అడ్జస్ట్ అయిపోయా. నాకు క్యారెక్టర్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా. నన్ను అన్ని సినిమాల్లో పెట్టుకోండి" అని రాజశేఖర్ తెలిపాడు. దీంతో ఎలాంటి క్యారెక్టర్లు అయినా చేసేందుకు రెడీగా ఉన్నానని, సినిమాలు చేయాలని ఉందని రాజశేఖర్ క్లియర్ గా చెప్పేశాడు.

హీరోలాగే

శర్వానంద్ చాలా స్వీట్ పర్సన్ అని, తన పట్ల ఎంతో మర్యాదగా ఉంటాడని రాజశేఖర్ ప్రశంసించాడు. షూటింగ్ సమయంలో యూవీ క్రియేషన్స్ వాళ్లు తనను ఒక హీరోలాగే చూసుకున్నారని, ఆ ట్రీట్మెంట్ తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపాడు. ఏప్రిల్ 3న విడుదల కాబోతున్న ఈ 'బైకర్' సినిమా ఒక కొత్త రకమైన అనుభూతిని ఇస్తుందని రాజశేఖర్ ధీమా వ్యక్తం చేశాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More