హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన ప్రదర్శన - ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

Cockroach Janta Party Protest in Hyderabad : నీట్ పరీక్షలో అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భారీ నిరసన చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

Published on: Jun 14, 2026, 12:40:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నీట్ పేపర్ లీకేజీ వివాదం, సీబీఎస్‌ఈ (CBSE) ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌లో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భారీ నిరసనను చేపట్టింది. ఇందులో పలు విద్యార్థి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

ఎన్టీఏకు వ్యతిరేకంగా నిరసన స్వరాన్ని వినిపించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత, విద్యావేత్తలు భారీ సంఖ్యలో ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. "మాకు న్యాయం కావాలి" (We Want Justice), "ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి" అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబూని కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు

ఈ నిరసన కార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగసేసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ తన మద్దతును ప్రకటించారు. హైదరాబాద్ ధర్నా చౌక్‌లో జరుగుతున్న ఈ సభను ఉద్దేశించి తాను ప్రసంగించబోతున్నట్లు ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ధర్నాలో రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతియుత ధర్నాకు ఆదివారం మధ్యాహ్నం వరకు మాత్రమే అధికారికంగా అనుమతి ఇచ్చినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సమయం ముగిసేలోపు నిరసనకారులను పంపించే దిశగా అదనపు బలగాలను రంగంలోకి దించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More