తెలంగాణకు ఐఎండీ బిగ్ అలర్ట్ - హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన! సీఎం కీలక ఆదేశాలు
Telangana Weather Updates : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Telangana Weather Updates : రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని అధికార యంత్రాంగం అంతా హై అలర్ట్‌లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఉన్నతాధికారులను ఆదేశించారు.

వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. కానీ…. ఆ తర్వాత మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు తగ్గుతాయి. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ సహా దాదాపు 30కి పైగా జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
జూన్ 14, 15 తేదీల్లో కూడా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు…
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, జీహెచ్‌ఎంసీ మున్సిపల్ సిబ్బంది, హైడ్రా (HYDRAA), విద్యుత్ శాఖ, వాటర్ బోర్డుతో పాటు ఇతర అనుబంధ విభాగాలు పూర్తి సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , డీజీపీ, కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక కార్యదర్శితో సహా సీనియర్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నగరంలోని పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు పడే సమయంలో వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలిచే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేకంగా అత్యవసర రెస్క్యూ బృందాలను మోహరించాలని, వరద నీరు వేగంగా వెళ్లేలా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
టీజీఎస్పీడీసీఎల్ కీలక సూచనలు:
ప్రకృతి వైపరీత్యాలు, భారీ గాలివానలు, వర్షాలు సంభవించిన సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్పీడీసీఎల్ సూచించింది. తెగిపోయిన విద్యుత్ వైర్లు, కూలిపోయిన విద్యుత్ స్తంభాలు లేదా విద్యుత్ సంబంధిత ప్రమాదకర పరిస్థితులు కనిపించిన వెంటనే కాల్ సెంటర్ 1912కు సమాచారం అందించాలని కోరింది. ప్రజలు స్వయంగా విద్యుత్ వైర్లు లేదా ఇతర విద్యుత్ పరికరాలను తాకేందుకు, తొలగించేందుకు లేదా మరమ్మత్తులు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

