Jim Jim Tara Parnashala:ఒక్క పాటతో సోషల్ మీడియా షేక్- జిమ్ జిమ్ తార సాంగ్‌తో హారర్ థ్రిల్లర్ మూవీ పర్ణశాల మాస్టర్ స్కెచ్

Parnashala Marketing Strategy With Jim Jim Tara Song: తెలుగులో వస్తున్న సరికొత్త హారర్ థ్రిల్లర్ సినిమా పర్ణశాల. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు పర్ణశాల టీమ్ మాస్టర్ మార్కెటింగ్ స్కెచ్ వేసింది. సోషల్ మీడియాను షేక్ చేసిన జిమ్ జిమ్ తార సాంగ్‌తో మూవీ ప్రమోషన్స్ వినూత్నంగా చేపట్టడం ఇప్పుడు ఆకట్టుకుంటోంది.

Published on: Oct 6, 2026, 21:29:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Parnashala Marketing Strategy With Jim Jim Tara Song: సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలంటే భారీ ప్రమోషన్ బడ్జెట్.. స్టార్ హీరోలు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. వరుసగా రీల్స్, ఈవెంట్స్ అవసరమని భావించే రోజుల్లో ఓ చిన్న సినిమా టీమ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన దారిని ఎంచుకుంది.

ఒక్క పాటతో సోషల్ మీడియా షేక్- జిమ్ జిమ్ తార సాంగ్‌తో హారర్ థ్రిల్లర్ మూవీ పర్ణశాల మాస్టర్ స్కెచ్
ఒక్క పాటతో సోషల్ మీడియా షేక్- జిమ్ జిమ్ తార సాంగ్‌తో హారర్ థ్రిల్లర్ మూవీ పర్ణశాల మాస్టర్ స్కెచ్

పర్ణశాల టీమ్ వేసిన మాస్టర్ ప్లాన్

ఒక్క క్రియేటివ్ ఐడియాతో భారీ ప్రమోషన్ ఖర్చును తగ్గించడమే కాకుండా.. తమ సినిమాను జనాల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఎస్ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి తెరకెక్కిన సినిమా ‘పర్ణశాల’ టీమ్ వేసిన మాస్టర్ ప్లాన్!

హారర్ కామెడీ నేపథ్యంలో పర్ణశాల

హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న పర్ణశాల చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాట ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. పర్ణశాల సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం చేసిన ఓ వినూత్న ప్రయత్నం అనూహ్యమైన స్పందనను తీసుకొచ్చింది.

లక్ష్మీదేవితో జిమ్ జిమ్ తార పాట

ఇప్పటికే లక్ష్మీదేవితో ‘జిమ్ జిమ్ తార’ పాటను పాడించిన చిత్ర బృందం, సినిమా ప్రచారానికి ఈ పాటనే ప్రధాన ఆయుధంగా మలుచుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా రూపొందించిన ప్రమోషనల్ మూవ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

రీల్స్ కంటే ముందే జనాల నోట ‘జిమ్ జిమ్ తార’!

పెయిడ్ ప్రమోషన్స్, భారీ ఇన్‌ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్స్ లేకుండానే పాట జనాల్లోకి వెళ్లడం ‘పర్ణశాల’ టీమ్‌కు కలిసొచ్చిన అతిపెద్ద అంశంగా మారింది. మొబైల్ స్క్రీన్లకే పరిమితం కాకుండా.. సాధారణ ప్రేక్షకుల నోట కూడా పాట వినిపించే స్థాయికి చేరుకోవడంతో చిత్ర బృందం ఉత్సాహంగా ఉంది.

ఒక పాట హిట్ కావడమంటే?

ఒక పాట హిట్ కావడం అంటే కేవలం మ్యూజిక్ పరంగా విజయం మాత్రమే కాదు. అది సినిమా మీద క్యూరియాసిటీని పెంచుతుంది. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో గుర్తింపు తీసుకొస్తుంది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఇది చాలా కీలకం. అదే ఫార్ములాను ‘పర్ణశాల’ టీమ్ పక్కాగా ఉపయోగించుకుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్

‘జిమ్ జిమ్ తార’కు వచ్చిన స్పందన సినిమాకు కూడా బజ్ తీసుకొచ్చేలా మారితే.. అది థియేట్రికల్ బిజినెస్‌తో పాటు ఓటీటీ, ఆడియో హక్కుల మార్కెట్‌పైనా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

అంతేకాదు.. చిన్న సినిమాలకు “భారీ బడ్జెట్ లేకపోయినా, భారీ ఐడియా ఉంటే ప్రమోషన్ సాధ్యమే” అనే కొత్త కాన్ఫిడెన్స్‌ను ఈ ప్రయత్నం ఇస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

థియేటర్లదాకా హైప్ సాగుతుందా

పర్ణశాల సినిమా విడుదలకు ముందే ఓ పాట ఇంతగా చర్చలోకి రావడం ‘పర్ణశాల’ టీమ్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. మరి ఈ హైప్ థియేటర్ల వరకు కొనసాగుతుందా? ‘జిమ్ జిమ్ తార’ క్రియేట్ చేసిన బజ్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో

వై.జి. భరత్ దర్శకత్వంలో, మంచి వెంకట్ నిర్మిస్తున్న ‘పర్ణశాల’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తన వినూత్న ప్రమోషన్ స్ట్రాటజీతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More