Anirudh Kavya Marriage: అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి- సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం- మ్యారేజ్, రిసెప్షన్ వివరాలు!

Anirudh Kavya Marriage Invitation To CM Revanth Reddy: అనిరుధ్ రవిచందర్, ఎస్ఆర్‌హెచ్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్తలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ దంపతులు హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వీరి వివాహ, రిసెప్షన్‌కు ఆహ్వానించడంతో ఈ జంట పెళ్లి వార్తలకు తెరపడింది.

Published on: Oct 17, 2026, 00:07:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Anirudh Ravichander Kavya Maran Marriage Invitation To CM Revanth Reddy: కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌ల పెళ్లి టాపిక్ గత కొంతకాలంగా ఆసక్తిగా మారుతూ వస్తుంది. తాజాగా మరోసారి వీరి పెళ్లి విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి- సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం- మ్యారేజ్, రిసెప్షన్ వివరాలు!
అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి- సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం- మ్యారేజ్, రిసెప్షన్ వివరాలు!

పెళ్లిపై అధికారిక ప్రకటన

దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు ఐపీఎల్ అభిమానుల్లోనూ ఆసక్తి రేపుతున్న ఈ జంట పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన దాదాపుగా వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకు అనిరుధ్, కావ్య మారన్ పెళ్లిపై వచ్చిన ఊహాగానాలకు తెరదించింది తెలంగాణ సీఎంఓ కార్యాలయం.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అనిరుధ్, కావ్య వెడ్డింగ్ ఇన్విటేషన్ తాజాగా అందింది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తన సతీమణితో కలసి హైదరాబాద్‌కు విచ్చేసి, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి వివాహ ఆహ్వాన పత్రికను స్వయంగా అందించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది.

సీఎం రేవంత్ రెడ్డికి మారన్ దంపతుల ఆహ్వానం

జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డి, ఆయన సతీమణిని మారన్ దంపతులు శోభాయమానంగా కలిశారు. తమ కుమార్తె కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాలని వారు కోరారు. ఈ వేడుక నవంబర్ 21వ తేదీన చెన్నైలో వైభవంగా జరగనుందని సమాచారం.

డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడ? చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్!

హైదరాబాద్‌తో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి ఉన్న అనుబంధం, తెలుగు రాష్ట్రాల్లో కావ్య మారన్‌కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటివరకు ఇరు కుటుంబాలు అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, పెళ్లి వేడుకకు సంబంధించిన విశేషాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

నవంబర్ 11న గ్రీస్‌లోని మనోహరమైన లొకేషన్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని సమాచారం. ఆ తర్వాత నవంబర్ 14న చెన్నైలో ఓ ప్రత్యేక కార్యక్రమం, నవంబర్ 21న చిత్ర పరిశ్రమ, రాజకీయ రంగానికి చెందిన వీఐపీల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.

తెలుగు గడ్డపై ఇద్దరికీ అపారమైన అభిమాన గణం

అనిరుధ్ బంధువు, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో ఇదివరకు ఇచ్చిన హింట్ కూడా ఈ ప్రచారానికి బలాన్ని ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనిరుధ్, కావ్య మారన్ ఇద్దరూ ఎంతో సుపరిచితులే. 'జర్సీ', 'గ్యాంగ్ లీడర్' నుంచి ఇటీవల వచ్చిన 'ది ప్యారడైజ్' వరకు అనిరుధ్ అందించిన స్వరాలు తెలుగు యువతను ఊపేశాయి.

అటు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన ప్రతీసారి ఉప్పల్ స్టేడియం గ్యాలరీలో ఉత్సాహంగా కనిపించే కావ్య మారన్‌ను క్రికెట్ అభిమానులు సొంత ఇంటి అమ్మాయిలా భావిస్తారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మైదానంలో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

వీఐపీల సందడి.. సినీ రాజకీయ దిగ్గజాల హాజరు

సన్ నెట్‌వర్క్ అధినేత ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కావడంతో ఈ వేడుకకు దక్షిణాది రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌లతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలకు కూడా ఆహ్వానాలు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సినీ ఫంక్షన్‌ను తలపించేలా ఈ వివాహ మహోత్సవం దక్షిణాది వ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More