Sign in

RCB vs SRH IPL 2026 Live Streaming: ఈరోజు నుంచే ఐపీఎల్ 2026.. ఆర్సీబీతో సన్‌రైజర్స్ ఢీ.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవీ

RCB vs SRH IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 ఈరోజే ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Published on: Mar 28, 2026, 07:42:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌గా వచ్చేసింది. ఈరోజే అంటే మార్చి 28 శనివారం నాడు జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎం చిన్నస్వామి స్టేడియంలో తలపడబోతున్నాయి. 19వ సీజన్‌గా వస్తున్న ఈ టీ20 టోర్నీతో మన కింగ్ విరాట్ కోహ్లీ మళ్లీ కాంపిటేటివ్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

RCB vs SRH IPL 2026 Live Streaming: ఈరోజు నుంచే ఐపీఎల్ 2026.. ఆర్సీబీతో సన్‌రైజర్స్ ఢీ.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవీ (PTI)
RCB vs SRH IPL 2026 Live Streaming: ఈరోజు నుంచే ఐపీఎల్ 2026.. ఆర్సీబీతో సన్‌రైజర్స్ ఢీ.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవీ (PTI)

ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత విరాట్ ఆడుతున్న ఫస్ట్ టోర్నీ ఇదే. సౌతాఫ్రికా, కివీస్‌తో జరిగిన గత రెండు సిరీస్‌లలో గ్రౌండ్ నలువైపులా షాట్లు కొట్టి అదరగొట్టిన కోహ్లీ.. అదే ఫామ్‌ను ఈ రాబోయే టోర్నీలోనూ కంటిన్యూ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.

స్టార్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ దూరం

ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఇద్దరూ దూరం కానున్నారు. వాళ్లిద్దరూ గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే దానికి కారణం. అయితే వాళ్లు ఇప్పటికే ఇండియాకు చేరుకున్నారు. టోర్నీలో ముందు ముందు మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ కచ్చితంగా ఉంది.

కమిన్స్ లేకపోవడంతో సన్‌రైజర్స్ టీమ్‌ను ఇషాన్ కిషన్ లీడ్ చేయబోతున్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గత ఏడాది ఆర్సీబీ కప్ గెలిచిన సంబరాల్లో చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన అత్యంత బాధాకరమైన సంఘటన తర్వాత.. మళ్లీ ఇక్కడ ఒక కాంపిటేటివ్ మ్యాచ్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ రెండు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో బెంగళూరులో పరుగుల వరద పారడం పక్కా అనిపిస్తోంది. కానీ ఏ టీమ్ బౌలర్లు ప్రెజర్‌ను బాగా హ్యాండిల్ చేస్తారో వాళ్లదే ఫైనల్ విక్టరీ అయ్యే ఛాన్స్ ఉంది.

ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ కెప్టెన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ దార్, వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్, విహాన్ మల్హోత్రా, విక్కీ ఓస్వాల్, అభినందన్ సింగ్, జాకబ్ బేథెల్, జోర్డాన్ కాక్స్, స్వప్నిల్ సింగ్, కనిష్క్ చౌహాన్, సాత్విక్ దేశ్వాల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, లియామ్ లివింగ్‌స్టోన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే, ఇషాన్ మలింగ, శివమ్ మావి, స్మరణ్ రవిచంద్రన్, జీషన్ అన్సారీ, సలిల్ అరోరా, కమిందు మెండిస్, బ్రైడన్ కార్స్, డేవిడ్ పేన్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, క్రేన్స్ ఫులేత్రా, అమిత్ కుమార్

ఆర్సీబీ VS సన్‌రైజర్స్ ఓపెనింగ్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్

మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

ఆర్సీబీ, సన్‌రైజర్స్ మధ్య ఐపీఎల్ 2026 ఫస్ట్ మ్యాచ్ మార్చి 28 శనివారం నాడు జరగనుంది. రాత్రి 7 గంటలకు టాస్ పడుతుంది, 7:30 నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.

మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది.

లైవ్ టెలికాస్ట్ ఏ ఛానెల్స్‌లో వస్తుంది?

ఈ అదిరిపోయే ఓపెనింగ్ మ్యాచ్‌ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్‌లో లైవ్‌గా చూడొచ్చు.

ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడొచ్చు?

మొబైల్ లేదా లాప్‌టాప్‌లో చూడాలనుకునే వాళ్లు జియో హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్‌లో ఎంజాయ్ చేయొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More