MSK On Kohli: అద్దంలో చూసుకుని అస‌హ్యించుకున్న కోహ్లి..అదే విరాట్ ట‌ర్నింగ్ పాయింట్‌..సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన ఎమ్మెస్కే

MSK On Kohli: విరాట్ కోహ్లి భారత క్రికెట్ దిగ్గజం. అలాంటి ఆటగాడు ఓ సారి తనను తాను అద్దంలో చూసుకుని అసహ్యించుకున్నాడు? ఈ బాడీ ఏంటీ అని అనుకున్నాడు. మరి అలా ఎందుకు జరిగిందో మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు. 

Published on: Mar 21, 2026, 19:36:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విరాట్ కోహ్లి అంటే ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్. అతనో రికార్డుల రారాజు. కానీ కెరీర్ స్టార్టింగ్ లో విరాట్ కోహ్లి తన బాడీని చూసుకుని అసహ్యించుకున్నాడట. ఈ విషయాన్ని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

ఎమ్మెస్కే కామెంట్లు

ఆహా వీడియో ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న 'సర్కార్ 6' కి టీమ్ ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లి కెరీర్ తొలినాళ్లలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నాడు. ఒక సాధారణ ఆటగాడు ప్రపంచ స్థాయి ఐకాన్‌గా ఎలా మారాడో వివరించాడు.

కెరీర్ మొదట్లో కోహ్లీ తీరు

2013 ప్రాంతంలో విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ మీద పెద్దగా దృష్టి పెట్టేవాడు కాదని, సరదాగా పార్టీలు చేసుకునేవాడని ఎమ్మెస్కే గుర్తుచేశాడు. అప్పట్లో కోహ్లీ ఫామ్ కోల్పోయి కెరీర్ పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని ఆయన పేర్కొన్నాడు. ఆ సమయంలో కోహ్లీని జట్టు నుండి తీసేయాలని కొందరు సెలెక్టర్లు కూడా భావించారట.

అండగా ధోని

అయితే అప్పటి కెప్టెన్ ఎం.ఎస్. ధోని మాత్రం విరాట్ కోహ్లీకి పూర్తి మద్దతుగా నిలిచారని ఎమ్మెస్కే వెల్లడించాడు. "విరాట్ ఈ దేశానికి భవిష్యత్తు, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి" అని ధోని పట్టుబట్టారట. ధోని చూపిన ఆ నమ్మకమే విరాట్ కోహ్లీ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

అద్దం ముందు ఆ నిర్ణయం

‘‘ఆస్ట్రేలియాలో ఒక మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రవిశాస్త్రి చేసిన ప్రశంసలు కోహ్లీని బాగా ఆలోచింపజేశాయి. ఆ సాయంత్రం అందరూ పార్టీకి వెళ్తుంటే, కోహ్లీ మాత్రం తన గదిలోనే ఉండిపోయాడట. తనను తాను అద్దంలో చూసుకుని, ఈ శరీరంతో లెజెండ్ అవ్వగలనా అని ప్రశ్నించుకున్నాడు’’ అని ఎమ్మెస్కే తెలిపాడు.

ఫిట్‌నెస్ మంత్రంతో మార్పు

‘‘అప్పటి నుండి ఫిట్‌నెస్‌ను ఒక తపస్సులా స్వీకరించాడని, తన బాడీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని ఎమ్మెస్కే తెలిపాడు. మొదట 28% ఉన్న ఫ్యాట్‌ను కష్టపడి 22% కి తగ్గించి ఇండియాలో బెస్ట్ బ్యాటర్ అయ్యాడు. ఆ తర్వాత దాన్ని 14% కి తెచ్చినప్పుడు ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకున్నాడు’’ అని ఎమ్మెస్కే వివరించాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్

‘‘చివరగా తన బాడీ ఫ్యాట్ ను 9% కి తగ్గించి ఈ ప్లానెట్ మీద బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనే లక్ష్యాన్ని చేరుకున్నాడు. విరాట్ కోహ్లీలోని ఆ పట్టుదల చూసి తనకు గూస్ బంప్స్ వచ్చాయి’’ అని ఎమ్మెస్కే ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపాడు.

కఠినమైన ఆహార నియమాలు

దాదాపు 6 ఏళ్ల పాటు విరాట్ కోహ్లీ అసలు మైదా గానీ, జంక్ ఫుడ్ గానీ ముట్టలేదని ఎమ్మెస్కే సంచలన విషయం వెల్లడించాడు. తన ఆహారాన్ని తనే వండుకుంటూ, ఎంతో కఠినమైన డైట్ ను ఆరు సంవత్సరాలు పాటించాడని చెప్పాడు. ఈ కఠోర శ్రమ, క్రమశిక్షణ వల్లే కోహ్లీ ఇవాళ గ్లోబల్ ఐకాన్ గా కోహ్లి ఎదిగాడని ఆయన తెలిపాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More