వైజాగ్‌లో విరాట్ కోహ్లి డ్యాన్స్‌.. కుల్‌దీప్‌తో బ్రోమాన్స్‌.. వైర‌ల్‌గా మారిన వీడియో.. ఎడమ చేత్తో రాహుల్ టాస్

గ్రౌండ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో విరాట్ కోహ్లి ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇవాళ వైజాగ్ స్టేడియంలో కుల్ దీప్ యాదవ్ తో కలిసి కోహ్లి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది. 

Published on: Dec 06, 2025 7:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ లెక్కలేనన్ని వికెట్లను సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ శనివారం (డిసెంబర్ 6) వైజాగ్ లో అతనికి ఒక కొత్త డాన్స్ పార్టనర్ దొరికాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడవ వన్డేలో కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పెల్ పూర్తి చేసినప్పుడు, కోహ్లీ ఈ లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్-స్పిన్నర్ ను ఒక 'మాక్ స్లో-డాన్స్' లోకి లాగి, అతని చేతిని పట్టుకుని కౌగిలించుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

విరాట్ కోహ్లి, కుల్‌దీప్ (@mutualstark/x.com)
విరాట్ కోహ్లి, కుల్‌దీప్ (@mutualstark/x.com)

కోహ్లి డ్యాన్స్

గ్రౌండ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కోహ్లి ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాడు. ఆడియన్స్ కు బోర్ కొట్టనివ్వడు. శనివారం కూడా వైజాగ్ లో అదే చేశాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో కుల్‌దీప్‌ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. చివర్లో ఒకే ఓవర్లో కార్బిన్ బాష్, ఎంగిడి వికెట్లు తీశాడు. అప్పుడు కోహ్లి వచ్చి కుల్‌దీప్‌ను హత్తుకుని, చేయి పట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఈ బ్రోమాన్స్ వీడియో తెగ వైరల్ గా మారింది.

ఎడమ చేతితో టాస్

సౌతాఫ్రికాతో మూడో వన్డేలో ఇండియా రాత మారింది. వరుసగా 21 వన్డేల తర్వాత తొలిసారి భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ తన స్టైల్ మార్చి ఎడమ చేత్తో టాస్ వేశాడు. ఇది ఇండియాకు కలిసొచ్చింది. టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది.

డికాక్ సెంచరీ

వైజాగ్ వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా మొదట్లో చెలరేగి ఆడింది. డికాక్ 89 బంతుల్లో 106 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బవుమా 48 రన్స్ సాధించాడు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్ కు 113 పరుగులు జోడించారు. దీంతో సౌతాఫ్రికా 28 ఓవర్లలో 168/2, ఆపై 199/4తో 300 స్కోరు చేసేలా కనిపించింది.

ప్రసిద్ధ్, కుల్‌దీప్‌ అదుర్స్

భారత బౌలర్లు ప్రసిద్ధ్, కుల్‌దీప్‌ అదరగొట్టారు. చెరో నాలుగు వికెట్లతో చెలరేగి సౌతాఫ్రికా 300 స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. తన మొదటి రెండు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్.. తర్వాతి స్పెల్ లో సత్తాచాటాడు. ఇన్నింగ్స్ ను ప్రసిద్ధ్ 4/66 తో ముగించాడు.

కుల్‌దీప్‌ మిడిల్, లోయర్ ఆర్డర్ పని పట్టాడు. తన స్పిన్ తో వైజాగ్ లో సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ ను కూల్చాడు. కుల్‌దీప్‌ కూడా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చివరకు సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More