రికార్డుల దుమ్ముదులిపిన రోకో.. సెంచరీతో చెలరేగిన కోహ్లి.. సిక్సర్ల వీరుడు రోహిత్
రాంచీలో రికార్డుల మోత మోగింది. రోకో జోడీ కొత్త చరిత్ర నమోదు చేసింది. ఓ వైపు సెంచరీతో విరాట్ కోహ్లి, మరోవైపు అత్యధిక సిక్సర్లతో విరాట్ కోహ్లి చెలరేగిపోయారు.
రాంచీలో ఆదివారం (నవంబర్ 30) రికార్డులు బద్దలయ్యాయి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చెలరేగిపోయారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి సెంచరీతో రెచ్చిపోయాడు. సండే రాంచీలో దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఈ ఇద్దరు లెజెండ్స్ పరుగుల ఊచకోత కోశారు. కొన్ని రికార్డులను ఖాతాలో వేసుకున్నారు.

అత్యధిక మ్యాచ్ లు
భారత్ తరపున అత్యధిక మ్యాచ్ లాడిన క్రికెటర్ల జోడీగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రికార్డు నమోదు చేశారు. సౌతాఫ్రికాతో ఫస్ట్ వన్డే వీళ్లకు 392వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్ తో సచిన్ టెండూల్కర్-రాహుల్ ద్రవిడ్ ల 391 అంతర్జాతీయ మ్యాచ్ ల రికార్డ్ ను రోకో బ్రేక్ చేశారు.
ద్రవిడ్-సచిన్ నుండి రో-కో వరకు...
చాలా సంవత్సరాలుగా టెండూల్కర్-ద్రవిడ్ ల భాగస్వామ్యం నిలకడ అసాధారణమైనదిగా భావించారు. వారు వివిధ ఫార్మాట్లలో, వివిధ కాలాలలో కలిసి ఆడారు. భారతదేశం తరపున 146 టెస్టులు, 245 వన్డేలు ఆడారు. రోహిత్-కోహ్లీ ల 392 మ్యాచ్ లు, చాలా భిన్నమైనవి. వీళ్లు 60 టెస్టులు, 226 వన్డేలు, 106 టీ20లు కలిసి ఆడారు.
52వ సెంచరీ
విరాట్ కోహ్లి వన్డేల్లో 52వ సెంచరీ అందుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డు అతని ఖాతాలోనే ఉంది. ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు అతని ఖాతాలో చేరింది. ఈ మ్యాచ్ తో ఇండియాలో వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగానూ కోహ్లి మరో హిస్టరీ క్రియేట్ చేశాడు. రాంచీలో అతను 102 బంతుల్లో ఫోర్ తో సెంచరీ అందుకున్నాడు.
రోహిత్ సిక్సర్లు
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు సొంతం చేసుకున్నాడు. 38 ఏళ్ల రోహిత్ ఈ మ్యాచ్ లో షాహిద్ అఫ్రిది (351) రికార్డును బ్రేక్ చేశాడు. అఫ్రిది కంటే 100 ఇన్నింగ్స్ లు తక్కువే ఆడాడు రోహిత్. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ 51 బంతుల్లో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఇది రోహిత్ కు వరుసగా మూడో 50 ప్లస్ స్కోరు.
4, 6, 6, 4
సెంచరీ తర్వాత విరాట్ కోహ్లి ఫుల్ బీస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. సుబ్రయెన్ బౌలింగ్ లో వరుసగా 4, 6, 6, 4 కొట్టాడు. చూస్తుండగానే అతని స్కోరు 130 దాటిపోయింది. 40 ఓవర్లకు టీమిండియా 264/4తో నిలిచింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


