Dhoni CSK: గూస్‌బంప్స్ వీడియో-సీఎస్కే జెర్సీ దొంగ‌త‌నం-ర‌జినీకాంత్‌లా ధోని ఎంట్రీ-జెర్సీ లాంఛ్ వేరే లెవ‌ల్‌

Dhoni CSK: చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ దొంగతనానికి గురైంది. అప్పుడు రజినీకాంత్ లా తలా ధోని ఎంట్రీ ఇచ్చాడు. దొంగను పట్టుకుని జెర్సీని తీసుకొచ్చాడు. ఇదంతా సీఎస్కే కొత్త జెర్సీ లాంఛ్ కోసం తీసిన వీడియో. ఇది చూస్తుంటే గూస్ బంప్స్ గ్యారెంటీ. 

Published on: Mar 1, 2026, 10:30:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ అదిరిపోయింది. ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో ధోని చేరాడు. ధోని ఎంట్రీ, సీఎస్కే జెర్సీ లాంఛ్ కోసం ఆ ఫ్రాంఛైజీ క్రియేట్ చేసిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలోని ‘టైగర్ కా హుకుం’ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే ధోని ఎంట్రీ అదిరిపోయింది.

ధోని (x/ChennaiIPL)
ధోని (x/ChennaiIPL)

సీఎస్కే జెర్సీ

ఐపీఎల్ 2026 కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ తన జెర్సీ లాంఛ్ కోసం స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. డెన్ కమింగ్ జెర్సీ హీస్ట్ అంటూ వీడియోతో అదరగొట్టింది. ఈ వీడియోలో సీఎస్కే జెర్సీ ఉన్న బ్యాగ్ ను ఓ దొంగ వచ్చి తీసుకెళ్తాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో సహా సీఎస్కే ఆటగాళ్లు టీమ్ హోటల్ కు చేరుకుంటారు. జెర్సీ కోసం వెళ్లగా అక్కడ బ్యాగ్ ఉండదు.

హీరోలా ధోని

జెర్సీ బ్యాగ్ కనిపించకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ వెంటనే తలా ధోనికి కాల్ చేస్తాడు. బైక్ పై ధోని వస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కారులో పారిపోతున్న దొంగను పట్టుకుని ధోని జెర్సీ తీసుకుని హోటల్ కు వస్తాడు. అప్పుడు రుతురాత్ 7 నంబర్ ఉన్న ధోని జెర్సీని లాంఛ్ చేస్తాడు. ఆ తర్వాత ధోని హోటల్ గదిలోకి వెళ్లిపోతాడు.

ధోని రాకతో

మహేంద్ర సింగ్ ధోని రాకతో సీఎస్కే ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నెలకొంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ధోని ఆడతాడో లేదో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ధోని ఇప్పుడు సీఎస్కే టీమ్ తో చేరడంతో అతను ఈ సీజన్ లో ఆడటం ఖాయమైంది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ ఆనందాన్ని అంతే లేకుండా పోయింది.

ఐపీఎల్ 2026

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కాబోతుందని తెలిసింది. ఇది మార్చి 28 నుంచి మే 31 వరకు జరుగుతుందని సమాచారం. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడం అదే తొలిసారి. ఈ సీజన్ లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగనుంది.

ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు టైటిల్ కోసం మరోసారి పోరుకు సై అంటున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More