SRH: ఇషాన్ కిషన్ వర్సెస్ జీషన్ అన్సారీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. అసలేం జరిగింది?
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల మధ్య గొడవ హాట్ టాపిక్ గా మారింది. ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ మధ్య ఇన్సిడెంట్ టెన్షన్ పెడుతోంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2026 సమరానికి తెరలేవక ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో వాతావరణం వేడెక్కింది. సీజన్ కు ముందు టీమ్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన అంతర్గత ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్, యువ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇషాన్ కిషన్ దూకుడు
రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఐపీఎల్ 2026 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ను ఇషాన్ కిషన్ నడిపించనున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా యువ బౌలర్ జీషన్ అన్సారీ వేసిన ఒకే ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు పిండుకుని తన ఫామ్‌ను చాటుకున్నాడు.
అన్సారీ వికెట్ ఆనందం
జీషన్ అన్సారీ కూడా ఏమాత్రం తగ్గకుండా కిషన్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆ ఓవర్ చివరి బంతికి కిషన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన ఆనందంలో అన్సారీ చేసిన సంబరాలు, కిషన్‌ను పెవిలియన్‌కు పంపిన తీరు మైదానంలో కాసేపు ఉత్కంఠ రేపాయి.
ఆటగాళ్ల మధ్య వాగ్వాదం
వికెట్ పడిన తర్వాత ఇషాన్ కిషన్ మైదానంలోనే ఆగి జీషన్ అన్సారీతో ఏదో మాట్లాడటం కనిపించింది. మొదట ఇషాన్ వికెట్ తీసిన జీషన్ పెవిలియన్ వైపు వేలు చూపించాడు.
ఇది చూసిన అభిమానులు వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. కానీ, చివరకు ఇషాన్ కిషన్ నవ్వుతూ పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
గుడ్ న్యూస్
ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల మధ్య ఇలాంటి తీవ్రమైన పోటీ ఉండటం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచిదే. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, అలాగే యువ బౌలర్ అన్సారీ ఒత్తిడిలోనూ వికెట్ తీయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు కొండంత బలాన్నిస్తోంది.
డిఫెండింగ్ ఛాంపియన్స్‌తో
మార్చి 28న జరిగే ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌ను ఎదుర్కోవడానికి SRH సైన్యం ఎంతటి కసిగా ఉందో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఘటన నిరూపిస్తోంది. అభిమానులు కూడా ఈ పోరు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


