Ishan Kishan: మసీదుకు, చర్చికి ఎందుకు వెళ్లలేదు? కీర్తి ఆజాద్ వివాదాస్పద కామెంట్లపై ఇషాన్ కిషన్ రియాక్షన్ ఇదే

Ishan Kishan: టీ20 ప్రపంచకప్ లో ఇండియా విక్టరీ తర్వాత మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై ఇషాన్ కిషన్ రియాక్షన్ వైరల్ గా మారింది.

Published on: Mar 11, 2026, 09:47:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా విక్టరీ తర్వాత అర్ధరాత్రి ఐసీసీ ఛైర్మన్ జై షా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అహ్మదాబాద్ లోని హనుమాన్ టెంపుల్ కు వెళ్లారు. ట్రోఫీతో దేవుడిని దర్శించుకున్నారు. అయితే దీనిపై మాజీ ఆటగాడు, తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్లపై తాజాగా ఇషాన్ కిషన్ రియాక్టయ్యాడు.

ఇషాన్ కిషన్ (PTI)
ఇషాన్ కిషన్ (PTI)

టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు. 319 పరుగులు సాధించాడు. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై ఇండియా గెలిచింది. వరుసగా రెండో సారి టీ20 ప్రపంచకప్ గెలిచింది. అయితే ఆ తర్వాత కీర్తి ఆజాద్ కామెంట్లు కాంట్రవర్సీకి దారితీశాయి.

ఇషాన్ కిషన్ రియాక్షన్

టీ20 ప్రపంచకప్ అనంతరం ఇషాన్ కిషన్ తన సొంత రాష్ట్రం బీహార్ లోని పాట్నాకు చేరుకున్నాడు. ఎయిర్ పోర్ట్ లో ఇషాన్ ను విలేకర్లు కీర్తి ఆజాద్ కామెంట్ల గురించి అడిగారు.

ఈ సందర్భంగా అలాంటి ప్రశ్నలు అడగడానికి ఇది సమయం కాదని, అది ప్రపంచ కప్ గెలుపు అనుభూతిని తగ్గిస్తుందని కిషన్ చెప్పాడు. ‘‘నేను ఇప్పుడే అద్భుతమైన ప్రపంచ కప్ గెలిచా. దయచేసి మంచి ప్రశ్నలు అడగండి. కిర్తీ ఆజాద్ ఏమన్నారో నేను ఏం చెప్పగలను? దయచేసి కొన్ని మంచి ప్రశ్నలు అడగండి. టీ20 ప్రపంచకప్ గెలవడం ఎలా అనిపించిందో, ఎంత ఆనందంగా ఉందో చెప్పండి' అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.

కీర్తి ఆజాద్ ఏమన్నారంటే?

జై షా, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కలిసి టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో హనుమాన్ టెంపుల్ కు వెళ్లడంపై 1983 వరల్డ్ కప్ విన్నర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ కామెంట్లు వివాదాస్పదంగా మారాయి.

‘‘ఎందుకు మసీదు కాదు? ఎందుకు చర్చి కాదు? ఎందుకు గురుద్వారా కాదు? ట్రోఫీ 1.4 బిలియన్ ఇండియన్లకు చెందినది. కేవలం ఏ ఒక్క మతానికి చెందిన విజయం కాదు’’ అని ఎక్స్ అకౌంట్లో కీర్తి ఆజాద్ పోస్టు చేశాడు.

హార్భజన్ కౌంటర్

కీర్తి ఆజాద్ పోస్టుకు టీమిండియా మాజీ స్పిన్నర్ హార్భజన్ దిమ్మతిరిగే కౌంటర్ వేశాడు. ‘‘తోటి క్రికెటర్ల నుంచి ఇలాంటి విషయాలు వినడం దురదృష్టకరం. బహుశా వాళ్లు క్రీడల కంటే రాజకీయాలను ఎక్కువగా ఇష్టపడతారేమో. అలాంటి కామెంట్లు చేసిన వ్యక్తి ఒక క్రీడాకారుడు కావడం మరింత దురదృష్టకరం. దేశం ప్రపంచకప్ గెలిచింది. సంతోషంగా ఉండండి, సంబరాలు చేసుకోండి. కానీ మీరు రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు’’ అని భజ్జీ ఏఎన్ఐతో అన్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More