Ishan Kishan: తీవ్ర విషాదంలో ఇషాన్ కిషన్-ఫైనల్‌కు ముందు యాక్సిడెంట్లో కజిన్ దుర్మరణం-ఆమెకు అంకితంగా టీ20 ప్రపంచకప్
Ishan Kishan: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అయితే కొండంత బాధను దాచి ఈ ఫైనల్లో ఇషాన్ రాణించాడు. ఫైనల్ కు ముందు అతని కజిన్ రోడ్డు ప్రమాదంలో మరణించింది.
ఇషాన్ కిషన్.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మార్మోగుతున్న పేరు ఇది. టీ20 ప్రపంచకప్ లో ఈ ఇండియన్ ఓపెనర్ అదిరే బ్యాటింగ్ తో సత్తాచాటాడు.ఫైనల్లోనూ మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. అయితే మనసులో కొండంత బాధతో ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించడానే సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కజిన్ దుర్మరణం
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తీవ్రమైన బాధతోనే ఇషాన్ కిషన్ ఆడాడు. ఫైనల్ కు ఒక రోజు ముందు అతని కజిన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. మనసును మెలిపెట్టే ఈ బాధతోనే ఫైనల్లో ఆడాడు. దేశం కోసం ప్రాతినిథ్యం వహించాడు. సూపర్ బ్యాటింగ్ తో, ఫీల్డింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బ్యాడ్ న్యూస్
ఆదివారం (మార్చి 8) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముగిసిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ విషాదకర వార్తను వెల్లడించాడు. ఫైనల్‌కు ఒక రోజు ముందు కారు ప్రమాదంలో తన కజిన్ సోదరిని కోల్పోయినట్లు తెలిపాడు.
ఆమెకే అంకితం
టీ20 ప్రపంచకప్ లో ఇండియా విక్టరీని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన కజిన్ సోదరికి అంకితమిస్తున్నట్లు ఇషాన్ కిషన్ ప్రకటించాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) రోజున దక్కిిన ఈ విజయాన్ని తన సోదరికి డెడికేట్ చేశాడు.
హార్డిక్ పాండ్యతో
టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు ముందు తన కజిన్ సిస్టర్ మరణం గురించి హార్దిక్ పాండ్యతో మాట్లాడానని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. అతను T20 ప్రపంచ కప్ ఫైనల్‌పై దృష్టి పెట్టమని, జట్టుకు ప్రాధాన్యత ఇవ్వమని హార్దిక్ చెప్పాడని కిషన్ తెలిపాడు.
‘‘ఫైనల్ మ్యాచ్ కు ముందు రోజు నా కజిన్ సిస్టర్ కారు ప్రమాదంలో మరణించింది. తుదిపోరులో ఆమె కోసమే బాగా ఆడాను. అంతకుముందు హార్దిక్ భాయ్‌తో మాట్లాడాను. అతను జట్టుకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాడు. ఈ విజయాన్ని నా కజిన్ సిస్టర్ కు అంకితం చేస్తున్నా. ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి ఇది మరింత ప్రత్యేకం’’ అని మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ తెలిపాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


