Ind vs Eng Semifinal: దంచికొట్టిన సంజూ, శివమ్ దూబె, ఇషాన్ కిషన్.. ఇంగ్లండ్ బౌలింగ్ ఊచకోత.. టీమిండియా 253 రన్స్
ఇంగ్లండ్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ సెమీఫైనల్లో టీమిండియా దంచికొట్టింది. సంజూ శాంసన్, శివమ్ దూబె, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా చెలరేగడంతో 20 ఓవర్లలో ఇండియా 7 వికెట్లకు ఏకంగా 253 రన్స్ చేయడం విశేషం. ఇంగ్లండ్ ఈ స్కోరు చేజ్ చేయడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.
టీమిండియాను ఒంటిచేత్తో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేర్చిన సంజూ శాంసన్ తన ఫామ్ కొనసాగిస్తూ ఇంగ్లండ్ బౌలర్లను కూడా చితకబాదాడు. అతడు కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 89 రన్స్ చేయడంతో ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 రన్స్ చేసింది.
చితకబాదిన సంజూ, ఇషాన్
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే అది ఎంత తప్పుడు నిర్ణయమో సంజూ శాంసన్ త్వరలోనే చూపించాడు. ఆ టీమ్ బౌలర్లను ఊచకోత కోస్తూ తన చివరి సూపర్ 8 మ్యాచ్ ఫామ్ ను కొనసాగించాడు.
అభిషేక్ శర్మ (9) మరోసారి నిరాశ పరిచినా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39)తో కలిసి రెండో వికెట్ కు 97 రన్స్ జోడించి టీమిండియా కళ్లు చెదిరే స్టార్ట్ ఇచ్చాడు సంజూ శాంసన్. ఈ క్రమంలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడు. గత మ్యాచ్ లో 97 రన్స్ దగ్గర ఆగి తృటిలో సెంచరీ మిస్సయిన అతడు.. ఈసారి సెంచరీ ఖాయంగా చేస్తాడనుకున్నా 89 రన్స్ దగ్గర ఔటయ్యాడు.
శివమ్, హార్దిక్, తిలక్ దూకుడు
ఇషాన్, సంజూ ఔటైన తర్వాత కూడా శివమ్ దూబె చెలరేగాడు. అతనికితోడు హార్దిక్ పాండ్యా కూడా చివర్లో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దూబె 25 బంతుల్లోనే 4 సిక్స్ లు, ఒక ఫోర్ 43 రన్స్ చేశాడు. ఇక తిలక్ వర్మ ఉన్నది కొద్దిసేపే అయినా 7 బంతుల్లో 21 రన్స్ చేయడం విశేషం. అటు హార్దిక్ కూడా 12 బంతుల్లోనే 27 రన్స్ చేశాడు. దీంతో ఇండియా 253 పరుగులు చేయగలిగింది.
ఇండియా బ్యాటర్ల ధాటికి ప్రతి ఇంగ్లండ్ బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. వాళ్ల స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అయితే 4 ఓవర్లలో ఏకంగా 61 రన్స్ ఇచ్చాడు. ఇక సామ్ కరన్ కూడా 4 ఓవర్లలో 53 రన్స్ ఇవ్వడం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


