Ind vs WI: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా.. సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్.. విండీస్ చిత్తు

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరింది డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా. సూపర్ 8 చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ ను చిత్తు చేసింది. అసలు సిసలు మ్యాచ్ లో కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్.. ఇండియన్ టీమ్ కు విజయం సాధించి పెట్టాడు.

Published on: Mar 1, 2026, 22:51:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 వరల్డ్ కప్ చివరి సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ ను 5 వికెట్లతో చిత్తు చేసింది టీమిండియా. సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ తో ఈ మెగా టోర్నీలో ఇండియన్ టీమ్ తన అత్యధిక టార్గెట్ చేజ్ చేసింది. అంతేకాదు చేజింగ్ లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ క్రికెటర్ గా విరాట్ కోహ్లి రికార్డును కూడా శాంసన్ బ్రేక్ చేశాడు. అతడు చివరికి 50 బంతుల్లో 97 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. మార్చి 5న ముంబైలో ఇంగ్లండ్ తో సెమీఫైనల్లో టీమిండియా తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరడం ఇది ఆరోసారి.

Ind vs WI: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా.. సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్.. విండీస్ చిత్తు (PTI)
Ind vs WI: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా.. సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్.. విండీస్ చిత్తు (PTI)

సంజూ ‘స్పెషల్’ శాంసన్

సంజూ శాంసన్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ తో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరింది టీమిండియా. వెస్టిండీస్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 196 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే శాంసన్ సిక్స్ కొట్టాడు. తర్వాతి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. శాంసన్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. తిలక్ వర్మ కూడా 15 బంతుల్లో 27 రన్స్ చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఆరంభంలో నిలకడ.. చివర్లో విధ్వంసం

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. ఓపెనర్లు శుభారంభం ఇవ్వగా, మిడిల్ ఓవర్లలో రోస్టన్ ఛేజ్ (40) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే అసలైన విధ్వంసం ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో జరిగింది. రోవ్‌మన్ పావెల్, జేసన్ హోల్డర్ భారత బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డారు.

ఇన్నింగ్స్ చివరిలో రోవ్‌మన్ పావెల్ (34*), జేసన్ హోల్డర్ (37*) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ వేసిన 16వ ఓవర్లో పావెల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు.

బుమ్రా వేసిన 20వ ఓవర్లో హోల్డర్ తొలి బంతికే సిక్సర్ బాదగా, నాలుగో బంతిని పావెల్ బౌండరీకి పంపాడు. ఈ ఓవర్లో మొత్తం 14 పరుగులు రావడంతో విండీస్ స్కోరు 190 దాటింది.

భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీసి ఫర్వాలేదనిపించినప్పటికీ, ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు. ఫీల్డింగ్‌లో అభిషేక్ శర్మ.. రోస్టన్ చేజ్ క్యాచ్ డ్రాప్ చేయడం భారత్‌కు ప్రతికూలంగా మారింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More