Virat Kohli: ఐపీఎల్ 2026 టార్గెట్.. కోహ్లి పవర్‌ఫుల్ ప్రాక్టీస్.. వీడియో వైరల్.. 2 గంటల్లోనే 58 లక్షల లైక్స్
Virat Kohli: ఐపీఎల్ 2026 సీజన్‌కు కింగ్ కోహ్లి రెడీ అవుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కోసం విరాట్ కోహ్లి ట్రైనింగ్ మొదలెట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. 2 గంటల్లోనే దీనికి 58 లక్షల లైక్స్ వచ్చాయి.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి యాక్షన్ కు రెడీ అవుతున్నాడు. ఐపీఎల్ 2026 కోసం ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ట్రైనింగ్ రీల్ వైరల్ గా మారింది.

విరాట్ కోహ్లి వీడియో
ఐపీఎల్ 2026కు సమయం ఆసన్నమవుతోంది. మార్చి 28న ఐపీఎల్ 19వ సీజన్ స్టార్ట్ కానుంది. ఈ కొత్త సీజన్ కోసం విరాట్ కోహ్లి రెడీ అవుతున్నాడు. ఆర్సీబీ టీమ్ ప్రధాన ఆటగాడైన కోహ్లి ప్రాక్టీస్ ను తీవ్రతరం చేశాడు. తన వెరిఫైడ్ అకౌంట్ నుంచి కోహ్లి ఓ వీడియో పోస్టు చేశాడు. దీనికి ‘ఐపీఎల్ 2026’ అనే క్యాప్షన్ ఇచ్చాడు.
ఇండోర్ ప్రాక్టీస్
కొత్త ఐపీఎల్ సీజన్‌కు ముందు ఇండోర్ నెట్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తూ కోహ్లి కనిపించాడు. కోహ్లి పూర్తి బ్యాటింగ్ గేర్‌లో డ్రిల్స్ చేస్తూ, షాడో ప్రాక్టీస్ చేస్తూ, ఆపై అనేక రకాల షాట్లను ఆడుతూ ప్రాక్టీస్ కొనసాగించాడు. భారీ షాట్లు ఆడాడు. పవర్ ఫుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
వైరల్
విరాట్ కోహ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇవాళ (మార్చి 11) ఇన్‌స్టాగ్రామ్ లో కోహ్లి ఈ వీడియో పోస్టు చేశాడు. ఈ వార్త రాసే సమయానికి రెండు గంటల్లోనే ఈ వీడియోకు 58 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
డిఫెండింగ్ ఛాంపియన్
ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగనుంది. 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఐపీఎల్ హిస్టరీలో ఆర్సీబీకి ఇదే ఫస్ట్ టైటిల్. ఇప్పుడు ఆ టైటిల్ ను నిలబెట్టుకోవాలనే టార్గెట్ తో ఆర్సీబీ పోరుకు సిద్ధమవుతోంది.
వన్డేల్లో మాత్రమే
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దిగ్గజ బ్యాటర్ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026కు ముందు సరైన ప్రాక్టీస్ ఉండాలని ముందుగానే ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. 2024లో ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
2025లో రోహిత్, కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఇద్దరు బ్యాటర్లు కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












