The Paradise Review: ది ప్యారడైజ్ రివ్యూ- నాని యాక్షన్ విధ్వంసం, మోహన్ బాబు విలనిజం- శ్రీకాంత్ ఓదెల 2వ మూవీ ఎలా ఉందంటే?

The Paradise Review And Rating In Telugu: ‘దసరా’ తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‘ది ప్యారడైజ్’. సవారి తెగ నేపథ్యంలో, మోహన్ బాబు విలనిజంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందే నేటి ది ప్యారడైజ్ రివ్యూలో చూద్దాం.

Published on: Sep 24, 2026, 10:10:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Paradise Review And Rating In Telugu: 'దసరా' సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త రస్టిక్ యాక్షన్ ట్రెండ్‌ను సెట్ చేసిన నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన రెండో చిత్రం 'ది ప్యారడైజ్'. అనౌన్స్‌మెంట్ రోజే విడుదల చేసిన పోస్టర్ల నుంచి నిన్నమొన్నటి టీజర్, సాంగ్స్ వరకు ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ది ప్యారడైజ్ రివ్యూ- నాని యాక్షన్ విధ్వంసం, మోహన్ బాబు విలనిజం- శ్రీకాంత్ ఓదెల 2వ మూవీ ఎలా ఉందంటే?
ది ప్యారడైజ్ రివ్యూ- నాని యాక్షన్ విధ్వంసం, మోహన్ బాబు విలనిజం- శ్రీకాంత్ ఓదెల 2వ మూవీ ఎలా ఉందంటే?

పవర్‌ఫుల్ విలన్‌గా మోహన్ బాబు

దానికితోడు సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్‌ఫుల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించడం, అనిరుధ్ రవిచందర్ సంగీతం, ఏష నాగుల సాంగ్‌లో కీర్తి సురేష్ నటించడంతో మాస్ ప్రియుల దృష్టి ఈ చిత్రంపై పడింది. భారీ అంచనాల నడుమ ఇవాళ (సెప్టెంబర్ 24) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ది ప్యారడైజ్ సినిమా వచ్చేసింది.

అయితే, ఇదివరకే నిన్న (సెప్టెంబర్ 23) రాత్రి నుంచి ది ప్యారడైజ్ ప్రీమియర్స్ షోలు పడ్డాయి. మరి నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది నేటి ది ప్యారడైజ్ రివ్యూలో తెలుసుకుందాం.

అసలు కథేంటంటే?

'ప్యారడైజ్' ప్రాంతంలో ఎలాంటి గుర్తింపు, హక్కులు లేకుండా జీవిస్తున్న సవారి సమాజం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 7 వేల మందితో స్థిరపడిన జాతి పేరు సవారీలు. దేశం కోసం పోరాడిన ఈ కుటుంబలు ప్రభుత్వ రికార్డుల్లో గుర్తింపు ఉండదు. అందుకోసం తరాలుగా పోరాటం చేస్తూనే ఉంటారు. వీరిని చిన్నచూపు చూస్తూ అణగదొక్కుతూ, ఎదురు తిరిగినవారిని చంపేస్తుంటుంది శిఖంజా మాలిక్ (మోహన్ బాబు) కుటుంబం.

ఆ అణచివేతపై తిరగబడే కొద్దిమందిలో సమ్మక్క (సొనాలి కులకర్ణి) ఒకరు. మాలిక్ చిత్రహింసల మధ్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చినిస్తుంది సమ్మక్క. తన కొడుకు జడల్ (నాని) సవారీలకు నాయకుడై గుర్తింపు సాధిస్తాడని కలలుకంటుంది.

ట్విస్టులు

కానీ, తల్లి అంటే ఏమాత్రం ఇష్టం లేని జడల్ సవారీలకు నాయకుడు అయ్యాడా? తన జాతికి గుర్తింపుతెచ్చాడా? అసలు అతని జడల్ అనే పేరు ఎందుకొచ్చింది? చిన్నతనంలోనే జడల్ జైలుకెందుకెళ్లాడు? జడల్ అంటే ఇష్టపడే సుబ్బు (కయాదు లోహర్) ఎవరు? అనేది తెలియాలంటే? ది ప్యారడైజ్ చూడాల్సిందే.

ఫస్ట్ హాఫ్ రా అండ్ రస్టిక్!

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫస్టాఫ్‌ను చాలా భిన్నమైన ప్రపంచంలో ఆవిష్కరించారు. సవారి వర్గం జీవన శైలి, వారి అణచివేతను ప్రతిబింబించేలా సృష్టించిన వాతావరణం సరికొత్తగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభ సన్నివేశాలు, నాని పాత్ర పరిచయం, తల్లి సెంటిమెంట్, సుబ్బు (కయాదు లోహర్) ట్రాక్ కథకు బలాన్నిచ్చాయి.

మోహన్ బాబు, రాఘవ్ జుయల్ తమ విలనిజంతో మరింత ఉత్కంఠను పెంచారు. సాధారణ కమర్షియల్ కామెడీ సన్నివేశాలు లేకపోయినప్పటికీ, కథనం ఇంటెన్సివ్‌గా సాగుతూ ఇంటర్వెల్ వరకు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.

సెకండాఫ్‌లో అలా

అయితే, ప్రథమార్థంలో పెంచిన అంచనాలను సెకండాఫ్‌లో డైరెక్టర్ నిలబెట్టుకోలేకపోయారు. అసలు కథను పక్కనపెట్టి కేవలం విపరీతమైన యాక్షన్, రక్తపాతం పైనే దృష్టి పెట్టడంతో సినిమా కాస్తా దారితప్పినట్లుగా ఆడియెన్స్ భావిస్తున్నారు. మాలిక్ పాత్రను ప్రారంభంలో చాలా శక్తివంతంగా చూపించినప్పటికీ, నాని పాత్రతో అతనికి వచ్చే ఘట్టాలు మరీ ఎక్కువ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.

మరోవైపు, తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పోలికలతో కూడిన రాజకీయ సన్నివేశాలు కొన్ని వర్గాల ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. వయోలెంట్ యాక్షన్, హింస సాధారణ ప్రేక్షకులకు కాకుండా యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే వారికి మంచి ట్రీట్‌గా అనిపిస్తుంది. కిల్, సలార్, మార్కో సినిమాలకుమించిన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన సీన్ రిపీట్ అయినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ పర్వాలేదు.

ఎవరెలా చేశారంటే?

నాని తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, జడల్ పాత్ర కోసం పడ్డ కష్టానికి అభినందనలు తెలపాల్సిందే. ఆయన మేకోవర్, మాస్ యాటిట్యూడ్ అద్భుతంగా ఉన్నాయి. ఎమోషన్ పండించే బలమైన సన్నివేశాలు ఇంకాస్తా ఎక్కువ ఉంటే బాగుండేదని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. యాక్షన్ సీన్లలో నాని అదిరిపోయాడు.

మోహన్ బాబు ఎంట్రీ నెక్ట్స్ లెవెల్‌గా ఉంటుంది. శిఖంజా మాలిక్‌గా మోహన్ బాబు అదరగొట్టారు. అలాగే, రాఘవ్ జుయల్ ఇంటెన్స్ పర్ఫామెన్స్‌తో అట్రాక్ట్ చేశాడు. కాయదు లోహర్ తన పాత్ర పరిధిలో అందంగా అలరించింది. ఏష నాగుల కట్ట, ఆయా షేర్ సాంగ్స్‌కు విజిల్స్ పడుతూనే ఉంటాయి. కీర్తి సురేష్ తన ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్‌తో అట్రాక్ట్ చేసింది.

యాక్షన్ లవర్స్ కోసం

సాంకేతికంగా ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ ఉన్నాయి. ప్యారడైజ్ ప్రపంచాన్ని విజువల్‌గా చాలా గ్రాండ్‌గా చూపించారు. అనిరుధ్ పాటలు ఆకట్టుకున్నప్పటికీ, సినిమాలో ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంచనాలకు మించి అందుకోలేకపోయింది. ఫైనల్‌గా చెప్పాలంటే యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ది ప్యారడైజ్ మంచి ఆప్షన్. ఓసారి చూడొచ్చు.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More