Ranbir Kapoor OTT: ఓటీటీ ప్రపంచంలోకి రామాయణం హీరో రణ్‌బీర్ కపూర్.. భార్య అలియా భట్ బాటలోనే భర్త.. పిక్చర్ షురూ!
Ranbir Kapoor Enter Into OTTs World: ఒకవైపు భారీ చిత్రాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తన సొంత బ్యానర్‌లో డిజిటల్ కంటెంట్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రామాయణంతో దూసుకుపోతున్న రణ్‌బీర్ ఓటీటీ ఎంట్రీపై లుక్కేద్దాం.
Ranbir Kapoor Enter Into OTTs World: పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ త్వరలోనే కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటివరకు నటుడిగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రణ్‌బీర్ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.

వెండితెర వెనుక నిర్మాతగా
అయితే ఈసారి కెమెరా ముందుకు రాకుండా, వెండితెర వెనుక నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు పెరుగుతున్న ఆదరణను గుర్తించిన రణ్‌బీర్ కపూర్ ఓటీటీల్లో కొత్త కథలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సొంత బ్యానర్‌లో ఓటీటీ ప్రాజెక్టులు
'వెరైటీ ఇండియా' నివేదిక ప్రకారం.. రణ్‌బీర్ కపూర్ తన సొంత నిర్మాణ సంస్థ 'పిక్చర్ షురూ ప్రొడక్షన్స్' ద్వారా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించాలని భావిస్తున్నారు. దర్శకుడు అనురాగ్ బసుతో కలిసి నిర్మించిన 'జగ్గా జాసూస్' సినిమాతో ఈ బ్యానర్‌ను ఆయన ప్రారంభించారు.
బ్రహ్మాస్త్రకు సహా నిర్మాతగా
ఆ తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'బ్రహ్మాస్త్ర'కు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు రణ్‌బీర్ కపూర్. ఇప్పుడు డిజిటల్ వేదికల కోసం విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. కొత్త డిజిటల్ ప్రయత్నాల్లో ఆయన స్వయంగా నటించరని, కేవలం వెనుక ఉండి నూతన ప్రతిభను, వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తారని సమాచారం.
భార్య అలియా భట్ బాటలోనే..
డిజిటల్ మీడియాలో నిర్మాతగా ఎదగాలన్న రణ్‌బీర్ నిర్ణయం వెనుక సతిమణి అలియా భట్ ప్రోత్సాహం కూడా ఉంది. అలియా తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి 'ఎటర్నల్ సన్‌షైన్' నిర్మాణ సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు. ఈ బ్యానర్‌పై వచ్చిన 'డార్లింగ్స్' సినిమాతో పాటు కరణ్ జోహార్‌తో కలిసి 'జిగ్రా' చిత్రాన్ని కూడా అలియా భట్ నిర్మించారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం
ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'డోంట్ బీ షై' వెబ్ సిరీసును అలియా నిర్మించారు. అందులో ఆమె నటించకుండా కేవలం నిర్మాతగానే వ్యవహరించారు. ఇప్పుడు రణ్‌బీర్ కూడా అదే బాటలో పయనిస్తూ ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
భారీ చిత్రాలతో బిజీగా రణ్‌బీర్
నటుడిగా రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం అత్యంత బిజీ షెడ్యూల్‌ను గడుపుతున్నారు. రణ్‌బీర్ కపూర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం' నవంబర్ 5న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. వచ్చే ఏడాది దివాళికి రామాయణ పార్ట్ 2 కూడా రానుంది.
రణ్‌బీర్ కపూర్ సినిమాలు
ఇదే కాకుండా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'లవ్ అండ్ వార్' చిత్రంలో రణ్‌బీర్ నటించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 21న రానున్న ఈ సినిమాలో అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
సిల్వర్ స్క్రీన్ అండ్ ఓటీటీ
ఒకవైపు సిల్వర్ స్క్రీన్‌పై భారీ బడ్జెట్ సినిమాలతో సందడి చేస్తూనే, మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త కంటెంట్‌తో దూసుకుపోవడానికి రణ్‌బీర్ కపూర్ వేస్తున్న అడుగులు బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


