OTT Crime: ఓటీటీలో ఇప్పటికీ దూసుకుపోతున్న రియల్ క్రైమ్ థ్రిల్లర్- ఒకే ఇంట్లో 2 శవాలు, 2 వేర్వేరు సీబీఐ టీమ్స్ విచారణ!
Real Crime Thriller Talvar OTT Streaming: భారతదేశాన్ని ఊపేసిన సంచలనాత్మక జంట హత్యల కేసు ఆధారంగా తెరకెక్కిన తల్వార్ ఓటీటీలో ఇప్పటికీ దూసుకుపోతోంది. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటన, మేఘనా గుల్జార్ మేకింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తల్వార్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.
Real Crime Thriller Talvar OTT Release: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు వచ్చిపడుతుంటాయి. అయితే అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ఓటీటీ వీక్షకుల మనసుపై బలమైన ముద్ర వేస్తాయి. అలాంటి కోవకు చెందినదే 2015లో విడుదలైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'తల్వార్'.

జంట హత్యల కేసు ఆధారంగా
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నోయిడా ఆరుషి తల్వార్ జంట హత్యల కేసు ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికీ ఓటీటీలో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది ఈ తల్వార్ సినిమా. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు ఇష్టపడే వారికి అద్భుతమైన విందులా ఈ సినిమా నిలుస్తుంది.
ఒకే ఇంట్లో రెండు శవాలు.. క్లూ లేని మిస్టరీ
కథ విషయానికి వస్తే, ఒకే ఇంట్లో శృతి అనే చిన్నారి, వారి ఇంట్లోనే పనిచేసే ఖేమ్‌పాల్ అనే వ్యక్తి ఘోర హత్యకు గురవుతారు. సంఘటన జరిగిన సమయంలో ఇల్లు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో, స్థానిక పోలీసులు బాలిక తల్లిదండ్రులైన రమేష్, నూతన్‌లపైనే అనుమానం వ్యక్తం చేస్తారు.
పరువు హత్యేనంటూ
ఇది పరువు హత్యేనంటూ ప్రాథమిక ముగింపునకు వచ్చి విచారణ ముగిస్తారు. ఆధారాలు సేకరించడంలో స్థానిక పోలీసు వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. అయితే అసలు మిస్టరీ అక్కడి నుంచే మొదలవుతుంది.
సీబీఐ ఆఫీసర్‌గా ఇర్ఫాన్ ఖాన్ విశ్వరూపం
కేసు తీవ్రత దృష్ట్యా ఈ దర్యాప్తు బాధ్యతలను కేంద్ర పరిశోధన సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తారు. సీబీఐ అధికారి అశ్విన్ కుమార్ పాత్రలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. రొటీన్ విచారణకు భిన్నంగా అశ్విన్ కుమార్ తల్లిదండ్రులను నిర్దోషులుగా భావిస్తూ విచారణను సరికొత్త కోణంలోకి తీసుకెళ్తారు.
రెండు వేర్వేరు సీబీఐ టీమ్స్ విచారణ
పనిమనిషి స్నేహితులపై అనుమానంతో 'ట్రూత్ సీరమ్' పరీక్షలు నిర్వహించి అసలు నిజాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వ్యవస్థలోని లోపాలు, అధికారుల మధ్య అంతర్గత విభేదాల కారణంగా దర్యాప్తు మరో బృందానికి చేరుతుంది. రెండు వేర్వేరు సీబీఐ బృందాలు ఒకే కేసును రెండు భిన్న కోణాల్లో చూసినప్పుడు సమాజం, న్యాయ వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తాయో ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
ఐఎమ్‌డీబీ 8.1 రేటింగ్
ఈ తల్వార్ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్‌తో పాటు కొంకణా సేన్ శర్మ, నీరజ్ కాబీ తమ నటనతో జీవించారు. విశాల్ భరద్వాజ్ అందించిన స్క్రీన్‌ప్లే, సంభాషణలు సినిమాకు ప్రధాన బలమని చెప్పవచ్చు. ఐఎమ్‌డీబీ (IMDb)లో 8.1 రేటింగ్ సాధించిన ఈ తల్వార్ ఓటీటీ రిలీజ్ సమయంలో మాత్రమే కాకుండా నేటికీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అత్యధికంగా వీక్షించే క్రైమ్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన చిత్రం
రియల్ ఇన్సిడెంట్ క్రైమ్‌తో తెరకెక్కిన తల్వార్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని ఈ తల్వార్ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


