Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 7 క్రేజీ సినిమాలు, సిరీస్‌లు-అన్నీ తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్-ఇవాళ, రేపటికి బెస్ట్!

Netflix OTT Movies To Watch This Weekend: ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సరికొత్త వినోదంతో అలరించనుంది. క్రైమ్ యాక్షన్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, హీస్ట్, కామెడీ జోనర్లలో టాప్ 7 సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ 7 బెస్ట్ సినిమాలు, సిరీస్‌లపై ఇక్కడ చూద్దాం.

Published on: Nov 7, 2026, 05:30:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix OTT Release Movies To Watch This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు సినీ ప్రియులు ఓటీటీ వేదికల వైపు దృష్టి సారిస్తారు. వారి అభిరుచులకు తగినట్లే ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 7 క్రేజీ సినిమాలు, సిరీస్‌లు-అన్నీ తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్-ఇవాళ, రేపటికి బెస్ట్!
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 7 క్రేజీ సినిమాలు, సిరీస్‌లు-అన్నీ తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్-ఇవాళ, రేపటికి బెస్ట్!

వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు

థ్రిల్లర్, యాక్షన్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, కామెడీ.. ఇలా ప్రతి ఒక్కరినీ అలరించే విభిన్న కథాంశాలతో రూపొందిన ఇంట్రెస్టింగ్ సినిమాలను ఇప్పుడు నెట్‌ఫ్సిక్స్ ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ, రేపటి వీకెండ్‌ను ఎంజాయ్ చేయడానికి మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోదగ్గ 7 అత్యుత్తమ సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేయండి.

1. అక్క (Akka) – లేడీ గ్యాంగ్‌స్టర్ల క్రైమ్ థ్రిల్లర్ (IMDb: 4.9)

నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్, రాధికా ఆప్టే, అన్షుమన్ పుష్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ క్రైమ్ ఓటీటీ సిరీస్ 'అక్క'. 1980ల నాటి పెర్నూరు అనే ఊహాజనిత దక్షణాది గ్రామం నేపథ్యంలో ఈ కథ రూపుదిద్దుకుంది. పురుషాధిక్యతకు భిన్నంగా మహిళల అదుపులోనే ఉండే సామాజిక వ్యవస్థ, అక్కడి అక్రమ వ్యాపారాలను శాసించే మహిళా గ్యాంగ్‌స్టర్ల చుట్టూ ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది.

2. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Least Eligible Bachelor) – వైవా హర్ష మార్క్ కామెడీ (IMDb: 6.4)

కమెడియన్ 'వైవా' హర్ష చెముడు ప్రధాన పాత్రలో దర్శకుడు బాబు దేగల తెరకెక్కించిన రోమాంటిక్ కామెడీ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. రూపురేఖలు, శారీరక అమరిక కారణంతో పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బందిపడే 'తేజ' అనే అమాయక యువకుడి కథ ఇది. హైదరాబాద్‌కు మారిన తర్వాత అతడి జీవితంలో ఎదురైన ప్రేమ అనుభవాలను కామెడీగా ఆవిష్కరించారు. హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో నటించారు.

3. సిగ్మా (Sigma) – డెబ్యూ డైరెక్టర్ జేసన్ సంజయ్ హీస్ట్ థ్రిల్లర్ (IMDb: 4.7)

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి యాక్షన్-కామెడీ హీస్ట్ థ్రిల్లర్ 'సిగ్మా'. అప్పుల్లో కూరుకుపోయిన ఒక లైబ్రేరియన్ తన లైబ్రరీని కాపాడుకోవడానికి డ్రగ్ డీలర్లు, జూదగాళ్ల ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఒక రహస్య నిధి, దాని తాళంచెవి కోసం కరడుగట్టిన నేరస్థులతో అతడి టీమ్ చేసే పోరాటం ప్రేక్షకులకు మంచి హై థ్రిల్‌ని ఇస్తుంది.

4. సబ్-ఇన్‌స్పెక్టర్ యుగంధర్ (Sub-Inspector Yugandhar) – ఆది సాయికుమార్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ (IMDb: 4.7)

యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన సస్పెన్స్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ 'ఐస్‌ఐ యుగంధర్'. పోలీస్ కస్టడీ నుంచి ఊహించని రీతిలో మాయమైన ఒక శవం, అత్యంత అనుమానాస్పద పరిస్థితుల్లో తిరిగి లభించడంతో అసలు కేసు మొదలవుతుంది. ఎస్ఐ యుగంధర్ ఈ విచిత్రమైన కేసును ఛేదించే క్రమంలో వెలుగు చూసిన సత్యాలేంటి అనేది ఆద్యంతం ఉత్కంఠ రేపుతుంది.

5. డోరతి (Dorothy) – కీర్తి సురేష్ ఫ్రెండ్‌షిప్ అండ్ లవ్ డ్రామా (IMDb: 7.7)

తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ డ్రామాలో కీర్తి సురేష్ తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రాణస్నేహితులైన ఇద్దరు మిత్రుల జీవితంలోకి 'డోరతి' అనే అమ్మాయి ప్రవేశించడంతో వారి సంబంధంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వారి బంధం ఏ మలుపు తిరిగింది అనేది ఈ చిత్రంలో హృదయానికి హత్తుకునేలా చూపించారు.

6. మీతే మే క్యా హై (Meethe Mein Kya Hai) – ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా (IMDb: 6.9)

భార్యను కోల్పోయిన దుఃఖంలో ఉన్న జై అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ నానమ్మ ఇంటి దగ్గర సమావేశమైనప్పుడు జరిగే సరదా, భావోద్వేగ సంఘటనల సమాహారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. జై సోదరి తన పెళ్లి గురించి కుటుంబానికి వెల్లడించే సన్నివేశాలు నవ్వులు పూయిస్తూనే హృదయాన్ని తాకుతాయి.

7. దిల్వాలి దివాళి (Dilwali Diwali) – పంజాబీ ఫ్యామిలీ హంగామా (IMDb: 6.1)

మిహీర్ అహూజా, మనోజ్ పహ్వా, నీలు కోహ్లీ ప్రధాన పాత్రల్లో నటించిన ప్యాకేజ్డ్ ఫ్యామిలీ డ్రామా ఇది. విదేశాల నుంచి సుదీర్ఘ కాలం తర్వాత పంజాబ్‌లోని తన స్వగ్రామానికి తిరిగొచ్చిన అన్ష్ సిక్కా, తన కుటుంబ పునఃకలయిక (ఫ్యామిలీ రీ-యూనియన్) సమయంలో ఎదుర్కొనే ఊహించని వివాదాలు, సరదా ఘట్టాల సమ్మేళనం ఈ చిత్రం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని 7 సినిమాలు

వీకెండ్‌ను ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ గడపాలన్నా, లేదా థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఎంజాయ్ చేయాలన్నా నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ 7 సినిమాలు, సిరీస్‌లు సరిగ్గా సరిపోతాయి. పైగా ఇవన్నీ తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆలస్యం ఎందుకు? మీ అభిరుచికి తగ్గ చిత్రాన్ని ఎంచుకుని ఈ వారాంతాన్ని ఓటీటీలో వినోదంతో నింపేయండి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More