OTT November: నవంబర్‌లో ఓటీటీ జాతర- 26 కొత్త సినిమాలు, సిరీసులు- హాట్‌స్టార్ ప్రైమ్ నెట్‌ఫ్లిక్స్ సోనీ లివ్ 4 ఓటీటీల్లో!
November OTT Release Movies: నవంబర్ నెలలో ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ వినోదాల విందు అందించడానికి సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్ వంటి 4 ఓటీటీల్లో ఏకంగా 26 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో చూద్దాం.
OTT Release Movies And Web Series In November: సినిమా ప్రియులకు, ఓటీటీ ప్రేమికులకు ఈ నవంబర్ నెల పండగ వాతావరణాన్ని తేనుంది. వారాంతాల్లో ఏ సినిమా చూడాలనే ఆలోచన లేకుండా, ప్రతి వారం సరికొత్త కథలతో ఓటీటీల్లో సినిమాలు అలరించనున్నాయి.

4 ఓటీటీల్లోకి 26 సినిమాలు
యాక్షన్, కామెడీ, రొమాన్స్, హారర్ థ్రిల్లర్లతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన క్లాసిక్ సినిమాలు సైతం ఈ నెల ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్ వంటి దిగ్గజ సంస్థలు మొత్తం 26 సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. అందులో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానుండటం విశేషం.
జియో హాట్‌స్టార్‌లో అలరించే సినిమాలు, సిరీస్‌లు
జియో హాట్‌స్టార్ ఈ నెల వైవిధ్యమైన కంటెంట్‌తో లైనప్ ప్లాన్ చేసింది. పిల్లలతో పాటు పెద్దలను ఆకట్టుకునే యానిమేటెడ్ చిత్రాలు, ప్రాంతీయ థ్రిల్లర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
మినియన్స్ అండ్ మాన్స్టర్స్: నవంబర్ 2న స్ట్రీమింగ్ కానున్న ఈ అడ్వెంచర్ కామెడీ చిత్రం పిల్లలను విశేషంగా అలరిస్తుంది.
మోటూ పట్లూ అండ్ ది మిస్టరీ ఆఫ్ నాగమణి: నవంబర్ 8న విడుదలయ్యే ఈ యానిమేటెడ్ చిత్రం తెలుగు, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో లభిస్తుంది.
రాబిడ్స్ ఇన్వేషన్: నవంబర్ 9న ప్రసారం కానున్న యానిమేటెడ్ ఓటీటీ సిరీస్.
పుష్పక విమానం: దామోదర్ దర్శకత్వంలో సాయి రోనక్ హీరోగా తెరకెక్కిన ఈ తెలుగు కామెడీ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ నవంబర్ 12న జియో హాట్స్టార్లోకి వస్తోంది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ - ఆఫ్టర్ ది డార్క్: రీమా మాయ దర్శకత్వం వహించిన 6 ఎపిసోడ్ల ఈ థ్రిల్లర్ సిరీస్ నవంబర్ 13న విడుదల కానుంది. షనాయా కపూర్ కీలక పాత్రలో నటించారు.
క్వీన్స్: మంగేష్ కంఠాలే తెరక్కించిన ఈ హిందీ డ్రామా సిరీస్ నవంబర్ 16 నుంచి అందుబాటులోకి వస్తుంది.
మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్: అబ్దుల్ కబీజ్ దర్శకత్వం వహించిన తమిళ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ కామెడీ సిరీస్ నవంబర్ 18న స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ ధమాకా: 13 సరికొత్త చిత్రాలు
స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నవంబర్‌లో భారీ లైనప్‌తో వస్తోంది. బాలీవుడ్ బ్లాక్బస్టర్ల నుంచి అంతర్జాతీయ లీగల్ థ్రిల్లర్ల వరకు నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో చేరాయి.
ది రేన్మేకర్: అమెరికన్ కోర్టురూమ్ డ్రామా సిరీస్ నవంబర్ 1 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
పెంపుడు జంతువుల ప్రేమికుల కోసం: 'ది పెలికాన్ బ్రీఫ్' (నవంబర్ 2), 'అ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్' (నవంబర్ 4) సినిమాలు స్ట్రీమింగ్కు వస్తున్నాయి.
సంజయ్ లీలా భన్సాలీ క్లాసిక్స్: రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణే నటించిన 'గోలియోన్ కీ రాసలీలా రామ్-లీలా' తో పాటు పీరియాడిక్ డ్రామా 'బాజీరావు మస్తానీ' నవంబర్ 3న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి.
కొరియన్, పోలిష్, జపనీస్ చిత్రాలు: పోలిష్ మెడికల్ సిరీస్ 'అనెస్తీసియా' (నవంబర్ 4), జపనీస్ రొమాంటిక్ కామెడీ 'వన్ ఇయర్ టు లివ్, బై అ మ్యాన్' (నవంబర్ 5), కొరియన్ మూవీ 'పాజిబుల్ లవ్' (నవంబర్ 6) విడుదలవుతున్నాయి.
హారర్ అండ్ స్పై థ్రిల్లర్స్: స్పై థ్రిల్లర్ 'బ్లాక్ డవ్స్ సీజన్ 2' (నవంబర్ 5), బెంగాలీ హార్రర్ థ్రిల్లర్ 'కౌరీబురి: ది కర్స్డ్ టెంపుల్' (నవంబర్ 6 - తెలుగులోనూ లభ్యం), ఫ్యామిలీ డ్రామా 'దిల్వాలీ దివాళీ' (నవంబర్ 5) అలరించనున్నాయి.
రాక్ ఆన్ & ఎలన్: ఫర్హాత్ అక్తర్ 'రాక్ ఆన్' నవంబర్ 11న, సైన్స్ ఫిక్షన్ కామెడీ 'ఎలన్' నవంబర్ 12న వస్తున్నాయి.
ప్రైమ్ వీడియో & సోనీ లివ్ ప్రత్యేకతలు
అమెజాన్ ప్రైమ్ వీడియో పాత జ్ఞాపకాలను రీఫ్రెష్ చేస్తూనే, క్రీడా ప్రముఖుల బయోపిక్‌లను తెస్తోంది. 1996 నాటి ఫ్యామిలీ కామెడీ 'జింగిల్ ఆల్ ది వే', యానిమేషన్ మూవీ 'ఆల్ డాగ్స్ గో టు హెవెన్' నవంబర్ 1న రిలీజ్ అవుతున్నాయి.
బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ జీవిత ఆధారంగా తెరకెక్కించిన 'ది గ్రేటెస్ట్' నవంబర్ 4న, అమెరికన్ ఫుట్‌బాల్ కోచ్ జాన్ మ్యాడెన్ బయోపిక్ 'మ్యాడెన్' నవంబర్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభించనున్నాయి. అలాగే యాక్షన్ హారర్ మూవీ 'దే విల్ కిల్ యు' నవంబర్ 20న రానుంది.
సోనీ లివ్‌లో నవంబర్ 13న పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరీ నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ 'పరివారిక్ మనురంజన్' స్ట్రీమింగ్ కానుంది. విభిన్న కథాంశాలతో వస్తున్న ఈ చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులకు నవంబర్ నెలంతా మంచి ఎంటర్టైన్మెంట్ అందించనున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


