OTT Horror: ఓటీటీ సండే స్పెషల్- నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో 5 హారర్ థ్రిల్లర్స్- భయపెట్టించే వేర్వేరు కాన్సెప్ట్స్

OTT Horror Thrillers On Netflix Amazon Prime: హాలోవీన్ లేదా ఇవాళ సండే సందర్భంగా ఇంట్లోనే కూర్చుని వెన్నులో వణుకు పుట్టించే హారర్ అనుభూతిని పొందాలనుకుంటున్నారా? నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ టాప్ 5 అత్యంత భయంకరమైన హారర్ థ్రిల్లర్స్‌పై లుక్కేయండి.

Published on: Nov 1, 2026, 18:30:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Horror Thrillers On Netflix Amazon Prime Hotstar: పాశ్చాత్య దేశాలకే పరిమితమైన హాలోవీన్ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులు, యూత్ రకరకాల కాస్ట్యూమ్స్ ధరించి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.

ఓటీటీ సండే స్పెషల్- నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో 5 హారర్ థ్రిల్లర్స్- భయపెట్టించే వేర్వేరు కాన్సెప్ట్స్
ఓటీటీ సండే స్పెషల్- నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో 5 హారర్ థ్రిల్లర్స్- భయపెట్టించే వేర్వేరు కాన్సెప్ట్స్

గూస్‌బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్స్

అయితే బయట తిరగడం ఇష్టం లేక, ఇంట్లోనే హాయిగా డిజిటల్ తెరపై గూస్‌బంప్స్ అనుభూతిని పొందాలని భావించే సినిమా ప్రియులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన హారర్ థ్రిల్లర్స్ అందుబాటులో ఉన్నాయి.

మనం సాధారణంగా చూసే 'చంద్రముఖి', 'అరుంధతి' తరహా హారర్ కథలు లేదా 'స్త్రీ', 'తుంబాడ్' వంటి చిత్రాలకు భిన్నంగా.. ఒంటరిగా చూస్తే చెమటలు పట్టించే టాప్ 5 సైకలాజికల్ హారర్, థ్రిల్లర్ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

సస్పెన్స్ సరిహద్దులు దాటిన అర్జెంటీనా మాస్టర్‌పీస్: 'వెన్ ఈవిల్ లర్క్స్'

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న 'వెన్ ఈవిల్ లర్క్స్' (When Evil Lurks) చిత్రం హారర్ ప్రేమికులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఐఎమ్‌డీబీ (IMDb)లో 7 రేటింగ్ సాధించిన ఈ అర్జెంటీనా సినిమా కథ ఒక దూరప్రాంత గ్రామంలో వ్యాపించే దెయ్యాల సంక్రామ్యత (Infestation) చుట్టూ తిరుగుతుంది. సాధారణ హారర్ సినిమాల్లో ఉండే మూస పద్ధతులను పక్కనపెట్టి, ఊహించని దృశ్యాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బలహీనమైన గుండె ఉన్నవారు ఈ సినిమాకు దూరంగా ఉండటమే మంచిది. ప్రైమ్, జియో హాట్‌స్టార్ 2 ఓటీటీల్లో తెలుగులో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.

యుద్ధం, అదృశ్య శక్తి మధ్య నలిగే తల్లీకూతుళ్లు: 'అండర్ ది షాడో'

1980ల నాటి ఇరాన్-ఇరాక్ యుద్ధ నేపథ్యాన్ని తీసుకుని రూపొందించిన 'అండర్ ది షాడో' (Under the Shadow) నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. బయట బాంబుల వర్షం, లోపల వేధించే భయంకరమైన అదృశ్య శక్తి. ఒకే అపార్ట్‌మెంట్‌లో చిక్కుకుపోయిన తల్లి, కూతుళ్ల మానసిక సంఘర్షణను దర్శకుడు తెరకెక్కించిన తీరు రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. కథనంలో భయం నెమ్మదిగా పెరుగుతూ వీక్షకుడిని ఉత్కంఠకు గురిచేస్తుంది.

అనాథ స్త్రీ అనుభవించిన నరకం: 'నో వన్ గెట్స్ అవుట్ అలైవ్'

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజైన 'నో వన్ గెట్స్ అవుట్ అలైవ్' (No One Gets Out Alive) ఒక అండర్‌రేటెడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న ఒక మహిళ తక్కువ అద్దెకు దొరికిన పాత భవనంలో దిగుతుంది. రాత్రి వేళల్లో వినిపించే వింత రోదనలు, భవన యజమాని దాచిన దారుణమైన నిజాలు బయటపడే కొద్దీ ప్రేక్షకుడిలో భయం రెట్టింపవుతుంది. ఈ సినిమా ముగింపు క్లైమాక్స్ చూసిన తర్వాత కొన్ని రోజుల పాటు నిద్రపట్టకపోవడం ఖాయం.

మానసిక ఒత్తిడికి గురిచేసే విందు: 'ది ఇన్విటేషన్'

నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన 'ది ఇన్విటేషన్' (The Invitation) రక్తపాతం లేకుండానే భయాన్ని పుట్టిస్తుంది. మాజీ భార్య ఇచ్చిన డిన్నర్ ఆహ్వానానికి వెళ్లిన కథానాయకుడికి, అక్కడ జరుగుతున్న వింత పరిణామాలు గమనించాక ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం వస్తుంది. చివరి 15 నిమిషాల ట్విస్ట్ ఊహకందని రీతిలో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌తోపాటు జియో హాట్‌స్టార్ ఓటీటీలో ది ఇన్విటేషన్ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది.

తైవాన్ కల్ట్ హారర్ 'ఇంకంటేషన్'

తైవాన్‌లో తెరకెక్కిన 'ఇంకంటేషన్' (Incantation) చిత్రం 'ఫౌండ్ ఫుటేజ్' శైలిలో సాగుతుంది. ఒక ప్రాచీన శాపం నుంచి తన కూతురిని కాపాడుకోవడానికి పోరాడే తల్లి కథ ఇది. వీక్షకుడిని నేరుగా ఆ శాపంలో భాగం చేసేలా తీసిన ఈ చిత్రం హ్యాలోవీన్ రాత్రికి లేదా ఈ సండే స్పెషల్‌కి సరైన ఎంపిక. ఇంకంటేషన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More